శనివారం మీ రాశిఫలాలు (05-10-2019)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

జ్యోతిష్యం, అక్టోబర్ 5వ తేదీ

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఆశ్వీయుజమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశివారు ఆర్థిక రంగంలో నిలదొక్కుకునేందుకు, మంచి భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తారు. ఈరోజు కుటుంబంలో సాధారణంగా ఉంటుంది. కొన్ని కట్టుబాట్లు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఒక ముఖ్యమైన పని గురించి మీ యజమాని మిమ్మల్ని ఇష్టపడతారు. పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకోవడం మానుకోండి. ఇది మీకు ప్రతికూలంగా ఉంటుంది. అంతేకాదు మీ జీవితంపైనా ప్రభావం చూపుతుంది. పరిస్థితులను మెయింటెన్ చేయడం నేర్చుకోండి. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితం ఫలవంతమైనది. శాంతియుతంగా జీవించడానికి మానసిక సమతుల్యత అవసరమవుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 7:35 నుండి రాత్రి 7:30 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు కుటుంబంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈరోజంతా బిజీగా ఉండిపోతారు. ఒక ముఖ్యమైన నిర్ణయానికి మీరు మీ తల్లిదండ్రులు, తోబుట్టువు సలహా తీసుకుంటారు. మీ భాగస్వామి తగినంత బాధ్యతగా ఉంటారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా నిరాశపరచరు. మీ పిల్లలు మీకు ఎదురుచెప్పరు కాబట్టి వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు సాధించని విజయాల పట్ల నిరాశ చెందుతారు. కళలు మరియు డ్రాయింగుల్లో ఉన్నవారు మంచి ప్రదర్శన ఇస్తారు. మీలో కొందరు పనిలో సరైన మార్గదర్శకత్వం కోసం ప్రయత్నిస్తారు. కార్పొరేట్ రంగంలో ఉన్న వారు ఉద్యోగం మారేందుకు ప్లాన్ చేస్తారు. గాసిప్ లలో భాగం కావడం మానుకోండి. మీరు ఈరోజు శుభవార్త వింటారు. ఉదయం నడకతో మీ రోజును ప్రారంభించండి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : రాత్రి 7:45 నుండి రాత్రి 10:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

మీ వైఖరి వల్ల మీ జీవిత భాగస్వామితో పరిస్థితులు కొంత కష్టంగా అనిపించొచ్చు. మీ తప్పుడు ప్రవర్తన వల్ల చిన్న విషయాలు కూడా మీకు కలతను కలిగిస్తాయి. మీ దగ్గరి స్నేహితుడు సమస్యను పరిష్కరించడానికి మీకు సహాయం చేస్తాడు. మీరు ఏదైనా యాత్రను ప్లాన్ చేసి ఉంటే దానిని రద్దు చేస్తారు. ఇది పిల్లలకు నిరాశ కలిగిస్తుంది. బడ్జెట్ దుర్వినియోగం అందరికీ ఆందోళన కలిగిస్తుంది. మీరు మరిన్ని విషయాలను ప్లాన్ చేయగలుగుతారు. మీ యజమాని మీకు కొంతకాలం దూరంగా ఉంటారు. వ్యాపారవేత్తలు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంలో మెరుగుదల మంచి సంకేతం.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 6:45 నుండి రాత్రి 10:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశివారు ఆరోగ్యం ప్రాముఖ్యతను గుర్తించి మందులకు దూరంగా ఉండాలి. వ్యాయామం చేయడంపై ఆసక్తి పెంచుకోవాలి. ఇక ఈరోజు ఈ రాశివారికి పనిలో విజయవంతమైన రోజు అవుతుంది. ముందు మీరు మీ సహోద్యోగులకు వారి అవసరాలకు అనుగుణంగా మార్గనిర్దేశం చేస్తారు. వ్యాపారవేత్తలు మీ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకు అనుగుణంగా విషయాల పట్ల ప్లాన్ చేసుకోవాలి. మీ దగ్గరి స్నేహితుడు లేదా బంధువు ఆర్థిక పరంగా మీ సహాయం కోరవచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు ఈరోజు మద్దతుగా ఉంటారు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఈరోజు విలువైన సమయాన్ని గడుపుతారు. తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడతారు. మీ ప్రియమైన వారితో మంచి ప్రయాణం చేస్తారు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 8:35 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పనిలో కష్టంగా ఉంటుంది. అలసట ఎక్కువగా కనిపించడంతో బలహీనంగా భావిస్తారు. మీరు ఎక్కువ పని చేయాలని మీ ఉన్నతాధికారులు డిమాండ్ చేస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో ఉన్నవారు భారీ లాభం పొందుతారు. మీ ప్రియమైన వారితో మీ సంబంధం ఫలవంతం అవుతుంది. మీ సహాయంతో మీ భార్య మీ అలవాట్లను సరిదిద్దుతారు. ఉదర సమస్యలతో బాధపడేవారు ఈరోజు మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి 6:45 గంటల వరకు

