For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం మీ రాశిఫలాలు (05-03-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఈ రాశుల వారికి రొమాన్స్ పై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుందట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈ రోజు కొంత ఒత్తిడి ఉంటుంది. ఈరోజు మీరు ఆర్థిక పరమైన విషయాల గురించి ఆందోళన చెందుతారు. దీని వల్ల మీ పనులు పెండింగులో పడిపోతాయి. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించవచ్చు. ప్రేమ విషయంలో ఈరోజు కొన్ని విషయాలను తెలుసుకుంటారు. ఈరోజు పని విషయంలో సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 1:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, మీరు సొంత నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రతిదానికీ ఇతరులపై ఆధారపడటం మంచి విషయం కాదు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు పనిలో అంతరాయం కలుగుతుంది. దీని వల్ల మీరు చాలా కలత చెందుతారు. మిమ్మల్ని మీరు బాగా నియంత్రించుకోవాలి. కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఒత్తిడి వల్ల ఈరోజు ఆరోగ్యంపై కొంత ప్రభావం ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 6:50 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పనిలో శుభప్రదంగా ఉంటుంది. మీ సీనియర్లు ఆఫీసులో మీ వేగాన్ని చూసి చాలా ఆనందిస్తారు. వ్యాపారులు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనం పొందుతారు. అయితే కుటుంబ జీవితంలో ఈరోజు అసమ్మతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాల విషయంలో తేడాలు రావచ్చు. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండదు.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

ఈ 5 రాశి చక్రాల వారికి జోడి ఎప్పటికీ కుదరదని మీకు తెలుసా...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కానుంది. ఈరోజు మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవాలంటే భిన్నంగా ఆలోచించాలి. వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమ విషయంలో ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. ప్రేమ విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. శారీరకంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:40 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు షాపింగ్ చేయాలనుకుంటే, జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. ప్రేమ విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. పని విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కార్యాలయ వాతావరణం బాగుంటుంది. ఈరోజు వాహనం ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి సాయంత్రం 6:10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో మంచి మంచి ఫలితాలను పొందవచ్చు. తల్లిదండ్రులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. మీరు వారి అభిమానాన్ని పొందుతారు. వారు మీ మంచిని కోరుకుంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి. వివాహ జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఉంటుంది. మీ ఇద్దరి ప్రేమ మరింత లోతుగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. మీరు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి 11 గంటల వరకు

March Rasi Phalalu : మార్చిలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో శుభప్రదంగా ఉంటుంది. మీరు కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లయితే, మీరు గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. మీరు ఈరోజు పని విషయంలో విజయవంతం అవ్వొచ్చు. మీరు అవగాహనతో సరైన నిర్ణయాలు తీసుకుంటే, మీకు కచ్చితంగా ప్రయోజనం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వైవాహిక జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఈరోజు కొన్ని భేధాభిప్రాయాలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. వివాహిత జంటలకు ఈరోజు మంచి రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామి మీ కొన్ని ప్రధాన సమస్యలను పరిష్కరించవచ్చు. ఈ రోజు మీ ప్రియమైనవారికి అందమైన బహుమతిని ఇవ్వండి. ఆర్థిక పరంగా మెరుగ్గానే ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 42

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:05 నుండి సాయంత్రం 5 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీరు కోరుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అయితే నిరాశ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రయత్నిస్తూనే ఉండండి త్వరలో మెరుగైన పరిస్థితులను చూస్తారు. ఉద్యోగస్తులు ఈరోజు తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఆర్థిక పరంగా కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని ఆందోళనలు తొలగిపోతాయి. దీని వల్ల మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు తగ్గిపోవచ్చు. ఈరోజు మీరు మీ రంగంలో మంచి ఫలితాలను పొందలేరు. సకాలంలో పనులు కూడా పూర్తి కాలేవు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చూసే అవకాశం ఉంది. ఈరోజు మీ ఇంటి వాతావరణం భిన్నంగా ఉంటుంది. కుటుంబంలో ఈరోజు ఆనందంగా ఉంటుంది. మీరు ఈరోజు మీ భాగస్వామితో చాలా సరదాగా గడుపుతారు. మీరు ఈరోజు చాలా తెలివిగా పని చేయాలి. ఈరోజు మీ ఆర్ధిక పరిస్థితి చాలా బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, మీ కుటుంబం మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని అపార్థాలను తొలగించడానికి ఇది సరైన సమయం. పని విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థికపరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

English summary

Daily Horoscope March 5, 2020

Daily horoscope gets you all the information related to your financial situation, business, job, health etc. of the day. Let's find out what is in your fortune today.
Story first published: Thursday, March 5, 2020, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more