Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
Dhanteras 2020 : ధనత్రయోదశి రోజున మీ రాశిని బట్టి ఏమి కొనాలో చూసెయ్యండి...!
మీ రాశిని బట్టి ధంతేరాస్ పండుగ వేళ మీరు ఏమి కొనాలో తెలుసుకోండి.
దీపావళికి ముందు వచ్చే ధంతేరాస్(ధన త్రయోదశి) పండుగకు మన దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ పండుగను ఎక్కువగా ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు. అందులోనూ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వ్యాపారులు జరుపుకునేవారు.

అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భాగంగా ఈ పండుగ దక్షిణ భారతదేశానికి విస్తరించింది. ఈ ఏడాది నవంబర్ 13వ తేదీన శుక్రవారం ఈ దంతేరాస్ పండుగ వచ్చింది. ఈ సమయంలో చాలా మంది బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతుంటారు.

అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ పవిత్రమైన రోజున మీ రాశిని బట్టి మీరు ఈ రకమైన వస్తువులను కొంటే మీకు శుభప్రదంగా ఉంటుందట. అలాగే ఈరోజున ఎట్టి పరిస్థితుల్లో కొనకూడని వస్తువుల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు ధంతేరాస్ పండుగ రోజున బంగారం నాణేలు, వెండి పాత్రలు, వజ్రాల ఆభరణాలను కొనుగోలు చేయాలి. దీని వల్ల మీకు ప్రయోజనకరంగా ఉండొచ్చు. అయితే మీరు ఈరోజు ఐరన్, తోలు లేదా రసాయనాలను వంటి వస్తువులను కొనడం మానుకోవాలి.

వృషభరాశి..
ఈ రాశి వారు బంగారం, వెండి, కాంస్యం, వజ్రాలు మరియు కొత్త పాత్రలను కొనుగోలు చేయొచ్చు. దీని వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. అలాగే కుంకుమపువ్వు మరియు పాదరక్షలను కూడా కొనొచ్చు. అయితే మీరు చమురు, తోలు, కలప లేదా వాహనాలను కొనడం వంటి వాటిని నివారించాలి.

మిధున రాశి..
ఈ రాశి వారికి ధంతేరాస్ రోజున శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు బంగారం, వెండి వంటి వస్తువులను కొనుగోలు చేయొచ్చు. అలాగే భూమి, ఇల్లు లేదా ఏదైనా ఫర్నిచర్ వంటి వాటిని కూడా కొనొచ్చు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు ధంతేరాస్ సమయంలో మీ కుటుంభ సభ్యుల మీద ఏదైనా వస్తువులను కొనుగోలు చేయడం మంచిది. మీరు పిల్లలకు ఏదైనా వస్తువులను బహుమతిగా ఇవ్వాలనుకుంటే, కూడా ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే బంగారం లేదా ఏదైనా షేర్ మార్కెట్ ఒప్పందాలలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి.

సింహ రాశి..
ఈ రాశి వారు ఈరోజు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, చెక్కతో తయారు చేసిన పాత్రలను, ఇళ్లు, ఫ్లాట్స్, బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేయొచ్చు. అయితే ఐరన్, సిమెంట్ ఆధారిత సంబంధిత వస్తువులను కొనుగోలు చేయకండి.

కన్య రాశి..
ఈ రాశి వారు ధంతేరాస్ వంటి పవిత్రమైన రోజున భూమి, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు గ్యాడ్జెట్లను కొనుగోలు చేయాలి. అయితే మీరు వ్యక్తిగతంగా బంగారం, వెండి, వజ్రాలను కొనకపోవడం మంచిది. అలాగే కొత్త బట్టలలో తెల్లని వస్త్రాలు ధరించకపోవడం మంచిది.

తుల రాశి..
ఈ రాశి వారు ధనత్రయోదశి రోజున బంగారం మరియు వజ్రాల వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త వస్తువులను కొనాలనుకుంటే, మీ కుటుంబ సభ్యుల పేరిట అవసరమైన వస్తువులను కొనడం చేయండి.

వృశ్చికరాశి..
ఈ రాశి వారు ధనత్రయోదశి వంటి పవిత్రమైన సమయంలో బంగారం, వెండి, బట్టలు, కుండ, ఐరన్ తో తయారైన వస్తువులను కొనడం మంచిది. అయితే బ్రాండెడ్ వస్తువులను కొనే సమయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీరు పెద్ద ఆస్తి వాటాలలో పెట్టుబడులు పెట్టకండి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు ధన త్రయోదశి రోజున భూమి మరియు, విలువైన లోహాలు, వజ్రాలు, రాళ్లను కొనుగోలు చేయాలి. ఈ సమయం మీకు కొనుగోళ్లకు చాలా శుభప్రదంగా ఉంటుంది.

మకర రాశి..
ఈ రాశి వారు ధంతేరాజ్ పండుగ సమయంలో ఏది కొన్నా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు కుటుంబం లేదా పూర్వీకుల వస్తువులు మీకు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి.

కుంభ రాశి..
ఈ రాశి వారు ధనత్రయోదశి సమయంలో మీకు నచ్చిన పుస్తకాలు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నీచర్ మరియు మీ ఇంటికి అందమైన అలంకరణ వస్తువులను కొనాలి. ఈ పవిత్ర సమయం చాలా రంగాలలో పెట్టుబడి పెట్టడానికి మంచిగా ఉంటుంది. ఏదేమైనా, ఏదైనా స్థిర ఆస్తులు లేదా వాటాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి..
ఈ రాశి వారు ఈరోజు బంగారం, వెండి వంటి విలువైన లోహాలు మరియు ఏదైనా రత్నాలను కొనుగోలు చేయొచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో వాటాల పెట్టుబడి వంటి వాటికి దూరంగా ఉండాలి. దీని వల్ల మీకు ప్రతికూలంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
