బుధవారం మీ రాశిఫలాలు (20-05-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope May 20, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈరోజు మీరు అసూయపడే వ్యక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో మీ ప్రవర్తనను నియంత్రణలో ఉంచుకోవాలి. మీ మనసులో ఏదైనా గందరగోళం ఉంటే, మీరు ఒక మత పుస్తకాన్న చదవాలి. ఉద్యోగులకు ఆఫీసులో పని భారం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా మీరు చాలా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా బలంగా ఉండేందుకు ఉదయాన్నే నిద్రలేచి తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు లాభం కావాలనుకుంటే, మీ ప్లానులో కొన్ని మార్పులు చేయాలి. ఉద్యోగులు సోమరితనాన్ని నివారించాలి. లేదంటే మీకు పని భారం పెరగవచ్చు. ఎవరైనా మిమ్మల్ని సహాయం కోరితే, కచ్చితంగా వారికి సహాయం చేయండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వస్తే, దీని కోసం మీరు మొదట మానసికంగా బలంగా ఉండాలి. తద్వారా మీరు సరైన నిర్ణయం తీసుకోవచ్చు. జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్య పరంగా మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ పెరుగుతున్న ఖర్చులను మీరే నియంత్రించాలి. లేదంటే త్వరలో మీరు ఆర్థిక సంక్షోభంలో పడతారు. ఉద్యోగులకు ఈరోజు పని భారం ఎక్కువగానే ఉంటుంది. అయితే మీరు జాగ్రత్తగా పని చేయాలి. ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. వ్యాపారులకు ఈరోజు కొంత ఉపశమనం ఉంటుంది. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : ఉదయం 10:20 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ విషయంలో ఏదైనా వివాదం ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలను మరచిపోవడానికి స్నేహితులతో కొంత సమయంలో గడపడానికి ప్రయత్నించాలి. అయితే ఉద్యోగులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు మెరుగైన అవకాశం ఉంటుంది. అయితే మీరు ఎలాంటి లావాదేవీలు చేయకండి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ఇతరుల మాటలను ఎక్కువగా నమ్మకండి. మీరు ముఖ్యమైన పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టండి. మీరు మంచి ఏదో చెడు ఏదో గమనించాలి. ఉద్యోగులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు సమయానికి పనులు పూర్తి చేయాలి. వ్యాపారులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అదనపు ఖర్చులు కూడా ఉండొచ్చు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు సహనంతో పని చేస్తే, విషయాలు మీకు చాలా తేలికవుతాయి. లేకపోతే మీరు అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంతేకాదు మీరు నిరాశ కూడా చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన షాపింగ్ కూడా చేయవచ్చు. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆప్యాయత, మద్దతు లభిస్తుంది. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఏదైనా ఆందోళన మిమ్మల్ని వెంటాడవచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ పని విషయంలో సాధారణంగా ఉంటుంది. అయితే మీరు కష్టపడి పనిని పూర్తి చేస్తారు. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మీ మానసిక ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. అలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతకాలంగా పెండింగులో ఉన్న పనులు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు మీ యజమాని మిమ్మల్ని విశ్వసించి, కొన్ని ముఖ్యమైన బాధ్యతలను మీకు అప్పగించవచ్చు. ఇలాంటి సమయంలో మీరు వారిని నిరాశపరచకపోవడమే మంచిది. విద్యార్థులు అధ్యయనాల పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. మీరు మీ సమయాన్ని బాగా ఉపయోగిస్తే మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో సంబంధం మధురంగా ​​ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు మీ తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులుంటాయి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 40

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో ఏదైనా ఆందోళన చెందుతుంటే, అనుభవజ్ఞులైన సలహా ఈ సమయంలో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో మీరు కొత్త దిశను పొందుతారు. మీరు త్వరలో పెద్ద అభివృద్ధిని చూస్తారు. ఉద్యోగులు ఈరోజు ఏదైనా సవాలును స్వీకరించడంలో వెనక్కి తగ్గకండి. రాబోయే కాలంలో ఇది మీ కోసం ప్రమోషన్ యొక్క తలుపులు తెరుస్తుంది. మరోవైపు జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. కష్ట సమయాల్లో కూడా మీరు వారి ప్రేమపూర్వక మద్దతు పొందుతారు. మీ ధైర్యం అలాగే ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఏదైనా పెట్టుబడి పెడితే, రాబోయే సమయంలో మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు కుటుంబంతో సరదాగా ఉండే రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఆరోగ్య పరంగా మీరు శారీరకంగా చాలా మంచి అనుభూతి చెందుతారు. అలాగే, మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం మీరు సౌకర్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మరోవైపు ఈరోజు మీకు పని భారం ఎక్కువగా ఉండదు. మీ కోసం మీకు కొంత అదనపు సమయం లభిస్తుంది. ఈ రోజు మీరు మీ కుటుంబ జీవితంపై కూడా శ్రద్ధ చూపగలుగుతారు. కొన్ని సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి మీరు మీ జీవిత భాగస్వామి సహాయం తీసుకోవచ్చు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు, మీ పెద్దల సలహాలు తీసుకోండి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 33

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో మంచి ప్రదర్శన ఇవ్వగలరు. మీ సీనియర్లు మరియు సహోద్యోగులతో కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. వ్యాపారులు ఈరోజు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీకు చాలా విషయాలు కలిసి వస్తాయి. కుటుంబ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉండవచ్చు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8:55 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Wednesday, May 20, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion