Latest Updates
-
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి
శుక్రవారం మీ రాశిఫలాలు (06-03-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు ఈరోజు మీ తోబుట్టువులతో చాలా సరదాగా గడుపుతారు. ఈరోజు అన్ని విషయాల్లో మీకు సాధారణం కంటే శుభప్రదంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు బలంగా ఉంటుంది. మీరు ఈరోజు కొంత కష్టపడి పని చేస్తారు. మీరు మానసికంగా బలంగా మరియు ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్య పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఈరోజు తొలగిపోవచ్చు. వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు బిజీగా గడుపుతారు. వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. బయటి ఆహారం తినడం మానుకోండి.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు శృంగార జీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు మీరు మీ ప్రియమైన వారి పట్ల అవగాహనతో ఎలాంటి సమస్యను అయినా పరిష్కరిస్తారు. మీ వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బలంగానే ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : తెల్లవారుజామున 4:55 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండదు. ఈ రోజు ఏదైనా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే వాయిదా వేసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలోనూ ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. మరోవైపు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ పనిపై పూర్తి శ్రద్ధ వహించండి. మీరు సాయంత్రం కొన్ని శుభవార్తలను వింటారు. దీని వల్ల మీకు కొంత ఒత్తిడి తగ్గుతుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు మనసులో గందరగోళం ఉంటుంది. దీని వల్ల ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది మీ మొత్తం కుటుంబాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు స్వేచ్ఛగా ఖర్చు చేస్తారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఒక సమస్య ఎదురుకావచ్చు.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. అయితే మీరు ఎవరితో అయినా వాదన పెంచుకుంటే అది పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబంలో ఈరోజు ఆనందంగా ఉంటుంది. దీని వల్ల మీకు కుటుంబ సభ్యుల ఆప్యాయత లభిస్తుంది. మీ సహోద్యోగుల సహాయంతో ఓ ముఖ్యమైన పనిని ఈరోజు పూర్తి చేస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు కుటుంబంతో ఆనందకరమైన రోజును గడుపుతారు. అయితే మీరు ఈరోజు మీ కోపాన్ని బాగా నియంత్రించుకోవాలి. లేదంటే పరిస్థితులు ఉద్రిక్తగా మారతాయి. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవితంలో ఏదైనా సానుకూల మార్పు రావచ్చు.
లక్కీ కలర్ : కుంకుమ
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. భవిష్యత్తులో పెద్ద లాభం వచ్చే ప్రాజెక్టులో మీకు పని చేసే అవకాశం లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు లాభాలను పొందుతారు. దీని వల్ల మీ పాత రుణాల్ని పూర్తి చేయగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలంగా మారుతుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 25
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. దీని వల్ల మీరు మానసికంగా కూడా బాధపడతారు. అయితే ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీకు అదనపు ఆదాయం సంపాదించడానికి అవకాశం లభిస్తుంది. ఈరోజు మీ ప్రత్యర్థులు మీకు కఠినమైన పోటీ ఇస్తారు. మరోవైపు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఈరోజు అవసరమైన దాని కంటే ఎక్కువగా ఖర్చు చేయకూడదు. ప్రతికూల పరిస్థితుల్లో చాలా ధైర్యంగా వ్యవహరించాలి. కష్టపడి పని చేస్తే మీకు కచ్చితంగా లక్కీ కలిసి వస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఒక పెద్ద సమస్య ఎదుర్కోవచ్చు.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 7:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులు ఈరోజు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు మీ భాగస్వామితో కలిసి చాలా సమయం గడుపుతారు. విద్యార్థులు ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు. ఈరోజు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురుకావచ్చు. మీ ఇద్దరి మధ్య కొన్ని విషయాల పట్ల మనస్పర్దలు రావచ్చు. ప్రేమ విషయంలో ఈరోజు ఒత్తిడి ఉంటుంది. ఈరోజు మీరు మీ సంబంధం గురించి కొంత గందరగోళంగా ఉంటారు. విద్యార్థులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తుంటే మీరు విజయం సాధించే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు



Click it and Unblock the Notifications