Latest Updates
-
సాయంత్రం టీ టైమ్లో కరకరలాడే శనగపిండి కారప్పూస.. ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా! -
సాయంత్రం స్నాక్ గా కరకరలాడే చికెన్ పకోడి.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
డయాబెటిస్ ఉందా? అయితే మీరు రోజూ ఎంతసేపు నడవాలో తెలుసా? -
ఘుమఘుమలాడే మంగళూరు చికెన్ సుక్కా.. ఒక్కసారి వండితే ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ కావాలంటారు! -
బంపర్ ఆఫర్: ఫ్రీగా ఫిన్ లాండ్ వెళ్లే ఛాన్స్..ఒక్క రూపాయి లేకుండా 7 రోజుల ట్రిప్..పూర్తి వివరాలు చూడండి.. -
Weekly rasi phalalu (22 నుండి 28 మార్చి): ఈ రాశుల వారికి అదృష్టం వరించబోతోంది, మీ రాశి ఉందేమో చూడండి! -
ఆరోగ్యానికి అమృతం లాంటి నల్ల నువ్వుల లడ్డూ..ఇలా చేసి రోజుకొకటి తింటే జుట్టు రాలడం, PCOD పరార్! -
Today rasi phalalu (22.03.26): ఆదివారం నాడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
పనీర్ లేకుండానే పాలక్ పనీర్!..ఈ 2.0 రెసిపీ చూస్తే వెంటనే వండేస్తారు! -
అబ్బాయిలు vs అమ్మాయిలు..ప్రేమ విషయంలో ఎవరు ఎక్కువ సీరియస్ గా ఉంటారు?
సోమవారం మీ రాశిఫలాలు (04-05-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు కెరీర్ లో గొప్పగా ఉంటుంది. మీ నిరంతర ప్రయత్నాల వల్ల మీకు పెద్ద విజయం దక్కవచ్చు. నిరుద్యోగులకు ఉపాధి లభించే బలమైన అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. వివాహితులు ఈరోజు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈరోజు నిస్వార్థ ఆత్మతో నిరుపేదలకు సహాయం చేస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీ చిన్న ప్రయత్నాలు ఈ రోజు విజయవంతమవుతాయి. దీని వల్ల మీ మనస్సు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు. ఈరోజు ముఖ్యమైన రోజు అవుతుంది. మీరు ఉన్నతాధికారులతో బహిరంగంగా మాట్లాడాలి. ఈ రోజు వైవాహిక జీవితంలో ఏదో మంచి జరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు మీ ప్రియమైనవారి నుండి ఒక ప్రత్యేక ఆశ్చర్యాన్ని పొందవచ్చు. ఈరోజు ప్రేమికులకు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 3 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ఓ కల నెరవేరొచ్చు. మరోవైపు నిరుద్యోగులు కొత్త ఉద్యోగం అవకాశాన్ని పొందొచ్చు. ఈ రోజు ప్రేమ విషయంలో మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామి నుండి ఒక అందమైన బహుమతిని పొందవచ్చు. ఇది మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ రోజు వివాహిత జంటలకు మంచి రోజు అవుతుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. మరోవైపు ఈరోజు ఆరోగ్యం బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో గందరగోళం ఉంటే.. మీ నిర్ణయాలను వాయిదా వేయాలి. తొందరపడి నిర్ణయం మాత్రం తీసుకోకూడదు. ఈరోజు మీరు బాగా నమ్మే ఓ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు మీరు సంపద పొందే అవకాశం ఉంది. మిమ్మల్ని మీ పాత అప్పు ఇబ్బంది పెడుతుంది. మీ ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు.మీ భాగస్వామి పట్ల అవిశ్వాసం మీ సంబంధానికి హాని కలిగిస్తుంది. అయితే ఈ రోజు వివాహితులకు మంచి రోజు అవుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 35
లక్కీ టైమ్ : ఉదయం 8:45 నుండి ఉదయం 9 గంటల వరకు మాత్రమే

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈరోజు ఇతరులను విమర్శించటం వంటి విషయాలను మానుకోవాలి. ఈరోజు ప్రేమ విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ భాగస్వామి యొక్క బలాలు మరియు వారి ప్రత్యేకతను గుర్తుంచుకోవడం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు ఏదైనా లాభం కోసం ఎదురుచూస్తుంటే ఈ రోజు మీకు శుభవార్త వినిపిస్తుంది. మీరు కొంచెం ఎక్కువ ప్రయత్నిస్తే, మీరు కొంత కొత్త ఆదాయ వనరులను కూడా పొందవచ్చు. మీరు వెన్నునొప్పితో బాధపడుతుంటే, ఈ రోజు మీరు భారీ వస్తువులను ఎత్తడం మానుకోవాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి. లేకపోతే అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టవలసిన సమయం ఇది.
