గురువారం మీ రాశిఫలాలు (19-09-2019)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

జ్యోతిష్యం, సెప్టెంబర్ 19వ తేదీ

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, భాద్రపదమాసం, ద్వాదశి బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

వివాహమైన వారికి ఇది ఒక గొప్ప రోజు అవుతుంది. ఎందుకంటే మీరు ఒకరితో ఒకరు విలువైన సమయాన్ని గడుపుతారు. శృంగారం మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. కొన్నిసార్లు స్వేచ్ఛగా జీవించడం చాలా ముఖ్యం. కాబట్టి మీ రోజును ఆస్వాదించండి. జంటల మధ్య పరస్పర అవగాహన వల్ల పరిస్థితులు ప్రత్యేకంగా మారతాయి. మీ యజమాని మీ పని దగ్గర అనుకూలంగా ఉంటారు. మీపై నమ్మకాన్ని చూపుతారు. మీకు త్వరలో ప్రమోషన్ వస్తుంది. కుటుంబంలో ప్రశాంతమైన మరియు అనుకూలమైన రోజు అవుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మీకు ఆరోగ్యంగా ఉండటానికి ఉత్తమమైన ఆలోచన. తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదల మీకు రిలాక్స్ గా అనిపిస్తుంది. ఇది వ్యాపారవేత్తలకు సాధారణ రోజు అవుతుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:20 నుండి 9:15 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఆరోగ్యం విషయంలో ప్రతికూలంగా ఉంటుంది.ఎందుకంటే వాతావరణం ఒడిదుడుకులే ప్రధాన కారణం కావచ్చు. అందుకే ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా చిన్న సమస్యలపైనా అప్రమత్తంగా ఉండండి. మీరు మీ డబ్బును సమయానికి అందుకోకపోవచ్చు కాబట్టి ఆర్థిక పరంగా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరినీ సులభంగా నమ్మొద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ దూరం ప్రయాణించడం మానుకోండి. ఇది పెట్టుబడి పెట్టేరోజు కాదు. ముఖ్యమైన విషయాలపై తండ్రి సలహా తీసుకోవడం మంచిది. ప్రణాళిక ప్రకారం పనులు చేసుకోవాలి. మీ సన్నిహితులు మిమ్మల్ని బాధపెట్టొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

లక్కీ కలర్ : మెజెంటా

లక్కీ నంబర్ : 42

లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 8:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

జీవితం పట్ల మీ సానుకూల విధానం సహాయపడుతుంది. పనిలో చిన్న సవాళ్లు ఎదురవుతాయి. కానీ మీ ప్రియమైన వారు మీకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తున్నందున మీకు సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టు వస్తుంది. మీకు ఉపశమనం లభించడంతో చట్టపరంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇది అనుకూలమైన రోజు అవుతుంది. మీ కుటుంబ మద్దతు మీకు బలం చేకూరుస్తుంది. మీరు దీన్ని త్వరలో గ్రహిస్తారు. చిన్న వాదన బాధగా అనిపిస్తుంది. కాబట్టి మీ ప్రియమైన వారితో కష్టమైన రోజు అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీకు మంచి మరియు నమ్మకం కలుగుతుంది.

లక్కీ కలర్ : రస్ట్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి 7:45 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21-జులై22

కర్కాటక రాశి : జూన్ 21-జులై22

మీరు ఎక్కువ పెట్టుబడుల కోసం ప్లా చేస్తుంటే ఆర్థిక రంగంలో నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉంటాయి. భారీ లావాదేవీల కోసం ప్లాన్ చేసేవారు ముందుకు వెళ్లొచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ప్లాన్లు సక్సెస్ అవుతాయి. కార్పొరేట్ రంగంలో ఉన్నవారు మంచి పనితీరు కనబరుస్తారు. విద్యార్థులు చాలా కాలం తర్వాత రిలాక్స్ అవుతారు. కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న మీకు ప్రశంసలు అందుతాయి. యజమాని మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. మీ సహోద్యోగులు ముఖ్యమైన నిర్ణయంపై మీ సలహా తీసుకుంటారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు సానుకూల ఫలితాలను పొందడానికి కష్టపడి పనిచేస్తారు. మీ భాగస్వామి సహకారంతో మీరు చాలా పనులు చేయాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి మరింత కష్టపడండి. కారం ఉండే, జిడ్డుగల ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి. మొత్తంగా విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : పీచ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి సాయంత్రం 4:10 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

మీ జీవితంలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. మీ జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. మీ సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఉద్యోగ మార్పు గురించి మీ మనసులో ఎక్కువగా ఆలోచిస్తారు. మీ కుటుంబంతో యాత్ర మీకు ఊహించని ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక విషయాలలో మీరు పెద్దలను సంప్రదించవచ్చు. మీ దూకుడు ప్రవర్తన మీ పరిస్థితిని దిగజారుస్తుంది. కాబట్టి మీ కోపాన్ని నియంత్రించండి. తోబుట్టువుల సంబంధం పరంగా ఈరోజు అంత అనుకూలం కాదు. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే మీరు డబ్బు విషయంలో గందరగోళం చెందుతారు. మీరు సాయంత్రానికి అలసిపోతారు. ఆరోగ్యంగా ఉండటానికి జిడ్డుగల ఆహారాన్ని తీసుకోండి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి 6:15 గంటల వరకు

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మీ నిరీక్షణకు అనుగుణంగా ఉంటారు. మీరు రోజంతా సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగ మార్పరు అయినా, జీతాల పెంపు అయినా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు కుటుంబం కోసం ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. వారికి అది ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. వ్యాపారవేత్తలు లాభం పొందుతారు. పాత స్నేహితుడిని కలుసుకోవడం గొప్ప ఆలోచన అవుతుంది. తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తోబుట్టువుల బంధం వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుంది. మీరు ఆర్థిక పరంగా ఎవరికైనా సహాయం చేయవచ్చు. దగ్గరి బంధులు లేదా స్నేహితుడు, మ్యానిప్యులేటెడ్ వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. మొత్తానికి ఇది ఆరోగ్యకరమైన రోజు అవుతుంది. యోగా మరియు ధ్యానం మీ అలవాటు అయితే మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది, కాబట్టి మీరు చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారు.

లక్కీ కలర్ : గోధుమ రంగు

లక్కీ నంబర్ : 39

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి సాయంత్రం 5:55 గంటల వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి మీరు మంచి అనుభూతి చెందుతారు. పని సంబంధిత ప్రయాణం ఉంటుంది కాబట్టి కొంత బిజీగా ఉంటారు. వివాహిత జంటలకు సంపన్నమైన సమయం అవుతుంది. ఎందుకంటే మీరు బలమైన బంధాన్ని ఏర్పరుస్తారు. పిల్లలు, క్రీడలు మరియు విద్యావేత్తలలో మంచి ప్రదర్శన ఇస్తారు. రియల్ ఎస్టేట్ లో ఉన్నవారు కొత్త ప్రాజెక్టును చూస్తారు. ప్రజలను సులభంగా విశ్వసించే మీ అలవాటు మిమ్మల్ని తప్పుగా రుజువు చేస్తుంది. వాదనల్లోకి రాకుండా ఉండండి. ద్విచక్ర వాహనం లేదా కారు అయినా డ్రైవింగ్ మానుకోండి. పొత్తి కడుపు సమస్యతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత వాదనకు దిగడం మానుకోండి. ఎందుకంటే ఇది చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఉదయం నడకతో మీ రోజు ప్రారంభించడం మంచి ఎంపిక.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 32

లక్కీ టైమ్ : ఉదయం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

నక్షత్రాలు అనుకూలంగా ఉన్నందున ఇది ఆహ్లాకరమైన రోజు అవుతుంది. మీ అదనపు ఆదాయ వనరు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మీకు ఆర్థిక భారం నుండి ఉపశమనం లభిస్తుంది. పెద్దలు చదువుకోవడానికి మీ పిల్లవాడిని విదేశాలకు పంపాలని మీరు ప్లాన్ చేస్తారు. మీ ప్రియమైన వారితో భవిష్యత్తు గురించి చర్చించడానికి మీరు వెనుకాడొచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు పని ఒత్తిడి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్తగా వివాహం చేసుకున్న జంటలకు ఇది శృంగార దినం అవుతుంది. ఎందుకంటే మీరు లాంగ్ డ్రైవ్ కోసం వెళతారు. సాయంకాలం స్నేహితుడితో బిజీగా ఉంటారు. మీ ఆరోగ్యం క్షీణిస్తుందన్న గాసిప్ లకు దూరంగా ఉండండి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 41

