మంగళవారం దినఫలాలు : ఓ రాశి వారికి బడ్జెట్ కు మించి ఖర్చులు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, వైశాఖ మాసం మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope May 25, 2021

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో బిజీగా ఉంటుంద. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీరు చేసిన కృషికి మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారులు ఈరోజు మీ నిర్ణయాన్ని చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. ఈ సమయంలో మీకు మంచి ప్రణాళిక అవసరం. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి ఆప్యాయత మరియు మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ సహోద్యోగులతో వివాదం జరిగే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వస్త్రవ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీ వ్యక్తిగత జీవితంలో కొంత ఉత్సుకత ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచడానికి మీరు చేసే ప్రయత్నాలను వేగవంతం చేయాలి. ఆరోగ్య పరంగా ఈరోజు నిర్లక్ష్యంగా ఉండకండి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఈరోజు కుటుంబంతో ఆనందకరమైన రోజు అవుతుంది. మీ తమ్ముడు లేదా సోదరి వివాహానికి అర్హులు అయితే, ఈరోజు వారికి మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. త్వరలో మీ ఇంట్లో మాంగళ్య కార్యక్రమం నిర్వహించొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు ఈరోజు నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. లేదంటే ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో బాధ్యతల భారం పెరుగుతుంది. మీరు తొందరపాటులో ఏ పని చేయకపోవడమే మంచిది. లేకపోతే మీరు పెద్ద తప్పులు చేయొచ్చు. వ్యాపారులు ఈరోజు మంచి ఆ్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు ఇంటి సభ్యులతో మంచి సంబంధం కలిగి ఉంటారు. ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ ఆదాయం బాగానే ఉంటుంది. కానీ పెరుగుతున్న ఖర్చులు మీ బడ్జెట్‌ను పాడుచేయవచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6:45 నుండి రాత్రి 10 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. లేకపోతే మీరు అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఏదైనా సమస్యపై అనవసరంగా మాట్లాడటం మానుకోండి. ఉద్యోగులు ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలను పొందొచ్చు. మీ పురోగతికి సంకేతాలు ఉన్నాయి. ఈరోజు ఒక విదేశీ కంపెనీలో పనిచేయాలనుకునే ప్రజలకు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, పెద్ద వ్యాపారులు ఆర్థిక పరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు ఏదైనా పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయబోతున్నట్లయితే, పూర్తి జాగ్రత్త వహించాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. వారు మీకు ఏదైనా సలహా ఇస్తే, ఖచ్చితంగా దాన్ని పరిగణించండి. ఈరోజు చిన్న వ్యాపారులకు లాభదాయకమైన రోజు కానుంది. మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు క్రొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, మీరు తొందరపడకుండా ఉండాలి. మీరు ప్రశాంతంగా మరియు తెలివిగా వ్యవహరించాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా అంతా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 7 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు మంచి అవకాశం రావొచ్చు. త్వరలో మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీకు కార్యాలయంలో పనిభారం తక్కువగా ఉండొచ్చు. ఇది కాకుండా, మీరు ఉన్నతాధికారులతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు పొదుపుపై ​​ఎక్కువ శ్రద్ధ చూపగలుగుతారు. ఇంటి పెద్దలతో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. మీ తప్పు వైఖరి వారి భావాలను దెబ్బతీస్తుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి మీ నమ్మకం బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీకు సీనియర్ అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న ప్రజల పెద్ద సమస్యను పరిష్కరించవచ్చు. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీకు మంచి ఆర్థిక ప్రయోజనం లభించకపోతే మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే, మీరు సహనంతో పనిచేయాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని విభేదాలు ఉండవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీరు పాత బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం చాలా బాగుంటుంది. ఈ రోజు మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. మీ పనితీరుతో బాస్ చాలా సంతృప్తి చెందుతారు. ఈరోజు మీకు పురోగతి లభించొచ్చు. వ్యాపారులు ఏదైనా మార్పు గురించి ఆలోచిస్తుంటే, ఈరోజు దానికి మంచిది. మీరు అనుభవజ్ఞులైన కొంతమంది వ్యక్తులను సంప్రదించినట్లయితే మీకు మంచిది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు ఇంటి సభ్యుల నుండి మద్దతు పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో చాలా శృంగార సమయాన్ని గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 45

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు ఇంటి సభ్యులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. ఈరోజు మీకు తోబుట్టువులతో గొప్ప సమయం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సహాయంతో, మీరు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేసే అవకాశం ఉంది. ఈరోజు పని, ఉద్యోగం లేదా వ్యాపారం గురించి మాట్లాడుతుంటే మీరు చాలా కష్టపడాల్సి రావచ్చు. ఆఫీసులో బాస్ యొక్క మూడ్ చాలా వేడిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయవద్దు. మీకు గుండె జబ్బులు ఉంటే, ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా మీరు పని చేస్తే, ఆఫీసులో ఎక్కువ పోటీ ఉంటుంది. బహుశా ఈరోజు మీరు ఒకేసారి అనేక పనులను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే అది మీ పనిపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. వ్యాపారులు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అన్నయ్యతో సంబంధాలు మరింత బలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. మీరు సౌకర్యంపై దృష్టి పెట్టాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో ఏదైనా ముఖ్యమైన బాధ్యత అప్పగించవచ్చు. మీ యజమాని మరియు ఉన్నతాధికారులను నిరాశపరచకపోవడమే మంచిది. మీరు ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయగలిగితే, మీరు ఖచ్చితంగా పురోగతి సాధిస్తారు. ఈరోజు వ్యాపారులకు చాలా బిజీగా ఉండబోతోంది. హోల్‌సేల్ వ్యాపారులు బాగా లాభపడే అవకాశం ఉంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో కష్టంగా ఉంటుంది. కోపంతో తప్పుడు పదాలను వాడటం మానుకోండి, లేకపోతే మీ ఇంటి శాంతి చెదిరిపోతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Tuesday, May 25, 2021, 5:00 [IST]
Desktop Bottom Promotion