Latest Updates
-
అచ్చం హోటల్ స్టైల్ సాంబార్ కావాలా? అయితే ఈ మసాలాను ఇంట్లోనే చేసుకోండి! -
వంటగదిలో చెమటోడ్చే పనే లేదు.. ఈ ఎండల్లో స్టవ్ వెలిగించకుండా చేసే 4 అద్భుతమైన వంటలివే! -
ఈ కమ్మటి టమాటా గ్రేవీ చేస్తే.. తెలియకుండానే రెండు ఇడ్లీలు,దోశలు ఎక్కువే లాగించేస్తారు! -
కేవలం 2 బంగాళదుంపలతో..10 నిమిషాల్లో పొటాటో పాప్ కార్న్..పైన కరకరలాడుతూ, లోపల కరిగిపోయేలా.. -
సీతారాముల కళ్యాణానికి ముహూర్తం పెట్టిన ప్లేస్ ఇదే..శ్రీరామనవమికి అక్కడ అందుకే అంత స్పెషల్! -
శ్రీరామనవమి స్పెషల్..గోధుమ రవ్వ పాయసం ఇలా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
క్లాస్ రూమ్ లోని విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్..చెప్పుతో చితకబాదిన స్టూడెంట్..వీడియో చూడండి -
ఈరోజు రాశి ఫలాలు (27.03.26): శుక్రవారం నాడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ, దోసెల్లోకి బెస్ట్ కాంబినేషన్: నోరూరించే బెంగాలీ స్టైల్ టమాటా చట్నీ తయారీ ఇలా! -
శ్రీరామనవమి స్పెషల్.. కేవలం 5 నిమిషాల్లో రాముడికి ఇష్టమైన పంచామృతం..ఎలా చేసుకోవాలంటే..
శుక్రవారం మీ రాశిఫలాలు (08-05-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. అయితే మీరు ఇతరుల కోసం ఈరోజు ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. మరోవైపు ఈరోజు పని ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా పని చేయడం మంచిది. మీ వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు వ్యాపారం గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈరోజు కుటుంబంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రతిభ చూపించడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. దీని వల్ల ఒంటరితనం అనే ఫీలింగ్ పోతుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. ఈ రోజు ఏదైనా పని చేయడంలో తొందరపడకండి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగుదల ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో పవిత్రంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు ట్రాన్స్ ఫర్ లేదా ప్రమోషన్ వంటి కొన్ని పెద్ద మరియు సానుకూల మార్పులను ఈరోజు మీరు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సరైన వాటిలో పెట్టుబడిగా పెట్టండి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈ రోజు శృంగార పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రియుడు/ప్రియురాలిని కలవచ్చు. మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన, సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు పవిత్రంగా ఉంటుంది. ఈ రోజు కొత్త ఆదాయ వనరులను పొందే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఓ ముఖ్యమైన పని మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ప్రతిదీ సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కష్టంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొంత ప్రతికూలత ఉంటుంది. ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా మీ సీనియర్ల చేత ప్రశంసలు పొందుతారు.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1:50 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మీపై కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు ప్రత్యర్థుల వలలో చిక్కుకుని కొంత సొమ్ము నష్టపోయే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు వివాహ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో ఈరోజు విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. దీని వల్ల మీ ఏకాగ్రత చెదిరిపోవచ్చు. ఈ సమయంలో మీరు ఒత్తిడికి లోనవుతారు. మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఉద్యోగులకు ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ వివాహ జీవితంలో
ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : సాయంత్రం 5:05 నుండి రాత్రి 9:55 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో సానుకూలంగా ఉంటుంది. మీరు ఉత్సాహం మరియు శక్తితో నిండి ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఇంట్లో సమస్యలన్నీ ముగిసిపోవచ్చు. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. అయితే మీరు మీ ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 1
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఎక్కువగా ఖర్చులు చేస్తే, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటారు. ఉద్యోగులు ఈరోజు సహోద్యోగులతో కలిసి వేగంగా పని చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లో పని చేయడానికి మిమ్మల్ని కేటాయించినట్లయితే, దానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని రహస్యంగా ఉంచండి. జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి ఈ రోజు బాగుంటుంది. మీరు ఒకరితో ఒకరు కొన్ని అందమైన క్షణాలు గడుపుతారు. కుటుంబంలో శాంతి ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబంతో సన్నిహితంగా ఉండండి. వారి ప్రేమ మరియు సహకారం అతిపెద్ద సమస్యతో పోరాడటానికి మీకు సహాయం చేస్తుంది. ప్రేమికులకు ఈరోజు కష్టంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు పని ఒత్తిడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనేక ప్రయోజనాలను పొందుతారు.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 1:10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబం కోసం చాలా ఎక్కువ ఖర్చు చేయవచ్చు. ఉద్యోగులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు ఒక ముఖ్యమైన సమావేశానికి సన్నద్ధమవుతారు. మీరు తెలివిగా పని చేస్తే, ఈ రోజు మీరు మీ ప్రయత్నాలతో పాటు సీనియర్ల మద్దతును పొందుతారు. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారం తీసుకుని, కొంతసేపు వ్యాయామం చేయాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు నిరుత్సాహపడకండి. నిజాయితీగా కష్టపడి పని చేయండి. ఈ రోజు జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉండదు. బహుశా వారు మీ వైపు నుండి ఆశించిన సహకారం పొందలేకపోవచ్చు, ఇది వారి కోపానికి కారణం కావచ్చు. వ్యాపారులకు ఈరోజు నిరాశ కలుగుతుంది. శృంగార పరంగా ఈరోజు సమస్యలు ఉండొచ్చు. కానీ మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











