మంగళవారం మీ రాశిఫలాలు (22-10-2019)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

జ్యోతిష్యం, అక్టోబర్ 22వ తేదీ

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఆశ్వీయుజమాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు జీవితంలో విజయం సాధించడానికి, వారి లక్ష్యం పట్ల పూర్తి అంకితభావంతో పని చేస్తారు. ఇదే సమయంలో నిర్లక్ష్యం మీ ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. మీ పనితీరు తగ్గడం వల్ల మీ సీనియర్లు మీపై కోపం పడవచ్చు. ఆర్థికంగా ఈ రాశివారందరికీ ఈరోజు మంచిది. ఈరోజు మీరు అదనపు ఆదాయం కోసం మీ ప్రయత్నాలను రెట్టింపు చేయవచ్చు. ఈరోజు ఎవరైనా పేదవారు మిమ్మల్ని సహాయం అడిగితే నిస్వార్థంతో వారికి సహాయం చేయండి. మీ ఆరోగ్యం దృష్ట్యా మీ ఆహారపు అలవాట్లలో కొంత మార్పు తీసుకురావాలి. కుటుంబసభ్యులతో వాదోపవాదాల ఫలితంగా కుటుంబ జీవితం ఉద్రిక్తంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈ రోజు దీర్ఘకాలిక అనారోగ్యం నుండి బయటపడతారు. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీరు ఈ రోజు చాలా శక్తివంతంగా మరియు చురుకుగా ఉంటారు. ఇది మీ పనిని అన్ని మంచి మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. ఈ రోజు మీరు రెండింతల వేగంతో పని చేస్తారు. మీ పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయగలరు. ఒక వ్యాపారవేత్తకు ఆయన కృషికి ఈ రోజు మంచి ప్రయోజనం చేకూరుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు కొంత అదనపు సమయం లభించకపోవచ్చు. కాని పరస్పర అవగాహన బలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా పరిస్థితులు కష్టంగా మారతాయి. వీరు ఊహించని చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మీ ధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా ప్రయత్నిస్తూ ఉండాలని పెద్దలు సలహా ఇస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి. తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. తమ్ముడు లేదా సోదరి నుండి కొన్ని శుభవార్తలు ఆశిస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. మీ శృంగార జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మనస్సు ఈ రోజు కాస్త కలవరపడుతుంది. రిలాక్స్ గా ఉండటానికి ప్రశాంతమైన ప్రదేశంలో కొంత సమయం గడపండి.

