For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం మీ రాశిఫలాలు (31-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope March 31, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు ఆనందంగా ఉంటుంది. మీరిద్దరూ పరస్పర అవగాహనతో ఉంటారు. మీ ప్రియమైన వారిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పడానికి ఇదే సరైన సమయం. ఈ రోజు మీరిద్దరూ చాలా సమయం గడపడం సాధ్యమే. ప్రేమ విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు అవగాహనతో డబ్బు సంపాదిస్తారు. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఖర్చుల పెరుగుదల కూడా మీ బడ్జెట్ ను ఇబ్బంది పెట్టొచ్చు. వైవాహిక జీవితంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేరు. వారు ఈ రోజు వారి పనిలో చాలా బిజీగా ఉండవచ్చు. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించాలి. లేకపోతే అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమయంలో అదనపు పనిభారంతో మిమ్మల్ని మీరు అలసిపోకండి. లేకపోతే మీరు అనారోగ్యానికి గురవుతారు. మీ వ్యక్తిగత విషయాలను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించండి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : రాత్రి 7:30 నుండి రాత్రి 10:05 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాలలో సానుకూలంగా ఉంటుంది. అయితే ఈరోజు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. అప్పుడే మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అయితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. పనిలో ఉండే వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10:20 గంటల వరకు

ఈ రాశుల వారు కచ్చితంగా కోటీశ్వరులవుతారట... మీ రాశి ఉందేమో చూడండి మరి...ఈ రాశుల వారు కచ్చితంగా కోటీశ్వరులవుతారట... మీ రాశి ఉందేమో చూడండి మరి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో కొంత ప్రతికూలత ఉంటుంది. మీరు ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదు. ఆర్థిక పరంగా ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఆర్ధిక ప్రయోజనాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం విషయానికొస్తే ఈరోజు మీరు బలహీనంగా ఉంటారు. అయితే మీరు విశ్రాంతిపై ఎక్కువ శ్రద్ధ చూపితే మీకు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి ఉదయం 10 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. వ్యాపారులు మరియు ఉద్యోగులకు ఈరోజు అకస్మాత్తుగా పనిభారం పెరగొచ్చు. ఇలాంటి సమయంలో మీరు సహనంతో మరియు ప్రశాంతతతో పనిచేయాలి. మీరు అనుకున్నట్లుగా పనిచేస్తే, మీ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. మరోవైపు ఈరోజు కుటుంబ వాతావరణం అకస్మాత్తుగా క్షీణిస్తుంది. ఓ పాత సమస్య మళ్లీ వెలుగులోకి వచ్చి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మీ ఆదాయం బాగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 11 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలే ఉంటాయి. మీరు ఈరోజు ఏదైనా కొత్త ఆదాయ వనరులను కనుగొనవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు ఈ రోజు కొంత అదనపు డబ్బు కూడా సంపాదించవచ్చు. ఈ రోజు మీకు కార్యాలయంలో పెద్ద బాధ్యత ఇవ్వవచ్చు. మీ పనిని సకాలంలో పూర్తి చేయడం మంచిది. ఈరోజు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి ఈ రోజు మరింత శృంగారభరితంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 39

లక్కీ టైమ్ : ఉదయం 9:50 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

ఈ రాశుల వారికి రొమాన్స్ పై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుందట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి...ఈ రాశుల వారికి రొమాన్స్ పై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుందట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈ రోజు చాలా ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక పరమైన విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఏదైనా కష్టమైన పనిని సులభంగా పూర్తి చేస్తారు. మరోవైపు మీ కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. తల్లి, తండ్రి, తోబుట్టువులతో మీ సంబంధాలు బాగుంటాయి. కానీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనలో కొంత కరుకుదనం ఉంటుంది, ఈ కారణంగా మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈరోజు చిరాకుగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి. లేదంటే మీకు సమస్యలు పెరుగుతాయి. చాలా విషయాలలో ఈరోజు ఓపికగా పని చేయాలి. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోలేరని భావిస్తారు. ఇలాంటి సమయంలో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని నష్టాలు ఎదురుకావచ్చు. వ్యాపారులకు కూడా భారీ నష్టాలు వాటిల్లవచ్చు. ఈ సమయంలో మీలో ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంటే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. మీరు మీ వైవాహిక జీవితం గురించి మాట్లాడితే, మీ జీవిత భాగస్వామి నుండి మీకు మానసిక మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీ ప్రియమైనవారు మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ఉద్యోగులకు ఈరోజు బిజీగా ఉంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు ఇటీవల రాసిన పరీక్షా ఫలితం కోసం ఎదురుచూస్తుంటే, మీరు మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనదిగా ఉంటుంది. ఈరోజు మీకు ఎక్కువ ఖర్చులు ఉండవచ్చు. పనికి సంబంధించి ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. మీరు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవాలి. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు సహకారం మీకు సానుకూల శక్తిని ఇస్తుంది. మీ ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. మీరు మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 8 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈ రోజు మీరు పూర్తి విశ్వాసంతో ముందుకు వెళతారు. మీ సమస్యలు చాలా వరకు పరిష్కరించబడతాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీకు ఈరోజు ఎలాంటి ఆర్థిక సమస్యలు అనేవి ఎదురుకావు. మీరు ఈరోజు కొన్ని లాభాలను కూడా పొందుతారు. మీ కుటుంబ సభ్యులతో ఈరోజు సంబంధాలు బాగుంటాయి. మీ వివాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు ఒకరికొకరు పూర్తి మద్దతు ఇస్తారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించవచ్చు. మీకు ఆకస్మిక ధనం ప్రయోజనంగా మారే అవకాశముంది. మరోవైపు ఈరోజు మీరు ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీని వల్ల మీరు కొంత ఏకాగ్రత కూడా కోల్పోయే అవకాశం ఉంది. దీని వల్ల కొన్ని పనులు కూడా మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఈరోజు కొన్ని వివాదాలు ఉంటాయి. మీ శృంగార జీవితంలో కూడా గందరగోళం ఉంటుంది. మీ భాగస్వామితో సంబంధాలు క్షీణించవచ్చు. మొత్తంమీద, ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ఓపికగా పనిచేయడం మంచిది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

English summary

Daily Horoscope March 31, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Monday, March 30, 2020, 18:22 [IST]
Desktop Bottom Promotion