పని విషయంలో ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. దీని వల్ల మీరు ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. మీ ప్రేమ జీవితంలో ప్రతిదీ బాగుంటుంది. మీరిద్దరూ ఒకరినొకరు నమ్ముకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 9 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో వివాదం కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా ఆలోచనాత్మకంగా మరియు ప్రశాంతమైన మనస్సుతో పనిచేయాలి. మీ సంబంధం బలహీనపడే పని చేయవద్దు. అదే సమయంలో, వివాహిత జంటలు కూడా ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామిని విస్మరించవద్దు. వారి వైపు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కెరీర్ పరంగా కూడా ఈ రోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు వ్యాపారం విషయంలో ఏదైనా కొత్త ఒప్పందం చేసుకోవడం గురించి, నిర్ణయం తీసుకోవడంలో మీకు కొంత ఇబ్బంది ఉండొచ్చు. మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క మారిన మానసిక స్థితి మీ రోజును మరింత అందంగా చేస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ రోజ్
లక్కీ నంబర్ : 1
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి బయటపడటం వలన శారీరకంగా మంచి అనుభూతి చెందుతారు. పని విషయంలో ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఊహించని విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇవి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అలాగే మీకు ఆర్థిక పరంగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు లావాదేవీల వంటి విషయంలో దూరంగా ఉండాలి. మరోవైపు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : ఉదయం 5:15 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు వాహనాన్ని ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ట్రాఫిక్ నియమాలను పాటించడం మంచిది. కుటుంబంలో ఈ రోజు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. నిశ్శబ్దంగా ఉండటం వల్ల అపార్థాలు పెరుగుతాయి. కాబట్టి మీరు వారితో మాట్లాడటం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే మంచిది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. దీనివల్ల మీరు చాలా నిరాశ చెందుతారు. శృంగార విషయంలో, ఈ రోజు మీరు మీ భాగస్వామితో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో విద్యార్థులు ఈరోజు ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే, మీరు మంచి సలహాదారు నుండి సహాయం పొందవచ్చు. మీరు మీ తప్పుల నుండి నేర్చుకుంటే మంచిది. మరోవైపు, వివాహితులు తమ పనిలో మరింత బిజీగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ఊహించని విధంగా ప్రయోజనాలు దక్కవచ్చు. ఇది మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. మీరు వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మనస్సులో ఏదైనా గందరగోళం ఉంటే, మీ ప్రియమైన వారి నుండి అభిప్రాయాన్ని తీసుకోండి. ఈ రోజు మీరు ఆర్థికంగా చాలా సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలితాలకు సంబంధించి బోల్డ్ స్కై తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications










![వారపు రాశి ఫలాలు [19 నుండి 26 మార్చి]: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? మీ రాశి ఫలాలు ఇక్కడ చూడండి!](https://images.boldsky.com/fit-in/400x225/te/img/2026/03/today-rasi-phalalu-for-all-12-zodiac-signs-19-mar-2026.jpg)
