గురువారం మీ రాశిఫలాలు (10-10-2019)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

జ్యోతిష్యం, అక్టోబర్ 10వ తేదీ

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఆశ్వీయుజమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశివారికి ఈరోజు మీరు వేగాన్ని తగ్గించాలని ఎవరైనా మీకు చెబితే వారి మాట వినండి.ఎందుకంటే మీరు చాలా వేగంగా జీవిస్తున్నారు. వేగంగా పని చేస్తున్నారు. అలాగే మీపై శ్రద్ధ వహించే వ్యక్తుల కోసం సమయం కేటాయించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మీరు మీ వ్యక్తిగత లక్ష్యాలను పక్కన పెట్టి ఇతర వ్యక్తులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఈశాన్య దిక్కున ప్రయాణం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. మహిళలకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సాయిబాబా దర్శనం చేసుకుంటే మేలు కలుగుతుంది.

లక్కీ నంబర్ : 3

లక్కీ కలర్ : పసుపు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశివారు ఎవరినైనా కొన్ని సున్నితమైన ప్రశ్నలను అడిగేందుకు ధైర్యం తెచ్చుకోవాలి. మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో స్పష్టంగా అడిగి తెలుసుకోండి. మీరు ఈరోజు ఒకరి సహనాన్ని పరీక్షించొచ్చు. మీరు నేరుగా విషయాలను ప్రస్తావిస్తే ప్రతి ఒక్కరి సమయాన్ని ఆదా చేసిన వారవుతారు. మీ సంస్థాగత నైపుణ్యాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయి, కాబట్టి మీ ప్రణాళికలను రూపొందించుకోవంలో అవి మీకు సహాయపడే అవకాశం ఉన్నందున వాటిని సక్రమంగా వినియోగించుకోండి. నూతన కార్యక్రమాలను వేగంగా ప్రారంభిస్తారు.

లక్కీ నంబర్ : 5

లక్కీ కలర్ : గ్రీన్

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారి నుండి ఎవరైనా ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు వీటిని ఊహించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. మహిళలు కూడా సంతోషకరమైన వార్తలను వింటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా లాభం చేకూరుతుంది. కోర్టు సంబంధిత విషయాలలో విజయం సాధించగలుగుతారు. ఈశాన్య దిక్కున ఈరోజు ప్రయాణిస్తే ఈ రాశివారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. గురువారం సందర్భంగా సాయిబాబాను సాయంత్రం మందార పూలతో పూజిస్తే ఫలితం ఉంటుంది.

లక్కీ నంబర్ :3

లక్కీ కలర్ : పసుపు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించే శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మీరు ఈరోజు చాలా దూకుడుగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారంలో ఉన్న వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మహిళలకు ప్రశాంతంగా ఉంటుంది.

లక్కీ నంబర్ : 9

లక్కీ కలర్ : రెడ్

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారి చర్యలు, సంభాషణలు ఇతరులపై ప్రభావం చూపుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇతర వ్యక్తులు మీపై ఆధారపడే అవకాశముంది. మీరు అకస్మాత్తుగా ఇష్టానుసారం పని చేయడం ప్రారంభిస్తే మీకే నష్టం కలుగుతుంది. మహిళలు ఆరోగ్య విషయం జాగ్రత్తలు వహించాలి. ఈ రాశి వారికి ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది.

లక్కీ నంబర్ : 1

లక్కీ కలర్ : రెడ్

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు గతంలో కన్నా మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూతన కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలను ప్రారంభిస్తారు. వ్యాపార రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. మహిళల ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. న్యాయవాద రంగంలో ఉన్నవారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది.

లక్కీ నంబర్ : 3

లక్కీ కలర్ : పసుపు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు విసుగు చెందడం మానేసి అద్భుతంగా అనుభూతి చెందుతారు. మీరు ఆంక్షల నుండి బయటపడాలి. ఈరోజు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అదే చేయండి. మీ నైపుణ్యాలు కూడా పెరుగుతాయి. మహిళలకు ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆర్థికంగా లాభాలు వస్తాయి.

లక్కీ నంబర్ : 5

లక్కీ కలర్ : గ్రీన్

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు మంచిగా ఉండటంతో ఎల్లప్పుడూ ప్రశంసించబడతారు. గతంలో కన్నా మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి ఆర్థిక పరమైన విషయాలు మెల్లమెల్లగా కలసి వస్తుంది. మహిళలకు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ లో పార్ట్ నర్ షిప్ ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

లక్కీ నంబర్ : 6

లక్కీ కలర్ : వైట్

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పరిపూర్ణంగా ఉండలేకపోవచ్చు. వేరేవారు చేస్తున్న పొరపాటు మీకు ఒక హెచ్చరికలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలా జీవించాలో నేర్చుకోండి. ఇతరులు చేసిన తప్పుల గురించి ఆందోళన చెందుతుంటే, మీ మనసును ఇతర వాటిపై మళ్ళించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అధిక ఖర్చులు ఊపిరి ఆడనీయకుండా చేసే అవకాశముంది. వ్యాపార రంగంలో వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకు ఏకాగ్రత తగ్గుతుంది.

లక్కీ నంబర్ : 3

లక్కీ కలర్ : పసుపు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు కొత్త ప్రయత్నాలను చేసి మంచి ఫలితాలను కోరుకుంటారు. కానీ ఇది ఇతరులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలాగా ఉన్నందున మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆందోళన పరిస్థితులను వెంటనే నియంత్రించలేకపోతారు. వ్యాపార రంగంలో అధిక శ్రమ ఉంటుంది. విద్యార్థులకు విద్యపై మక్కువ తగ్గుతుంది.

లక్కీ నంబర్ : 3

లక్కీ కలర్ : పసుపు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

మీరు అవధులు, నిబంధనలతో నిండిన పరిస్థితిలో చిక్కుకుంటే ఏ పనిని సరిగ్గా చేయలేరు. పరిమిది మీకు ఎప్పుడూ మంచిది కాదు. నూతన స్నేహాల ద్వారా ఫలితం ఉంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఒడిదుడుకులు అన్నీ తగ్గిపోతాయి. మీ ప్రత్యర్థులు బలహీనపడతారు. సంభాషణల ద్వారా ఆశించిన ఫలితం ఉంటుంది.

లక్కీ నంబర్ : 3

లక్కీ కలర్ : పసుపు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈరోజు మీన రాశి వారు కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేస్తారు. మానసిక అలజడి తగ్గుతుంది. ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వ్యాపారులకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు క్రీడలలో రాణిస్తున్నారు. మహిళలకు ప్రతిబంధకాలు తొలగిపోతాయి. సొంత నిర్ణయాల వల్ల విజయం సాధిస్తారు.

లక్కీ నంబర్ : 1

లక్కీ కలర్ : రెడ్

Desktop Bottom Promotion