For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (04-03-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైన వారితో చాలా ఆనందంగా గడుపుతారు. ఈరోజు అకస్మాత్తుగా మీ ఇంటికి ఓ అతిధి రావచ్చు. మీరు ఈ అతిథి కోసం తీవ్రంగా షాపింగ్ చేస్తారు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయవచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

వృషభ రాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. పని విషయంలో ఈరోజు మీకు ఒత్తిడి ఉంటుంది. ఈరోజు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో ఎలాంటి రిస్కులు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు కొన్ని విషయాలపై నిరాశకు గురవుతారు. మీ పనిలో మీకు ఈరోజు శ్రద్ధ తక్కువగా ఉండొచ్చు. ఈరోజు మీరు మంచి అనుభూతి చెందుతారు. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామికి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ పాత రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 40

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి రాత్రి 7:05 గంటల వరకు

హోలీ 2020 : మీ రాశి చక్రాన్ని బట్టి హోలీకి కావాల్సిన రంగులను ఎంచుకోండి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈరోజు మీరు ఎంచుకున్న పనిని పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడతారు. మీరు ఊహించిన ఫలితాన్ని ఈరోజు పొందు తారు. మీ ఉన్నతాధికారులు మీ సామర్థ్యాన్ని చూసి చాలా సంతోషిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ నిర్ణయంతో ఏకీభవించే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి సాయంత్రం 6:20 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు శాంతంగా ఉండాలి. అలా అయితేనే మీరు చాలా సమస్యలను వేగంగా పరిష్కరించుకోగలుగుతారు. లేదంటే ఆందోళనలు తప్పవు. పొదుపుపై ​​ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ రోజు వైవాహిక జీవితంలో కొంత మెరుగుదల ఉంటుంది. మీ ప్రియమైన వారు మీకు సహాయపడవచ్చు.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఎక్కువగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీ సానుకూల ఆలోచన మిమ్మల్ని ఇతరులకన్నా ముందు ఉంచుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీరు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబంతో సమావేశమయ్యే అవకాశాన్ని పొందవచ్చు. మీరు ఖచ్చితంగా వాటి నుండి ప్రయోజనం పొందుతారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి రాత్రి 8:30 గంటల వరకు

గుడ్లగూబ నిజంగా లక్ష్మీదేవి వాహనమేనా? ఆ సమయంలో గుడ్లగూబ మీ ఇంటిపై వాలితే...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో అయోమయానికి గురవుతారు. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ ఇంట్లో కొంత ఆందోళనకర వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే మీరు ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండాలి. ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలను పొందొచ్చు. ఈరోజు మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ వ్యాపారంలో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. కార్యాలయంలో ఈరోజు సహోద్యోగులతో సమన్వయం వల్ల కొన్ని ప్రయోజనాలను పొందుతారు. ప్రేమ విషయంలో కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతారు. దీని వల్ల మీరు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేరు. మీ కుటుంబ జీవితంలో ఈరోజు ప్రశాంతత ఉంటుంది. ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది. మీ కుటుంబసభ్యులతో సంబంధాలు బలంగా ుంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు సానుకూలంగా ఆలోచిస్తారు. ఈరోజు మీ భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుంటారు. వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారిని సంతోష పెట్టడానికి, ఈ రోజు మీరు వారికి అందమైన బహుమతిని కూడా ఇచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు ఆప్యాయత, ఆశీర్వాదం లభిస్తుంది. ఈ రోజు తండ్రి నుండి ప్రయోజనాలు సాధ్యమే. ఆర్థిక పరంగా కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : ఉదయం 8:55 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఈరోజు ఆశించిన విధంగా ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాల గురించి ఆందోళన చెందుతారు. ఆర్థిక పరిమితుల కారణంగా మీకు మీ మనసులో ప్రతికూల విషయాలు ఆలోచనలకు రావచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

English summary

Daily Horoscope March 4, 2020

Daily horoscope gets you all the information related to your financial situation, business, job, health etc. of the day. Let's find out what is in your fortune today.
Story first published: Wednesday, March 4, 2020, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more