లక్కీ టైమ్ : ఉదయం 5:40 నుండి ఉదయం 11 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

మీరు ఈరోజు కుటుంబ సభ్యుడితో వాదనతో ప్రారంభించవచ్చు. పరిస్థితులు తప్పుగా మారతాయి. మీ ఆఫీసులో స్లోగా ఉంటుంది. మీరు పెండింగులో ఉంచే పనుల గురించి మీ యజమాని కోపంగా ఉంటారు. కుటుంబ సభ్యుల జోక్యం చికాకు కలిగించే విధంగా ఉంటుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని విషయాలను విస్మరించండి. ఈ అలవాటును మెజారిటీని ప్రజలు అంగీకరించకపోవచ్చు. మీ తోబుట్టువు మీకు మద్దతు ఇవ్వదు. పరిస్థితులు త్వరలో సాధారణంగా మారతాయి. కాబట్టి మీరు ఓపిక పట్టాలి. గుండె సంబంధిత రోగులు జాగ్రత్తగా ఉండాలి. యోగా మరియు ధ్యానంలో పాల్గొనేందుకు ఇష్టపడండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మీరు మీ సంబంధం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. మీరు కుటుంబం మరియు పిల్లలతో విలువైన సమయాన్ని గడుపుతారు. మీ తండ్రి ఆరోగ్యం మిమ్మల్ని మరియు కుటుంబాన్ని కలవరపెడుతుంది. ఇది ఆర్థిక రంగంలో లాభదాయకమైన రోజు అవుతుంది. మీరు ఆర్థిక విషయాలపై శుభవార్తను చూడొచ్చు. మీరు ఎక్కడో చిక్కుకుపోవచ్చు. ఇది మీ ప్రియమైన వారితో గొడవలకు కారణం అవుతుంది. లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల శ్రేయస్సు వస్తుంది. ప్రియమైన వారితో సమయం గడపడం ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి మెరుగుదల మీకు సానుకూల అనుభూతిని కలిగిస్తుంది.

లక్కీ కలర్ : వైలెట్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఆరోగ్యం విషయంలో ఈరోజు కఠినంగా ఉంటుంది. మీ ఆఫీసులో మీకు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి. పనికి సంబంధించిన ప్రయాణాలు కూడా ఉన్నాయి. అందుకే కుటుంబంతో సమయాన్ని కూడా గడపలేరు. ఇది వివాదానికి కారణం అవుతుంది. స్పోర్ట్స్ అండ్ డ్యాన్స్ పై ఆసక్తి ఉన్న పిల్లలు అనూహ్యంగా మంచి ప్రదర్శన ఇస్తారు. మీ భాగస్వామి యొక్క చిరాకు ప్రవర్తన మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. పొరుగువారితో చిన్న వాదన కూడా అంతరాన్ని ఏర్పరుస్తుంది. పరిస్థితులను ఓపికగా భరించాలి. పరిస్థితులు అనుకూలంగా ఉండటానికి ప్రశాంతంగా ఉండండి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : తెల్లవారుజాము 2:30 నుండి ఉదయం 8:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీరు మీ వైఖరిని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీ పనిలో మీరు ఉద్యోగ మార్పు కోసం ప్లాన్ చేయవచ్చు. కార్పొరేట్ రంగంలో ఉన్నవారు ఒక చిన్నయాత్రను ప్లాన్ చేస్తారు. ఎందుకంటే తీవ్రమైన షెడ్యూల్ మీకు చిరాకు కలిగిస్తుంది. మీరు ఈరోజు అధికంగా ఖర్చు చేస్తారు. వ్యాపారవేత్తలకు లాభదాయకమైన రోజు అవుతుంది. రియల్ ఎస్టేట్ లో ఉన్నవారికి ఇది ఒక వరంగా ఉండే కాలం. ఆస్తికి సంబంధించిన వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు లాభమొస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడం ద్వారా మీకు హాయిగా ఉంటుంది. ఈరోజు అందరికీ ఆరోగ్యకరమైన రోజుగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 42

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

Desktop Bottom Promotion