ఆదివారం మీ రాశిఫలాలు (31-05-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope May 31, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు ఉన్నతాధికారుల అంచనాలను అందుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు మీ పనులను సీరియస్‌గా చేయకపోతే, రాబోయే సమయంలో మీరు ఇబ్బందుల్లో పడవచ్చు, అంటే మీ ఉద్యోగం కూడా వెళ్ళవచ్చు. వ్యాపారులు కూడా తమ ప్రణాళికలను కొత్తగా చేసుకోవాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీరు మీ ప్రియమైన వారితో ఆనందకరమైన రోజు గడుపుతారు. అలాగే అవివాహితులు ఈరోజు వివాహం గురించి ఓ శుభవార్తను వింటారు. ఈరోజు మీరు సరైన ఫలితాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు అకస్మాత్తుగా ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటారు. అయితే మీరు ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటారు. విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ చదువులో ఏమైనా అడ్డంకులు ఉంటే మీరు మీ పెద్దలు మరియు గురువుల సహాయం తీసుకోవాలి. మీరు ఆన్‌లైన్ తరగతుల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ సహోద్యోగులలో కొందరు మీ పనికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. మీరు తెలివితేటలతో పనిచేయడం మంచిది. మరోవైపు, వ్యాపారులు ఓపిక పట్టాలి. మీరు పూర్తి సానుకూలత మరియు ధైర్యంతో ప్రయత్నిస్తూనే ఉంటారు. త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈ రోజు మీరు పాత అప్పుల నుండి బయటపడవచ్చు. దీని వల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు వినూత్న పద్ధతుల ద్వారా ఉన్నతాధికారులను బాగా ఆకట్టుకుంటారు. ప్రతికూల పరిస్థితులలో కూడా మీరు సులభంగా పని చేయగల మీ కళ కూడా ఈ రోజు ప్రశంసించబడుతుంది. మరోవైపు ఈ రోజు వ్యాపారులు ప్రమాదకర నిర్ణయం తీసుకోవచ్చు. మిమ్మల్ని మీరు నమ్మండి మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు. కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు మీ కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే, చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి, లేకపోతే రాబోయే కాలంలో మీరు చాలా ఇబ్బందుల్లో పడవచ్చు. ఉద్యోగులు సహోద్యోగులతో మీ సంబంధాన్ని మెరుగుపర్చడానికి అన్ని ప్రయత్నాలు చేయడం మంచిది. మీరు ఖచ్చితంగా దాని నుండి మంచి ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఈ రోజు పెద్ద ఖర్చులు ఉండవు. అయితే, ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించకుండా ఖర్చు చేయడం మానుకోండి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3:45 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం మానుకోవాలి. లేకపోతే మీరే ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈరోజు మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా ఒత్తిడిని అనుభవించవచ్చు. మీరు ప్రశాంతమైన మనస్సుతో పనిచేయడానికి ప్రయత్నిస్తే, మీ పనులన్నీ సమయానికి సులభంగా పూర్తవుతాయి. ఈ రోజు ఆర్థిక పరంగా ఖరీదైనదిగా ఉంటుంది. మీ ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 9:45 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈ రోజు మీ వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ రోజు మీరు చాలా విషయాల్లో అన్ని అపోహలను తొలగించే అవకాశం ఉంది. మీకు విశ్వాసం పెరుగుతుంది. మీరు వ్యాపార విషయాలలో మంచి విజయాన్ని పొందుతారు. అయితే, ఈ సమయంలో మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. మరోవైపు, నిరుద్యోగులు కొన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మీ మీద నమ్మకం ఉంచండి మరియు కష్టపడండి. ఆర్థికంగా మెరుగ్గానే ఉంటుంది. ఈ రోజు పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించడంలో కూడా మీరు విజయవంతం కావచ్చు. ఆరోగ్య పరంగా మంచిగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:45 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా మంచి రోజు అవుతుంది. మీకు అందరి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే, కొన్ని మంచి సలహాలు వల్ల ప్రయోజనం చేకూరుతుంది. మరోవైపు, మీరు వ్యాపారం చేస్తే మరియు మీరు ఇటీవల పెద్ద నష్టాన్ని చవిచూస్తే, దాని కోసం మీరు ఈ రోజు కొన్ని ప్రణాళికలు చేయవచ్చు. ఈ సమయంలో విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. మీరు సాధన చేస్తూనే ఉండాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో సంబంధం బాగుంటుంది. మీకు అందరి నుండి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యా రంగంలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు, వ్యాపారులు ఈ రోజు కూడా చిన్న లాభాలను పొందవచ్చు, ప్రత్యేకించి మీ వ్యాపారం కలప, ఇనుము లేదా ఆహారం ఉంటే, ఈ రోజు ఆర్థిక లాభం సాధ్యమవుతుంది. కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో వివాహితులకు ఈ రోజు శృంగార పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకు మంచి అవగాహన ఉంటుంది. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ ఆదాయం పెరగవచ్చు. మీరు ఊహించిన విధంగా ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో మీ ఒత్తిడి తగ్గిపోతుంది. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఈ రోజు కుటుంబంతో సంతోషకరమైన రోజు అవుతుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉండాలి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 5:15 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో గందరగోళంగా ఉంటారు. అనేక రకాల ఆలోచనలు మీ మనసులోకి రావచ్చు. ఈ సందర్భంలో మీరు మీ దగ్గరి వారితో మాట్లాడాలి లేదా సలహా తీసుకోవాలి. మీరు మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. మీరు పనికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి భావోద్వేగ మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు సానుకూల శక్తిని ఇస్తుంది. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మీరు ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Sunday, May 31, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion