Latest Updates
-
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే!
Garuda Purana: గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు అస్సలే చేయొద్దు, చేస్తే కష్టాలు తప్పవు!
సరైన సమయంలో పుణ్యం లేదా మంచి పనులు చేయడం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెబుతోంది. సరైన సమయంలో సత్కార్యాలు చేయకపోతే బాధలు, అనర్థాలు కలుగుతాయని గరుడ పురాణం చెబుతోంది. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ మతంలో గరుడ పురాణానాన్ని చాలా పవిత్రమైనదిగా చెబుతారు. ఇది 18 మహాపురాణాల్లో ఒకటిగి పరిగణించబడుతోంది. మహా విష్ణువు తన వాహనమైన గరుడుకి చాలా ముఖ్యమైన విషయాలు బోధించాడు ఆ సారాంశమే గరుడ పురాణ గ్రంథం. ఈ పురాణం మానవ జీవితాలకు వెలుగునిస్తుంది. ప్రశాంతత, నిజాయితీ, స్వచ్ఛమైన జీవితానికి అవసరమైన అనేక అద్భుతమైన విషయాల గురించి గరుడ పురాణం చెబుతుంది. పుట్టుక, మరణం, పాపం, పుణ్యం, కర్మలకు సంబంధించి చాలా అంశాలు గరుడ పురాణంలో ఉంటాయి.

గరుడ పురాణం ప్రకారం మానవులు తమ కర్మలను బట్టి ఫలాలను అనుభవిస్తారు. అంటే కర్మల ఆధారంగానే మానవులు స్వర్గ నరకాలను పొందుతారు. మంచి పని చేసే వారు తమ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. కానీ, కొన్నిసార్లు మంచి విషయాలు కూడా సమస్యలను తెచ్చిపెడతాయి. ఇది కాదనలేని వాస్తవం. కాబట్టి సరైన సమయంలో పుణ్యం లేదా మంచి పనులు చేయడం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెబుతోంది. సరైన సమయంలో సత్కార్యాలు చేయకపోతే బాధలు, అనర్థాలు కలుగుతాయని గరుడ పురాణం చెబుతోంది. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రపరచడం:
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అలాగే తప్పనిసరిగా చేయవల్సిన పనుల్లో ఒకటి. లక్ష్మీ దేవి శుభ్రమైన ఇంట్లో నివసిస్తుందని భక్తుల నమ్మకం. ఎందుకంటే సంపదలకు దేవత అయిన లక్ష్మీ పరిశుభ్రతను ఇష్టపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
పరిశుభ్రత, ప్రేమ, నమ్మకం లేని ఇంట్లో లక్ష్మీ దేవి నివసించదు. అయితే సాయంత్రం పూట అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటిని ఊడ్చడం మంచిది కాదని గరుడ పురాణం చెబుతోంది. అందుకే సూర్యాస్తమయానికి ముందే ఇంటిని ఊడ్చడం, తుడవడం పాతు శుభ్రపరిచే పనులు పూర్తి చేయాలని పెద్దలు చెబుతుంటారు.
అలా కాకుండా సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని, ఇంట్లో ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో ఆర్థిక సంక్షోభం తలెత్తుతాయని గరుడ పురాణం చెబుతోంది. సూర్యకాంతి ఉన్నప్పుడే ఇంటిని శుభ్రం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

సూర్యాస్తమయం తర్వాత వీటిని దానం చేయొద్దు:
దాతృత్వం అనేది గొప్ప కార్యం. పుణ్య కార్యంగా పరిగణించబడుతోంది. నిరుపేదలకు, నిరాశ్రయులకు దానం చేయడం ద్వారా నేరుగా ఆ దైవానికే సేవ చేసిన పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. యథాశక్తి దానానికి భగవంతుని అనుగ్రహం కూడా ఉంటుంది. కానీ,ధర్మం విషయంలోనూ కొన్ని నియమాలున్నాయని గమనించాలి.
సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం శ్రేయస్కరం కాదని నమ్ముతారు. సాయంత్రం పూట దాన రూపంలో ఎవరికీ పసుపు ఇవ్వకూడదని పెద్దలు చెబుతారు. పెరుగు, పచ్చళ్లు, పాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉప్పు వంటి కొన్ని వస్తువులను సూర్యాస్తమయం తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ దానం చేయకూడదని గరుడ పురాణం చెబుతోంది.
సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను దానం చేస్తే పుణ్యం కంటే పాపం ఎక్కువగా వస్తుందని, ఇంట్లో సమస్యలు మొదలవుతాయిని, ప్రశాంతత కోల్పోవాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
వీటితో పాటు మురికి బట్టలు, చిరిగిన బట్టలు, పాత లేదా చిరిగిన బూట్లు కూడా దానం చేయకూడదు.

సూర్యాస్తమయం తర్వాత తులసికి నీరు పోయొద్దు:
హిందూమతంలో తులసిని లక్ష్మీదేవితో పోలుస్తారు. అందుకే తులసిని అతి పవిత్రంగా చూస్తారు. చాలా మంది హిందువుల ఇళ్లల్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసికి నీరు పోయడం ద్వారానే రోజు ప్రారంభిస్తారు. తులసిని పూజించడం వల్ల విష్ణువు, లక్ష్మీ దేవతల అనుగ్రహం లభిస్తుందని, ఇంటికి ఆనందం, శ్రేయస్సు చేకూరుతుందని విశ్వసిస్తారు. అయితే మత విశ్వాసాల ప్రకారం, ఆదివారం, ఏకాదశి, సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కకు నీరు పెట్టకూడదు. ఈ నియమాన్ని పాటించకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని గరుడ పురాణం చెబుతోంది.



Click it and Unblock the Notifications