Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
బుధవారం దినఫలాలు : తొందరపాటు లేదా భయాందోళనలకు దూరంగా ఉండండి...
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, నిజ అశ్వీయుజమాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రానిక్ వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. ఉద్యోగులు ఆఫీసులో తమ పనిని తాము చేసుకోవాలి. ముఖ్యంగా సహోద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఒకరితో వివాదం ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 32
లక్కీ టైమ్ : ఉదయం 6:20 నుండి సాయంత్రం 5:25 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కొన్ని కారణాల వల్ల ప్రమోషన్ నిలిచిపోతే, ఈరోజు ఓ శుభవార్త వచ్చే అవకాశం ఉంది. మీ పని ఫ్యాషన్‌కు సంబంధించినది అయితే ఈ రోజు మీకు చాలా ముఖ్యమైనది. మీడియా, రాజకీయాలకు సంబంధించిన వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సంబంధం ఉంటుంది. మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీరు ఈరోజు తల్లిదండ్రుల నుండి కొన్ని మంచి సలహాలను పొందవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 40
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆల్కహాల్ వంటి చెడు అలవాటును విడిచిపెట్టడానికి ఇది సరైన సమయం. లేకపోతే మీరు కొన్ని తీవ్రమైన వ్యాధులకు గురికావొచ్చు. వ్యాపారులు ఈరోజు ఏవైనా రుణాలు తీసుకోవాలనుకుంటే, జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితులలో మీ ప్రియమైనవారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి, మీరు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : సాయంత్రం 4:45 నుండి రాత్రి 8 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన సమావేశంలో భాగం కావచ్చు. మీకు పెరిగిన బాధ్యతలు ఉండవచ్చు. పూర్తి ప్రణాళికతో మీ పనిపై దృష్టి పెట్టండి. మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ రోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు కొంత పెద్ద లాభం ఉండవచ్చు. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో మరికొంత సమయం గడపడానికి కూడా అవకాశం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఒక సమస్య ఎదురవుతుంది.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 9:45 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి మానసికంగా కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఈ సమయంలో మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి లేకపోతే సంక్లిష్టమైన విషయాలు పరిష్కరించడానికి బదులు తీవ్రమవుతాయి. మీరు ఏదైనా క్రొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, దానిని వాయిదా వేయడం మంచిది. మరోవైపు ఉద్యోగులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి, లేకపోతే మీ పొరపాటు వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. మీ పని స్టాక్ మార్కెట్‌కు సంబంధించినది అయితే, ఈరోజు మీరు నష్టపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో కొన్ని మార్పులు ఉండవచ్చు. మీ ప్రియమైనవారు మిమ్మల్ని విస్మరిస్తున్నారని మీకు అనిపిస్తుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు కొంత సమస్య ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 37
లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో పోటీ పెరుగుతుంది. కాబట్టి మీరు మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. మీ యజమాని మీకు అప్పగించిన ఏ బాధ్యతనైనా మీ కృషి మరియు నిజాయితీతో నెరవేర్చడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో, చిన్న అజాగ్రత్త కూడా మీ కెరీర్‌కు హానికరంగా ఉంటుంది. మరోవైపు వ్యాపారులు ఈరోజు కొంత ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆదాయం బాగున్నప్పటికీ, మీ ఖర్చులు పెరగవచ్చు. కానీ, త్వరలోనే మీ మధ్య అంతా సాధారణంగా మారుతుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, నేడు సోమరితనం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు తాజాగా ఉంచడానికి, మీరు ప్రతి ఉదయం బహిరంగ ప్రదేశంలో నడవాలి.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ఈరోజు మీరు ఒకేసారి చాలా పనులు చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ప్రణాళిక ప్రకారం పని చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తొందరపాటు లేదా భయాందోళనలకు దూరంగా ఉండండి. వ్యాపారవేత్తలకు ఈరోజు లక్ కలిసి వస్తుంది. మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం కావచ్చు. మీరు ఆశించిన ఫలితాలు రావొచ్చు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:3 నుండి రాత్రి 7:55 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు ఆఫీసులో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ పని పట్ల ఉన్నతాధికారులు కోపంగా ఉంటారు. మీరు తప్పుల నుండి నేర్చుకోవాలి. మీరు చేసిన తప్పునే చేయకూడదు. దీని వల్ల ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఒక సమస్యను ఎదుర్కొంటారు.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో మీరు కొత్త ఉద్యోగం ఎదురుచూస్తున్నట్లయితే, మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఒక పెద్ద సంస్థ నుండి ఉద్యోగ ఆఫర్ పొందొచ్చు. మీరు పూర్తి సానుకూలతతో ముందుకు సాగాలి. త్వరలో మీరు విజయాన్ని అందుకుంటారు. మరోవైపు వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా తాత్కాలికమే. విద్యార్థులు ఈరోజు సోమరితనం మానుకోవాలి. లేదంటే మీ భవిష్యత్తు కల చెదిరిపోతుంది. మీ ఆరోగ్యం ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ దూకుడు స్వభావం మీకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తుంది. ఈరోజు మీరు పొరుగువారితో లేదా బంధువులతో గొడవ పడొచ్చు. ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండాలి. మీ ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు విజయవంతమవుతాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, సోదరులు మరియు సోదరీమణుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 7:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీరు కొన్ని కొత్త ఆదాయ వనరులను పొందొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీరిద్దరూ మునుపటిలా ప్రేమను అనుభవిస్తారు. ఉద్యోగులకు ఈరోజు పనిభారం తక్కువగా ఉంటుంది. మీ యజమాని యొక్క మానసిక స్థితి కూడా బాగానే ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సానుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం ఈరోజు రావొచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం రావొచ్చు. మీరు కష్టపడి పని చేస్తారు. వ్యాపారులు ఈరోజు కొంత పెరుగుదలను చూస్తారు. మీరు ఆశించిన విధంగా ప్రయోజనాలను పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ వివాహ జీవితంలో సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మెరుగుదల ఉంటుంది. అయితే మీరు అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











