For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (07-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు జీవితంలో పెద్ద మార్పు రావచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎక్కువ శ్రద్ధ చూపాలి. అప్పుడే మీరు సరైన దిశలో పయనిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల మీకు తగినంత విశ్రాంతి లభిస్తుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి త్వరలో కొత్త మలుపులు రావచ్చు. విదేశాలలో పని చేయాలనే మీ కల నెరవేరే అవకాశం ఉంది. దీని వల్ల మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు మరింత ఎక్కువ కష్టపడాలి. ప్రేమ విషయంలో సమయం అనుకూలంగా ఉంటుంది. వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం క్షీణిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :16

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా ముఖ్యమైనది. మీరు ఈరోెజు ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకోవాలనుకుంటే జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకండి. సరైన సమయం మరియు అవకాశం కోసం వేచి చూడండి. మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అదనపు ఆదాయం సంపాదించే బలమైన అవకాశం ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా పెరగడం వల్ల మీరు డబ్బును ఆదా చేయలేరు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందకరమైన రోజు గడుపుతారు.

మీరు ఒకరితో ఒకరు సంతోషంగా ఉంటారు. అయితే ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం చాలా బాగా ఉంటుంది. కాబట్టి మీరు మానసిక శాంతి మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. ఈరోజు మీరు పనిలో ఆశించిన విధంగా ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఈరోజు ఏదైనా పెద్ద ప్రయోజనం పొందవచ్చు. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని నివారించాలి. సమస్య మరింత పెరగకుండా వైద్యుడిని సంప్రదించాలి. కుటుంబ సభ్యుల మద్దతు వల్ల ఈరోజు మీకు కొన్ని విషయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. వివాహితులకు ఈరోజు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 44

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఆర్థిక పరంగా ఈరోజు లక్కీ కలిసి వస్తుంది. పని విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబానికి పూర్తి మద్దతు, ప్రేమ లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో చిన్న గొడవలు రావచ్చు. కానీ సాయంత్రంలోపు అంతా సాధారణంగా మారిపోతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. దీని వల్ల మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. మీరు కుటుంబం నుండి దూరంగా ఉండొచ్చు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ పరిమితులను దాటొద్దు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి 10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు గొప్పగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత మీకు మానసిక శాంతి కలుగుతుంది. ఈరోజు మీరు కొన్ని ప్రయత్నాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి. ఇది మీ మనసును చాలా ఆనందపరుస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబంలోనూ సంబంధాలు బలపడతాయి. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 6:45 నుండి రాత్రి 10:25 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఈరోజు మీరు ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటే, అది కుటుంబం మొత్తంపై ప్రభావం చూపుతుంది. ఆర్థిక పరంగా పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయి. మీరు ఈరోజు ఓ కొత్త ప్రదేశం నుండి డబ్బు పొందవచ్చు. దీని వల్ల మీకు ఆర్థిక పరంగా ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది. పని విషయంలో ఈరోజు గొప్పగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు మీరు వ్యాయామం మొదలుపెట్టాలి.

లక్కీ కలర్ : బ్లూై

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7:55 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. అయితే ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించాలి. మరోవైపు వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు ఉంటుంది. శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఈ రోజు మీరు మీ ప్రియుడు / స్నేహితురాలితో మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళవచ్చు. మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరిద్దరూ తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :24

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు వివాహ జీవితంపై తక్కువ శ్రద్ధ చూపడం మంచిది. అయితే మీ జీవిత భాగస్వామిని విస్మరించడం అనేది మీ సంబంధానికి మంచిది కాదు. ఈరోజు వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పనిలో మీరు కష్టపడితే, మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ :34

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి 9 గంటల వరకు

English summary

Daily Horoscope March 7, 2020

Daily horoscope gets you all the information related to your financial situation, business, job, health etc. of the day. Let's find out what is in your fortune today.
Story first published:Friday, March 6, 2020, 23:45 [IST]
Desktop Bottom Promotion