For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం దినఫలాలు : మకర రాశి వ్యాపారులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అశ్వీయుజమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope September 26, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఐశ్వర్య కాళీ దీపం ఏ వారం వెలిగిస్తే మంచి ఫలితాలొస్తాయో తెలుసా...!ఐశ్వర్య కాళీ దీపం ఏ వారం వెలిగిస్తే మంచి ఫలితాలొస్తాయో తెలుసా...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొంత సమస్య ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు నిరాశ పడకుండా, కొంత ఓపిక పట్టాలి. త్వరలో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండండి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో ఎవ్వరినీ నమ్మకండి. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటే, అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు ఆఫీసులో నిర్లక్ష్యంగా ఉండకండి. లేకపోతే మీ పనులు పెండింగులో పడిపోతాయి. మీ కుటుంబ జీవితానికి సంబంధించిన కొన్ని క్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత అసౌకర్యంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 32

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. మీరు విద్యారంగంలో కొంత గొప్ప విజయాన్ని పొందవచ్చు. పని విషయంలో ఈరోజు మానసికంగా మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. ఒత్తిడిని తగ్గించడం ద్వారా, మీరు మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టగలుగుతారు. ఉద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. వ్యాపారులకు ఈరోజు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బంది ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు కొత్త పనులను ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో చేయాలి. అప్పుడు మీకు కచ్చితంగా విజయం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు కష్టంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల మీరు అధ్యయనాలపై శ్రద్ధ చూపలేరు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:20 గంటల వరకు

మీ ఇంటిలోని దుష్టశక్తులను నివారించడానికి పూజ గదిలో ఇలా చేయండి ...మీ ఇంటిలోని దుష్టశక్తులను నివారించడానికి పూజ గదిలో ఇలా చేయండి ...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈ రోజు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా చురుకుగా ఉంటారు. మీ అన్ని పనులను పూర్తి బాధ్యతతో చేస్తారు. వ్యాపారులు గొప్ప ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. కానీ మీ వ్యక్తిగత జీవితంలో సమస్య ఉండవచ్చు. ఈరోజు ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. మీరు కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనాలని ఆలోచిస్తుంటే, సమయం అందుకు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. మీరు అవివాహితులైతే, ఈరోజు మీ కోసం గొప్ప వివాహ ప్రతిపాదన రావచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మీరు ప్రభుత్వం నుండి లబ్ది పొందవచ్చు. ఉద్యోగాలు చేసేవారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు కార్యాలయంలో ఏదైనా ప్రతికూల సమాచారాన్ని పొందవచ్చు. మీరు టార్గెట్ బేస్డ్ వర్క్ చేస్తే మీ టార్గెట్ ను చేరుకోవడంలో మీకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఖర్చులను నియంత్రించాలి. మీ వివాహ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులలో ఓపికగా ఉండాలి. కొంతమంది రహస్య శత్రువులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. వారు మీ గురించి తప్పుడు విషయాలు ప్రచారం చేయడం ద్వారా మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించవచ్చు. మీరు కళ్ళు మూసుకుని ఎవరినీ నమ్మకుండా ఉండటం మంచిది. వ్యాపారులకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 8 గంటల వరకు

వాస్తుశాస్త్రం ప్రకారం ఆ వైపునే తిరిగి పడుకోవాలి... ఈ వైపునే తిరిగి నిద్ర లేవాలి...!వాస్తుశాస్త్రం ప్రకారం ఆ వైపునే తిరిగి పడుకోవాలి... ఈ వైపునే తిరిగి నిద్ర లేవాలి...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. లేకపోతే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. అకస్మాత్తుగా మీ యజమాని మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగవచ్చు. మీకు సమాధానం ఇవ్వడం కష్టంగా మారుతుంది. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీరు పిల్లలతో సమయం గడుపుతారు. ఇది మీకు గొప్ప ఉపశమనం ఇస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తే సమస్య ఉండదు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ రోజు పని నుండి విరామం తీసుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం మంచిది. మీరు ఎక్కువగా పరుగెత్తటం మానుకోండి లేకపోతే మీ సమస్య పెరుగుతుంది. వ్యాపారులు ఈరోజు చిన్న పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. ఇంట్లో మీ పెద్దలు మీకు ఏదైనా సలహా ఇస్తే, మీరు వాటిని బాగా వినాలి. ఇది మీ మంచి కోసమే. మీ వైవాహిక జీవితంలో శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు సాంగత్యం పొందడం ద్వారా మీరు ఒత్తిడిని తగ్గించుకుంటారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా సమస్యలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి.ఈ రోజు మీరు డబ్బు గురించి మరింత ఆందోళన చెందుతారు. అధిక ఒత్తిడి కారణంగా, ఈ రోజు మీ ఆరోగ్యం కష్టంగా ఉంటుంది. మరోవైపు మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మంచి అనుభూతి చెందుతారు. ఈరోజు మీ పనిలో కొంత గందరగోళం ఉండొచ్చు. వ్యాపారులు వ్యాపారంలో ఎక్కువ ప్రయోజనం పొందలేరు. మీరు మీ వ్యాపారం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే, జాగ్రత్తగా ఆలోచించి తగిన సలహా తీసుకున్న తర్వాత మీ అడుగు ముందుకు వేయండి. మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు, కానీ మీ భాగస్వామి సహాయంతో, మీ సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి. మీడియా మరియు ఫ్యాషన్ రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజు ప్రయోజనం పొందవచ్చు. మీరు గొప్ప పురోగతి పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచి స్థితిలో ఉంటారు. మీరు షాపింగ్‌కు వెళ్లవచ్చు లేదా స్నేహితులతో ప్రయాణించడం ఆనందించవచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 11:25 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు మానసికంగా బలహీనంగా ఉంటారు. చిన్న విషయాలు కూడా మీ హృదయాన్ని దెబ్బతీస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు ప్రతికూలతను అనుభవిస్తారు. మీరు డబ్బు పరంగా మంచి ఫలితాలను పొందవచ్చు. మీ మార్గంలో ఉన్న అడ్డంకి తొలగించబడుతుంది. మీరు కార్యాలయంలోని సహోద్యోగులతో కలిసి పని చేస్తారు. ఉన్నతాధికారుల దయతో, త్వరలో మీరు కొంత గొప్ప విజయాన్ని పొందవచ్చు. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్లాన్ చేయవచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. మీ సంబంధం యొక్క మాధుర్యం పెరుగుతుంది మరియు పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది. రోజూ యోగా, ధ్యానం చేయడం వల్ల మీరు శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కొంత మంచి విజయం పొందవచ్చు. వ్యాపారులు ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు అకస్మాత్తుగా ఎవరితోనైనా వివాదం చేయవచ్చు. కానీ మీరు వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. మీ కుటుంబంతో సమయాన్ని గడపడం ద్వారా మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. మీ జీవిత భాగస్వామి సంభాషణ సమయంలో మీ మాటలను ఆలోచనాత్మకంగా ఉపయోగించుకోండి. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:25 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope September 26, 2020

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published:Friday, September 25, 2020, 23:53 [IST]
Desktop Bottom Promotion