Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
మంగళవారం మీ రాశిఫలాలు (08-09-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, భాద్రపదమాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది. అయితే, ప్రస్తుతం, మీరు సౌకర్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రత్యర్థులు మీ కంటే చురుగ్గా ఉంటారు. వ్యాపారులు ఈరోజు చాలా సహనంతో పని చేయాలి. మీరు ఈరోజు కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలవవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. వైవాహిక జీవితంలో సానుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదా చేయగలుగుతారు.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. మీ అన్ని పనులను వేగంగా పూర్తి చేయగలరు. చాలా కాలంగా కొన్ని కారణాల వల్ల పెండింగులో ఉన్నపనులపై ఈ రోజు మీరు శ్రద్ధ చూపుతారు. కళారంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజు మంచి విజయాన్ని పొందవచ్చు. అయితే ఈరోజు ఆర్థిక పరంగా మాత్రం కొన్ని నష్టాలు ఎదురవ్వచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబంతో మీకు మంచి సంబంధం ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, మీ కుటుంబసభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. పని విషయంలో ఈరోజు అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీకు ఒక సమస్య ఎదురవుతుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు ఎలాంటి పరిస్థితులలో అయినా చాలా సంయమనంతో పనిచేయాలి. మీరు కోపంలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దు. మరోవైపు ఈరోజు ఏదైనా విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. వ్యాపారులకు ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు కుటుంబసభ్యులతో మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 7 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈ రోజు మీ కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. మీ బాధ్యతలను నెరవేర్చడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఇది కాకుండా, మీరు ఇంటి సభ్యునితో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మీ అవగాహనతో దాన్ని అధిగమించేందుకు సహాయపడతారు. మరోవైపు ఈ రోజు మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఈ రోజు పని విషయంలో మీకు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలరు. ఈ రోజు వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 35
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మీ మనస్సు చిరాకుగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఉద్యోగులు కార్యాలయంలోని సహోద్యోగులతో విభేదాలను నివారించండి. మీరు కలిసి పనిచేయాలి. ఇది మీ ఇమేజ్‌ను కూడా బలోపేతం చేస్తుంది. వ్యాపారులకు ఈరోజు కొన్ని ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : సాయంత్రం 6:45 నుండి రాత్రి 10 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ఇది కాకుండా, మీరు ఈ రోజు కార్యాలయంలో కొన్ని శుభవార్తలను కూడా వినే అవకాశం ఉంది. మీరు వ్యాపారం చేస్తే, మీ ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలను మీరే అర్థం చేసుకుంటారు. ఇతరుల మాటలను విని, మీరు ఏ పని చేయవద్దు, లేకపోతే మీరు నష్టపోవలసి వస్తుంది. మీ ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి చాలా బిజీగా ఉంటారు. దీనివల్ల మీరిద్దరూ ఒకరితో ఒకరు తగినంత సమయం గడపడానికి అవకాశం పొందలేరు. ఆర్థిక పరంగా ఈరోజు ఒక సమస్య ఎదురవుతుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : సాయంత్రం 4:15 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే, మీరు అతి పెద్ద సవాళ్లను సైతం సులభంగా ఎదుర్కోగలుగుతారు. అయితే మీరు పని చేసే విధానంలో కొన్ని మార్పులు చేయాలి. ఇది కాకుండా, మీరు మీ వేగంపై కూడా శ్రద్ధ వహించాలి. వ్యాపారులు ఈరోజు ఏదైనా సమస్య ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోడానికి ప్రయత్నించాలి. లేదంటే మీకు కష్టాలు పెరుగుతాయి. మీ కుటుంబ జీవితంలో ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం పరంగా ఈరోజు బాగుంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : సాయంత్రం 5:10 నుండి రాత్రి 9:50 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో కొన్ని బాధ్యతలు పెరగొచ్చు. దీని వల్ల మీరు బిజీగా మారిపోతారు. అప్పుడు మీకు ఉన్నతాధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు ఈరోజు తమ పనిని పూర్తి శక్తితో చేస్తారు. దీని వల్ల మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు. ఈ రోజు చిన్న వ్యాపారులకు ప్రత్యేక లాభం ఉండకపోవచ్చు. మరోవైపు మీ బాధ్యతలను నెరవేర్చడంలో మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రియమైనవారు మిమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారో మీకు అనిపిస్తుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఒక సమస్య ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : ఉదయం 8:55 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు రావొచ్చు. మీకు పని విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఈ రోజు ఆర్థిక పరంగా కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించడానికి చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ ఇంటి వాతావరణం మామూలుగా ఉంటుంది. మీ కుటుంబంతో సంబంధంలో ప్రేమ ఉంటుంది. మీరు వైవాహిక జీవితంలో నీరసంగా ఉన్నట్లయితే, ఈ రోజు మీ ప్రియమైనవారి కోసం కొన్ని మంచి ప్రణాళికలు రూపొందించడానికి ప్రయత్నించండి. ఇది మీకు ఒకరితో ఒకరు సమయం గడపడానికి అవకాశం ఇస్తుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8:55 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో విద్యార్థులు ఈరోజు మీ చదువుల గురించి ఒత్తిడికి గురవుతుంటే, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. వినోద కార్యక్రమాలకు కూడా శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రుల అభిమానం మరియు ఆశీర్వాదాలను పొందుతారు. ఈ రోజు మీరు ఏదైనా ఇబ్బందుల్లోకి వస్తే, మీ స్నేహితులు మరియు మీ కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో పని విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు ఈ రోజు ప్రత్యేక లాభం పొందలేరు. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈ కారణంగా మీరు మానసిక స్థితిలో ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ పొందుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందాలు పెరుగుతాయి. మీరు పెళ్లికానివారు మరియు మీ వివాహంలో సమస్య ఉంటే, అది త్వరలోనే తొలగిపోయే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. తండ్రి నుండి ప్రయోజనం సాధ్యమే. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే, ఆఫీసులో ఎక్కువ పని చేయడం వల్ల మీకు మీకోసం సమయం లభించదు. అయితే, మీరు ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ యొక్క ఫలాలను సరైన సమయంలో పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











