For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం మీ రాశిఫలాలు (28-05-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కష్టమైన పని ఉండొచ్చు. అయితే మీరు పూర్తి ఉత్సాహంతో దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అస్పష్టతను నివారించండి లేకపోతే మీ పురోగతి కల అసంపూర్ణంగా ఉంటుంది. ఈ రోజు వ్యాపారులు మంచి ఫలితాలను పొందవచ్చు. మీ కృషి విజయవంతమవుతుంది. మీ వ్యక్తిగత జీవితం ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఈరోజు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి రాత్రి 8:05 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందించండి. మీరు మీ ఇంట్లో వారితో కలిసి ఇష్టమైన సినిమా చూడటం ద్వారా వినోదం పొందే అవకాశం ఉంది. ఇది మిమ్మల్ని మరోసారి ఉత్తేజ పరుస్తుంది. మరోవైపు ఈరోజు మీరు పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులకు ఈరోజు ఇబ్బందులు పెరుగుతాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ధైర్యంగా పని చేయాలి. త్వరలో మీ సమస్య పరిష్కరించబడుతుంది. విద్యార్థులకు విద్యలో ఏవైనా అడ్డంకులు ఉంటే సూర్యభగవానుడిని ఆరాధించాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని మీరు భావిస్తారు. అలాంటి సమయంలో మీ మాటలను ప్రశాంతంగా మరియు ప్రేమగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్య పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 6:05 నుండి రాత్రి 9:30 గంటల వరకు

ఈ 4 రాశుల వారు అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తారట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!ఈ 4 రాశుల వారు అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తారట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు పాజిటివిటీని అనుభవిస్తారు. మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం మానసికంగా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.అయితే, మీరు పరిష్కరించాల్సిన చాలా పనులు ఉంటాయి. ఉద్యోగులు ఈరోజు ఉన్నతాధికారులతో ఒక సమావేశంలో ఒక పాల్గొంటారు. వ్యాపారుల ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు మీ ఆర్థిక నిర్ణయాలు ఇదే విధంగా తీసుకుంటే, రాబోయే సమయంలో మీరు పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 8:25 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో చిరాకు పడొచ్చు. మీరు చేసే పనిలో కూడా మీకు సరైన అనుభూతి ఉండదు. మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు ఉంటాయి. ఇలాంటి సమయంలోనే మీరు మీ ప్రియమైన వారిని ప్రేమగా చూసుకోవాలి. ఉద్యోగులు ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగాలను మార్చాలని, ఆలోచిస్తున్నట్లయితే, మీ ఆలోచనను సానుకూల ఆలోచనతో తీసుకోండి. వ్యాపారులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. మరోవైపు ఈరోజు మీ విలువైన వస్తువుల గురించి మరింత అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మీకు నష్టం రావచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 5:20 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు సరైన అవగాహన మరియు తెలివితేటలతో పనిలో ఏర్పడ్డ పెద్ద సమస్యను పరిష్కరించగలుగుతారు. వ్యాపారులకు ఈరోజు కొంత ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు పెద్ద సమస్యను ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

శని మకరంలోకి ప్రవేశించే సమయంలో ఏయే రాశుల వారికి లాభమంటే...!శని మకరంలోకి ప్రవేశించే సమయంలో ఏయే రాశుల వారికి లాభమంటే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. అయితే మీ ఖర్చులు కొంత పెరుగుతాయి. మరోవైపు ఈరోజు మీ కుటుంబం కోసం కొంత సమయం కేటాయించాలి. ముఖ్యంగా మీరు పిల్లలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ జీవిత భాగస్వామి మద్దతుతో మీరు మానసికంగా మెరుగ్గా ఉంటారు. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి 11 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎట్టి పరిస్థితులలో తొందరపడకుండా ఉండాలి. ముఖ్యంగా మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. మీ పనులు చాలా ఆటంకాలు ఎదురవుతాయి. ఎలాంటి పరిస్థితిలో అయినా పూర్తి విశ్వాసంతో పని చేయాలి. వ్యాపారులు కూడా సత్వరమార్గాన్ని అవలంభించకుండా ఉండాలి. మీకు ఈరోజు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 4:10 నుండి 3:50 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో పవిత్రంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారులకు సువర్ణావకాశం లభిస్తుంది. మీరు వ్యక్తిగత జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరును కనుగొనవచ్చు. అయితే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవ్వరినీ నమ్మకండి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:55 నుండి రాత్రి 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి సమయం అనుకూలంగా లేదు. ప్రత్యేకించి మీరు కొత్త ఆస్తిని కొనాలని ఆలోచిస్తుంటే మీరు మరికొంత సమయం వేచి ఉండాలి. మీరు కొంత ఒత్తిడికి లోనవుతుంటే, మీరు మీ సన్నిహితులు లేదా కుటుంబసభ్యులతో మాట్లాడాలి. ఇది మీ మనస్సును చాలా తేలికపరుస్తుంది. ఈరోజు మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు మంచి ప్రయోజనాలు పొందొచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పని పరంగా చాలా ముఖ్యైన రోజు. నిరుద్యోగులు ఇటీవల ఏదైనా ఇంటర్వ్యూకు హాజరైనట్లయితే, మీరు సానుకూల సమాధానం పొందవచ్చు. మీకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వ్యాపారులకు ఈరోజు గొప్ప రోజు అవుతుంది. అయితే ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, ఈరోజు పరిష్కారమవుతుంది. చాలా కాలం తర్వాత మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత సమస్యలపై కూడా శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రలికూతంగా ఉంటుంది. మీరు డబ్బు కోల్పోయే బలమైన అవకాశం ఉంది. మీరు ఆర్థిక నిర్ణయాలు తొందరలో తీసుకోకూడదు. ఈ రోజు పిల్లల వైపు నుండి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. మీరు అధ్యయనాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఉన్నతాధికారులు కేటాయించిన పనిని జాగ్రత్తగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope May 28, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Thursday, May 28, 2020, 0:22 [IST]
Desktop Bottom Promotion