Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
శుక్రవారం మీ రాశిఫలాలు (01-05-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. కానీ మీ ఖర్చులను కూడా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. మీరు పొదుపుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి. పని విషయంలో ఈరోజు గౌరవం దక్కుతుంది. మీ మనసులో కూడా మంచి భావన ఉంటుంది. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 32
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారి మొండి స్వభావం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, మీరు ప్రతి ఒక్కరితో చాలా సున్నితంగా వ్యవహరించాలి. ముఖ్యంగా మీ కుటుంబసభ్యులు మరియు స్నేహితుల వద్ద జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుంటారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆరోగ్య విషయం బాగుంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు ఈరోజు ఏ పని మీద శ్రద్ధ పెట్టలేరు. దీని వల్ల మీ పనులన్నీ పెండింగులో పడిపోతాయి. వ్యాపారులకు ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ విషయంలో ఈరోజు గొప్పగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఉత్సాహం ఉంటుంది. మీరు మానసికంగా బాగా అనుభూతి చెందలేరు.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9:15 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు ఎలాంటి సమస్యలు ఎదురైనా, మీరు వాటిని తెలివిగా పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. లేకపోతే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము గురించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ చూపలేకపోతారు. అయితే వ్యాపారులకు ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారం చాలా వేగంగా పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో కొంత గందరగోళంగా ఉంటుంది. మీ ప్రియమైన వారి యొక్క కఠినమైన వైఖరి మిమ్మల్ని చాలా బాధపెడుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:15 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పవి విషయంలో శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీ సామర్థ్యం పెరుగుతుంది. మీరు అన్ని పనులను సులభంగా పూర్తి చేస్తారు. దీని వల్ల త్వరలో మీకు పురోగతి లభించవచ్చు. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మంచిగా ఉంటుంది. అంతేకాదు సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. చాలా రోజుల తరువాత మీరు ఇలాంటి సమయం గడిపిన తరువాత సంతోషంగా ఉంటారు. మరోవైపు, శృంగార జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. అయితే ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీరు తక్కువ ప్రయత్నంతో ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు. ఇది కాకుండా, పెండింగులో ఉన్న పనులన్నీ ఈరోజు మీరు ఆశించిన విధంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో సీనియర్ల మనసును గెలుచుకుంటారు. ఈరోజు మీ ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. మీరు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులైతే, మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : రాత్రి 9:20 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో ప్రతికూలత ఎదురవుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఫలితం మీరు ఆశించిన విధంగా రాదు. ఇది మిమ్మల్ని చాలా నిరాశపరుస్తుంది. మీరు వివాహం చేసుకుంటే, ఈ రోజు మీ జీవిత భాగస్వామికి అబద్ధం చెప్పడం మానుకోండి. లేకపోతే మీ మధ్య పెద్ద వివాదం ఉండవచ్చు. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. చాలా కాలం తరువాత, ఈ రోజు స్నేహితులతో గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 13
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో ఈరోజు కష్టంగా ఉంటుంది. అనవసరంగా వాదించడం వల్ల మీ మానసిక శాంతికి భంగం కలిగించవద్దు. లేకపోతే మీరు పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేరు. మీరు ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. ఈ రోజు, సన్నిహితుడి సహాయంతో, మీ కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. దీని వల్ల పెద్ద ఆందోళన తొలగిపోతుంది. ఇందుకుగాను మీరు మీ స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రేమ విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో, ఈ సమాచారం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు అవుతుంది. మీరు వ్యాపారం చేస్తే, ఈ రోజు సంక్లిష్టమైన వ్యాపార విషయాన్ని పరిష్కరించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు అద్దె ఇంట్లో నివసిస్తూ, మీ స్వంత ఇంటి గురించి కలలు కంటున్నట్లయితే, మీరు ఈ రోజు కొన్ని మంచి వార్తలను వినొచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. మీ ఇద్దరి ప్రేమ పెరుగుతుంది.
ఆరోగ్య పరంగా ఈరోజు ప్రయోజనాన్ని పొందుతారు.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 36
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు ఒత్తిడిని మరచిపోయి, వారి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కలిసిపోయిన తరువాత, మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ రోజు మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా చర్చించవచ్చు. మీరు ఉద్యోగం చేస్తే ఈ రోజు కార్యాలయంలో మీ పనిపై దృష్టి పెట్టాలి. సహోద్యోగుల జాగ్రత్తగా ఉండటం మర్చిపోవద్దు. లేకపోతే మీరు మీరే ఇబ్బందుల్లో పడవచ్చు. వ్యాపారులకు ఈ రోజు ముఖ్యమైనది. మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీకు ఆర్థిక సహాయం అవసరమైతే మీరు ఈ రోజు కొన్ని మంచి వార్తలను వింటారు. ఆరోగ్య పరంగా మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి ఉదయం 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు పెద్ద ఆర్థిక పరంగా పెద్ద ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఆశించిన ఫలితం పొందుతారు. మీరు కొత్త ప్రాజెక్ట్‌లో పని చేస్తుంటే, ఈ రోజు మీకు సీనియర్ల పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో విశ్రాంతి సమయాన్ని గడుపుతారు. మీ కుటుంబంలో శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు ఆరోగ్య పరంగా ఫలితాలను పొందుతారు. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి ఉపశమనం ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 36
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...



Click it and Unblock the Notifications











