మంగళవారం దినఫలాలు : తుల రాశి వారు ఆర్థిక విషయాల్లో నిరాశ చెందొచ్చు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, నిజ అశ్వీయుజమాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope November 10, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసులో ఉన్నతాధికారులతో మంచి సంబంధం ఉంటుంది. మీరు ఈరోజు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడంలో సీనియర్లు సహాయం చేస్తారు. వ్యాపారులు ఈరోజు మీ పనులన్నీ చాలా ఆలోచనాత్మకంగా చేయాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు కుటుంబంతో శాంతియుతంగా గడుపుతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ స్వభావంలో తీవ్రత ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వంటి శుభవార్త వినిపించొచ్చు వ్యాపారులు ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. అయితే, ఈ సమయంలో మీరు చాలా కష్టపడాలి. ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీరు ఇంటి అలంకరణలో కొన్ని మార్పులు చేయవచ్చు. ఇది కాకుండా, మీరు సౌకర్యవంతమైన విషయాలకు కూడా కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : సాయంత్రం 5:55 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఈరోజు విద్యార్థులు విద్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. మీరు శ్రద్ధగా అధ్యయనం చేసి, మీ లక్ష్యం వైపు ముందుకు వెళితే మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు ఆశించిన ఫలితం రాకపోయినప్పటికీ, కొంత ఉపశమనం లభిస్తుంది. మీరు ఏదైనా పెద్ద ఆర్థిక లావాదేవీ చేయవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు పనులన్నీ వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. మీరు ఎంత ఎక్కువ పని చేస్తే అంత ప్రయోజనం ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఉన్నత స్థానాన్ని సాధించాలనుకుంటే, మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. అదే సమయంలో, వ్యాపారులు తమ ఆర్థిక నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు మీ వ్యాపారం కోసం బ్యాంకు నుండి పెద్ద రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే, మీరు దానిని నివారించాలి. మరోవైపు మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఇంకోవైపు మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి సాయంత్రం 6 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని పెద్ద బాధ్యతలను పొందవచ్చు. ఈ సమయంలో మీరు మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈరోజు మీకు చాలా అదృష్టంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆర్థిక రంగంలో చాలా ఖరీదైనది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణమైనవి. మీరు ఇంటి పెద్దల ఆశీర్వాదం పొందుతారు. మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపర్చడానికి మీరు మీ జీవిత భాగస్వామిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కార్యాలయంలో మీరు కష్టపడి, మీ పనిని పూర్తి చేస్తారు. ఈరోజు కార్యాలయంలో ఒక ముఖ్యమైన సమావేశం కూడా ఉండవచ్చు. ఈరోజు వ్యాపారులు ఎంతో ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా మీ పని ఎలక్ట్రానిక్స్, పాల ఉత్పత్తులు, దుస్తులు, సౌందర్య సాధనాలు, డీజిల్, పెట్రోల్ మొదలైన వాటికి సంబంధించినది అయితే మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందుతారు. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. కానీ ఖర్చులు కూడా అదేవిధంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఏ చిన్న సమస్య ఉన్నా, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. మీరు చాలా సందర్భాలలో ఆశించిన ఫలితాలను పొందలేరు. మరోవైపు మీకు ఆర్థిక పరంగా కొంత ఆందోళన ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకరి నుండి ఆర్థిక సహాయం ఆశిస్తున్నట్లయితే, మీరు నిరాశ చెందవచ్చు. ఈ సమయంలో మీరు సహనంతో, ధైర్యంతో పని చేయాల్సి ఉంటుంది. దేవుణ్ణి నమ్మండి, మీ సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయి. ఉద్యోగులకు ఈరోజు పని భారం పెరుగుతుంది. వ్యాపారులు కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 4:35 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా సానుకూలంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ దీర్ఘకాల ప్రయత్నాలలో మీరు విజయం సాధించవచ్చు. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో మంచి గౌరవం లభిస్తుంది. అదే సమయంలో వ్యాపారులు కొన్ని కొత్త అవకాశాలను పొందుతారు. రాబోయే రోజుల్లో మీరు దీని నుండి ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు విద్యార్థులకు చాలా ముఖ్యమైనది. మీరు ఇటీవల ఏదైనా పోటీ పరీక్ష ఇచ్చినట్లయితే, మీరు దానిలో అద్భుతమైన విజయాన్ని పొందవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు తెలియకుండానే ఇతరుల మనోభావాలను దెబ్బతీయవచ్చు. ఇది మీ సంబంధాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మరోవైపు ఉద్యోగులు ఈరోజు సీనియర్ల సలహాలను పాటించాలి. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని వివాదాలుంటాయి. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయాలి. ఆరోగ్య పరంగా మానసికంగా మరియు శారీరకంగా ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు కొన్ని సందర్భాల్లో అద్భుత ప్రయోజనాలను పొందుతారు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మరియు మీ ప్రియమైనవారితో గడపడానికి మీకు కూడా అవకాశం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. తండ్రి నుండి ఆర్థిక ప్రయోజనం సాధ్యమే. మీ జీవిత భాగస్వామితో సంబంధం సామరస్యంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో సహోద్యోగులతో కలిసి పని చేయాలి. మీరు కోపం మరియు ఘర్షణ వంటి వాటిని నివారించాలి. వ్యాపారులు ఈరోజు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్య పరంగా బాగుంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 6:55 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు పని విషయంలో అదృష్టం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది మరియు మీరు కూడా ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. మీరు ఈ విధంగా కష్టపడి పనిచేస్తూనే ఉంటారు, త్వరలో మీరు విజయానికి చేరుకుంటారు. అదే సమయంలో, వ్యాపారులు కూడా పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీరు క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, మీ ప్రణాళిక ముందుకు సాగవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని సంబంధిత సమస్యల నుండి మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. మీరు పనిచేస్తే ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన సమావేశం గురించి సమాచారాన్ని పొందవచ్చు. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే ఆర్థిక పరమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ఈరోజు మీకు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించదు. మీ జీవిత భాగస్వామితో కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Tuesday, November 10, 2020, 5:00 [IST]
Desktop Bottom Promotion