లక్కీ కలర్ : డీప్ ఎరుపు

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో కొందరు ఈ రోజు మీ కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కానీ మీ ధైర్యం, కృషి మరియు తెలివితేటల వల్ల మీరు అందరినీ ప్రభావితం చేయగలుగుతారు. ఆర్థిక విషయాలు బలంగా ఉంటాయి. మీరు ఇటీవల ఎక్కడో పెట్టుబడి పెట్టినట్లయితే, ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ రోజు, మీరు మీ జీవిత భాగస్వామితో తీవ్రమైన చర్చలో పాల్గొనవచ్చు. పోరాటాన్ని పక్కన పెట్టి తెలివిగా సమస్యను పరిష్కరించండి. శృంగార జంటలకు ఈ రోజు ఖచ్చితంగా కలిసి వస్తుంది. మీరు మీ తల్లిదండ్రుల నుండి వివాహ అనుమతి పొందవచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:45 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో కొందరికి ఈరోజు ఆరోగ్యం మెరుగైన కారణంగా వారు రిఫ్రెష్ అవుతారు. అయితే మీరంతా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండండి. మంచి ఆహారాన్ని తీసుకోండి. దీని వల్ల త్వరలో మీ ఆరోగ్య సమస్యలన్నింటినీ తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో పెద్దల నుండి ఆశీర్వాదం పొందుతారు. మరోవైపు, మీ చిన్నవారు మీ పట్ల గౌరవం చూపుతారు. ఈ రోజు, మీ ఖర్చుల వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది మీ జీవిత భాగస్వామితో చర్చనీయాంశంగా మారవచ్చు. కానీ మీరు అవగాహన తెచ్చుకుని, వాటి నుండి.మీ తప్పులను తెలుసుకోవాలి. అదే తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈరోజు గందరగోళ స్థితిలో ఉంటారు. మీ మనసు పరధ్యానంలో ఉంటుంది. మీ ప్రశ్నలకు సమాధానాలు మీకు దొరకకపోవచ్చు. మీ దగ్గరి వారితో మాట్లాడండి. ఎందుకంటే వారు మీ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతారు. కార్యాలయంలో, మీ సీనియర్ల మద్దతు లేకపోవడం వల్ల, మీరు నిరాశ చెందవచ్చు. అయినా కూడా మీ విశ్వాసాన్ని కోల్పోకండి. మీ ఉత్తమమైన దాన్ని నిరూపించడానికి కృషి చేయండి. వైవాహిక జీవితంలో సమస్యలు ఈ రోజు పరిష్కరించబడతాయి. రొమాంటిక్ మీటింగులకు కూడా ఈ రోజు మంచిది. మీ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8:45 గంటల వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో కొందరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు దిగొచ్చు. ఈ రోజు, మీరు మీ కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవాలరు. లేకపోతే మీరే తర్వాత పశ్ఛాత్తాపం పడతారు. మీ సహోద్యోగులతో సమయాన్ని అనవసరంగా వృథా చేయకండి. మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టండి. మీరు అలా గనుక చేయకపోతే, మీ సీనియర్లు మీకు వ్యతిరేకంగా కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. వ్యాపారులు ఈ రోజు లాభం పొందలేరు. కాకపోతే మీ డబ్బును కూడా కోల్పోరు. ఈ రోజు మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈరోజు ప్రయాణానికి మంచిది కాదు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పేదవారికి ఒక చిన్న సహాయం చేయడం వల్ల వారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీ శృంగార జీవితంలో ఈ రోజు మీకు విసుగు అనిపిస్తుంటే, మీ భాగస్వామికి భిన్నంగా ఏదైనా చేయాలనిపిస్తుంది. వివాహిత జంటలకు ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీరు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న మీ భాగస్వామి నుండి మీకు కొన్ని శుభవార్తలు రావచ్చు. మీ తండ్రి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. అది మీ మనసుకు విశ్రాంతిని ఇస్తుంది. కార్యాలయంలో, మీరు నిజాయితీగా పని చేస్తారు. మీ ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. ఈ రోజు ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి. మీరు ఈ రోజు మీ బంధువులతో ఒక సాయంత్రం గడపవచ్చు.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు జీవితంలో పురోగతి సాధించాలనుకుంటే ప్రతికూల ఆలోచనల్ని పక్కన వదిలేయండి. ఎందుకంటే ఇవి మీ భవిష్యత్తుకు మార్గాన్ని అడ్డుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఖర్చులు మీ బడ్జెట్ ను ప్రభావితం చేస్తాయి. మీరు కొంచెం ప్రయత్నిస్తే, మీరు మీ ఆదాయాన్ని మెరుగుపరచవచ్చు. ఆఫీసులో నిరంతరం పని కారణంగా మీరు ఈరోజు విసుగు చెందుతారు. మీ మనసును రిఫ్రెష్ చేయడానికి మీరు చిన్న విరామం తీసుకోవాలి. కుటుంబంలో మీ జీవిత భాగస్వామి మీకు ఈరోజు చాలా మద్దతుగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది. డబ్బు విషయాలు ఈ రోజు పరిష్కరించబడతాయి. మీ దగ్గరి వారి నుండి బలమైన ఆర్థిక సహాయం ఆశిస్తారు. మీరు ఆర్థికంగా బలంగా ఉండాలనుకుంటే, మీ ఆర్థిక నిర్ణయాలన్నింటినీ తెలివిగా తీసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో ప్రశాంతమైన రోజు గడపగలుగుతారు. కుటుంబం మరియు బంధువులతో సంబంధం బలంగా ఉంటుంది. కార్యాలయంలో, పరిస్థితులు మీ నియంత్రణలో ఉంటాయి. మీరు మీ సీనియర్స్ నమ్మకాన్ని గెలుచుకోగలుగుతారు. మీ కృషి వల్ల ఈ రోజు మీరు ప్రశంసలు అందుకుంటారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ 18

లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 8:40 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వ్యాపారవేత్తలకు ఈరోజు ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. మీ దీర్ఘకాల పనులు మీకు పెద్ద ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాయి.

ఉద్యోగులకు ఈరోజు తటస్థంగా ఉంటుంది. మీ పనులన్నీ ఈరోజు ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. మీరు ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లయితే దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించండి. లేదంటే తరువాత సమస్యలను ఎదుర్కొంటారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కారణంగా మీరోజు ఆందోళన చెందవచ్చు. అలాగే, కారణం లేకుండా మాట్లాడటం వల్ల మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని దెబ్బ తీస్తుంది. పరస్పర అవగాహనతో మాట్లాడటం మంచిది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 7:45 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు సరదాగా గడుపుతారు. ఎందుకంటే వారి కుటుం జీవితం ఆనందంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఈ రోజు బాగా గడుపుతారు. మీ తండ్రి కొద్దిరోజుల నుండి మీతో కోపంగా ఉంటే, వారి కోపాన్ని తీర్చడంలో మీరు విజయవంతమవుతారు. ఈరోజు, మీరు మీ జీవిత భాగస్వామితో ప్రయాణానికి సంబంధించి ఏదైనా ప్లాన్ చేయవచ్చు. కొంతమంది బంధువులు ఈరోజు ఇంటికి రావచ్చు. అది ఆనందాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. మీరు ఈరోజు కూడా పెద్ద పెట్టుబడి పెట్టవచ్చు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మీకు మంచి లాభం వస్తుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

Story first published: Tuesday, October 22, 2019, 6:00 [IST]
Desktop Bottom Promotion