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు మరిన్ని ప్రాజెక్టులు కేటాయించబడతాయి. మీ సామర్థ్యం కూడా అభినందనీయంగా ఉంటుంది. కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక కోర్టు వ్యవహారాల్లో చట్టపరమైన సమస్యలు ముగిసిపోతాయి. మీరు ఈరోజు రిలాక్స్ అవుతారు. కుటుంబంలో పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పండి. కుటుంబంలో ఒక ముఖ్యమైన రోజు అవుతుంది. ఎందుకంటే సాయంత్రం అందరినీ కలవడం మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఒక క్లోజ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాడు. శృంగార విందుతో మీ ప్రియమైన వారు మీ మానసిక స్థితిని పెంచుతారు.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి అదృష్ట రోజు అవుతుంది. ఎందుకంటే మిగులు ఆదాయం అద్దె రూపంలో కాని ఏదైనా వేరే రూపంలో వస్తుంది. తల్లిదండ్రుల సలహాతో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం వల్ల అదృష్టం లభిస్తుంది. మీ భాగస్వామి డిమాండ్ చేసే ఒక విషయానికి మీరు నో చెప్పాల్సి ఉంటుంది. లేదంటే చివరికి మీరే బాధపడతారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అలసట మరియు బలహీనత కొన్ని రోజులు దినచర్యలో ఒక భాగంగా ఉంటుంది. ప్రజలకు ఉచితంగా సలహాలు ఇవ్వడం మానుకోండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 8:50 నుండి సాయంత్రం 6:05 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

మీ అవగాహన మరియు సహాయక స్వభావం ఇతరులకు సహాయపడుతుంది. మీకు గౌరవం లభిస్తుంది. ఈ రాశి వారిలో కొందరు మీ సమస్యలను మీరే సొంతంగా పరిష్కరించుకుంటారు. ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ భయపడొద్దు. వ్యాపారవేత్తలు భారీ లాభాలు పొందుతారు. చాలా కాలం తర్వాత తల్లి ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 11:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశివారు ఈరోజు వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భారీగా నష్టాలొచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన వారికి ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. కానీ పరిస్థితులను మెరుగుపరిచేందుకు మరింత కష్టపడాలి. అధిక వ్యయం మీ దారికి వస్తుంది. పెద్దలు ఆరోగ్యంగా ఉంటారు. మీ ప్రియమైన వారితో సంబంధం సజావుగా సాగుతుంది. పిల్లల పనితీరుతో తల్లిదండ్రులు గర్వపడతారు. కుటుంబంలో కొన్ని ముఖ్యమైన విషయాలకు మీరు ప్రాధాన్యత ఇవ్వాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి సాయంత్రం 5:40 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు లాంగ్ డ్రైవ్ చేయొద్దు. ఎక్కువ దూరం ప్రయాణించడం మానుకోండి. ఆర్థిక రంగంలో పరిస్థితులు చేజారుతాయి. మీరు తక్షణ పెట్టుబడి కోసం ఎలాంటి ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే భారీ నష్టం రావొచ్చు. కుటుంబంతో కలిసి గడపడం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది. కొంత జంటలు శృంగార క్షణాలను ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామి మీకు ఓ బహుమతి ఇవ్వొచ్చు. కష్టపడి పనిచేయడం వల్ల వ్యాపార రంగంలో పరిస్థితులు సజావుగా సాగుతాయి. ఆర్థరైటీస్ తో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలిపోయిన ఆహారాన్ని తినడం మానుకోండి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : రాత్రి 9:30 నుండి మధ్యాహ్నం 1:45 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బలంగా ఉంటుంది. అయినా మీరు తెలివిగా ఖర్చు చేయాలి. ప్రణాళిక ప్రకారం పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు రోజు ఆనందిస్తారు. కొత్త ప్రాజెక్టు గురించి మీరు ఉత్సాహంగా ఉంటారు. కార్పొరేట్ రంగంలో ఉన్న వారికి మార్పులు రావచ్చు. మీ తల్లిదండ్రులు రిలాక్స్ అవుతారు. మీ కుటుంబంలో ఇది అనుకూలమైన రోజు అవుతుంది. ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఒక చిన్న ట్రిప్ ఉంటుంది. బిజినెస్ లో ఉండే వారికి భారీ లాభం వస్తుంది. మీ జీవిత భాగస్వామితో శృంగారం అద్భుతంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ :54

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 1:50 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రోజు ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. మీరు పనిలో రిలాక్స్ అవుతారు. మొత్తం మీద సంతోషంగా ఉంటారు. విద్యార్థులు తమను తాము నిరూపించుకోవడం చాలా కష్టం. ఉద్యోగ మార్పు కోసం మీకు కొద్దిగా ఎంపిక మిగిలి ఉండొచ్చు. సరైన సమయంలో ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. మీరు మీ రోజు తప్పక ప్రారంభించాలి. బిజినెస్ రంగంలో మీ కృషి పరంగా పరిస్థితులు మెరుగవుతాయి. చాాలా కాలం తర్వాత కొత్తగా వివాహం అయిన జంటలు ప్రేమ పక్షుల్లా విహరిస్తారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : రాత్రి 7:30 నుండి రాత్రి 8:45 గంటల వరకు

Story first published: Saturday, October 5, 2019, 6:00 [IST]
Desktop Bottom Promotion