For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం దినఫలాలు : మీన రాశి వారు ఈరోజు భాగస్వామితో ఎక్కువగా గడపాలనుకుంటారు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అశ్వీయుజమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope September 25, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మీ ఇంటిలోని దుష్టశక్తులను నివారించడానికి పూజ గదిలో ఇలా చేయండి ...మీ ఇంటిలోని దుష్టశక్తులను నివారించడానికి పూజ గదిలో ఇలా చేయండి ...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పనికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు పూర్తి ఏకాగ్రతతో పని చేయకపోతే మీ ఉద్యోగం ప్రమాదంలో పడవచ్చు. వ్యాపారులకు ఏదైనా ముఖ్యమైన పని అకస్మాత్తుగా ఆగిపోవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే అది తాత్కాలికమైనది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, మీ ఆర్థిక సమస్య తొలగిపోవచ్చు.

ఈరోజు మీరు మీ ప్రియమైన వ్యక్తిని ప్రేమతో చూసుకోవాలి. ఈ సమయంలో వారికి మీ భావోద్వేగ మద్దతు అవసరం. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క అసంతృప్తి తొలగించబడుతుంది ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు గొప్ప ప్రయోజనాలను ఆశిస్తున్నట్లయితే, మీ ఆర్థిక నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకోండి. ఉద్యోగం చేసేవారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీకు ఒక బాధ్యత అప్పగించబడవచ్చు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందవచ్చు. ఈ రోజు మీరు కొంతమంది కొత్త వ్యక్తులతో కనెక్ట్ కావచ్చు. ప్రతికూల ఆలోచనలు లేదా అలాంటి వాతావరణానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు కొన్ని పెద్ద ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఇలాంటి సమయంలో మీరు ఓపికగా ఉండాలి. మీరు నిగ్రహాన్ని కోల్పోతే, మీరే కష్టాలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించిన కూడా ఓ సమస్య ఉండవచ్చు. మీ అన్నయ్యతో ఈ విషయంలో మీకు సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయండి. ఆరోగ్యపరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 8 గంటల వరకు

పెళ్లిలో ఈ తప్పులు చేస్తే... వధూవరులకు ఎంత నష్టమో తెలుసా...!పెళ్లిలో ఈ తప్పులు చేస్తే... వధూవరులకు ఎంత నష్టమో తెలుసా...!

కర్కాటక రాశి : జూన్ 21 నుండి జూలై 21 వరకు

కర్కాటక రాశి : జూన్ 21 నుండి జూలై 21 వరకు

ఈ రాశి వారు ఈ రోజు పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ సమస్యలు పరిష్కరించబడతాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. వ్యాపారులకు కొన్ని ముఖ్యమైన పనుల్లో అంతరాయం ఏర్పడొచ్చు. అయితే మరోవైపు మీరు పెద్ద ప్రయోజనం పొందవచ్చు. ఈ రోజు మీరు మంచి ప్రయోజనాలను ఆశించవచ్చు. మీరు మీ కుటుంబానికి పూర్తి సమయం ఇవ్వండి మరియు వారు మీకు ఎంత ముఖ్యమో వారికి తెలుసుకోండి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రత్యేకంగా ఏమీ ఉండదు. వ్యాపారులకు కూడా ఈరోజు కొంత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగులు కార్యాలయంలో గాసిప్పులు మానుకోండి. లేకపోతే సీనియర్లు ఈరోజు కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. మీరు చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటుంటే, మీరు వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. మీ కుటుంబ జీవితంలో ఉద్రిక్తత ఉంటుంది. తల్లిదండ్రులు మీపై చాలా కోపంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఉండవచ్చు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ఉండటం మంచిది. లేకపోతే మీకు కష్టంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ పట్ల సరిగ్గా ఉండదు. మీ మధ్య సైద్ధాంతిక తేడాలు ఉండొచ్చు. పని చేసే వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు పెద్ద మెరుగుదల ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరు పొందే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వాస్తుశాస్త్రం ప్రకారం ఆ వైపునే తిరిగి పడుకోవాలి... ఈ వైపునే తిరిగి నిద్ర లేవాలి...!వాస్తుశాస్త్రం ప్రకారం ఆ వైపునే తిరిగి పడుకోవాలి... ఈ వైపునే తిరిగి నిద్ర లేవాలి...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పరీక్ష ఫలితం కోసం ఎదురు చూస్తుంటే మీరు అద్భుతమైన విజయాన్ని పొందవచ్చు. ఈరోజు ఆర్థిక రంగంలో బాగానే ఉంటుంది. కానీ, మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. పని విషయంలో మీకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్యం ఈరోజు పరిపూర్ణంగా ఉంటుంది. మీరు మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ ప్రియమైనవారితో మీరు ఆనందంగా గడుపుతారు. మీ తమ్ముడు లేదా సోదరికి సంబంధించిన ఏవైనా చింతలను ఈ రోజు అధిగమించవచ్చు. వారితో మీ సంబంధం కూడా బలంగా ఉంటుంది. మరోవైపు మీరు, అకస్మాత్తుగా మీరు గందరగోళ స్థితిలో ఉన్న పరిస్థితిని ఎదుర్కొంటారు. మీరు సరైన నిర్ణయం తీసుకోలేరని భావిస్తే, అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించిన తర్వాతే మీ తుది నిర్ణయం తీసుకోండి. మీకు మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయ వాతావరణం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 4:55 నుండి రాత్రి 11 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో గొప్ప సమయం గడుపుతారు. అయితే మీరు గ్లోబల్ మహమ్మారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం తేలికగా ఉంటుంది. వ్యాపారులకు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం ఈరోజు బలంగా ఉంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబసభ్యులలో ఐక్యత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు గొప్పగా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఈరోజు మంచి ప్రయత్నం పొందవచ్చు. ఈరోజు ఉద్యోగులు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీరు తల్లిదండ్రుల నుండి అభినందనలు పొందుతారు. వారు మీతో చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా విషయంలో లాభం వస్తుందని, ఆలోచించకుండా దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకండి, లేకపోతే తరువాత మీరే ఇబ్బంది పడతారు. ఆర్థిక పరంగా ఈరోజు కొంత కష్టంగా ఉంటుంది. మీ స్నేహితుల సహాయంతో, మీకు పెద్ద ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది. పని విషయంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు పనిలో ఒత్తిడికి గురవుతున్నట్లయితే, మీరు విశ్రాంతి తీసుకోవాలి. ఈ విధంగా ఒత్తిడిలో పనిచేయడం వల్ల మీ పనిలో సామర్థ్యం తగ్గుతుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope September 25, 2020

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published:Thursday, September 24, 2020, 22:01 [IST]
Desktop Bottom Promotion