For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈద్ మిలాద్-ఉన్-నబీ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

సాధారణంగా ఇస్లాం సంప్రదాయం ప్రకారం పుట్టినరోజు, పెళ్లి రోజు వేడుకలను జరుపుకోరు. కానీ మన భారతదేశంలో మాత్రం మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును ఆయనను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ముస్లింలందరూ ప్రార్థనలు నిర్వహిస్తారు.

Eid Milad-Un-Nabi 2020: Date, significance of Mawlid or Prophet Mohammed’s birthday

అనంత కరుణామయుడు అల్లాహ్ విశ్వ శాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను ఎంపిక చేసుకున్నట్లు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఖురాన్ అనే గ్రంథంలో ఈ వివరాలు చెప్పబడ్డాయి.

Eid Milad-Un-Nabi 2020: Date, significance of Mawlid or Prophet Mohammed’s birthday

ఈ విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లిముల కోసం కాదని సకల కోటి జీవరాశులకు, ఈ విశ్వం మొత్తానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని అందులో వివరించారు.

Eid Milad-Un-Nabi 2020: Date, significance of Mawlid or Prophet Mohammed’s birthday

విశ్వ ప్రవక్త తాను స్వతహాగా ఏదీ తెలియజేయరు. తాను అల్లాహ్ ద్వారా ఏది వినేవారో అదే తెలిపేవారు. దీనికి సాక్ష్యంగా అనేక దైవ గ్రంథాల్లో పొందుపరిచారు. మరో విశేషమేమిటంటే.. మహమ్మద్ ప్రవక్త(ఉమ్మి) ఏమీ చదువుకోలేదట. తను కేవలం అల్లాహ్ తహ లా మహిమ పవిత్ర ఖురాన్ ను దైవవాణి రూపంలో ప్రవక్త అవతరింపజేసి తన శక్తిని సర్వ మానవాళికి తెలియజేశారు. అందుకే ఆ ప్రవక్త ప్రవచనాలు అందరి జీవనశైలికి హితోపదేశాలు అయ్యాయి. ఈ సందర్భంగా ఈ పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

ప్రవక్త జన్మించడంతో..

ప్రవక్త జన్మించడంతో..

మహమ్మద్ ప్రవక్త జన్మించిన కారణంగా.. ఆయన జ్ణాపకార్థం ఈద్-ఎ-మిలాద్-ఉన్ పండుగను జరుపుకుంటారు. 570లో రబీ-ఉల్-అవ్వాల్ పన్నెండో రోజు ప్రవక్త మక్కాలో జన్మించాడని నమ్ముతారు.

మరోపేరు..

మరోపేరు..

మిలాద్-ఉన్-నబీ అనే పండుగను మావ్లిద్ అన్-నబీ పండుగ అని కూడా పిలుస్తారు. అరబిక్ భాషలో ‘మావ్లిద్' అంటే జన్మనివ్వడం లేదా బిడ్డ పుట్టడం అని అర్థం. ఇస్లామిక్ క్యాలెండర్లో మూడో నెల అయిన రబీ అల్-అవ్వాల్ నెలలో ఈ పండుగను జరుపుకుంటారు.

చరిత్రను పరిశీలిస్తే..

చరిత్రను పరిశీలిస్తే..

మహమ్మద్ ప్రవక్త తుది శ్వాస విడిచిన తర్వాత, అతని ఇంటిని తన వారసులలో ఒకరు ప్రార్థన ఇంటిగా మార్చారు. 11వ శతాబ్దంలో ఈద్-ఎ-మిలాద్ వేడుకలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని మొట్టమొదటిసారిగా ఈజిప్టు దేశంలో అధికారిక పండుగగా జరుపుకున్నారు.

12వ శతాబ్దంలో..

12వ శతాబ్దంలో..

12వ శతాబ్దంలో, ఈజ్టిపుతో పాటు సిరియా, మొరాకో, టర్కీ మరియు స్పెయిన్ వంటి దేశాల్లో కూడా ఈద్-ఎ-మిలాద్ ఉత్సవాలు జరుపుకోవడం ప్రారంభించారు. పురాతన కాలంలో, ఆధునిక కాలంతో పోలిస్తే, ఈ పండుగను చాలా భిన్నంగా జరుపుకుంటున్నారు.

ప్రార్థనలు చేస్తూ..

ప్రార్థనలు చేస్తూ..

ఈజిప్టులో ప్రముఖ వంశం చేత 11వ శతాబ్దంలో ప్రారంభించబడిన ఈ వేడుకలు, అనంతరం ప్రజలు ప్రార్థనలు చేయడం ద్వారా ఈరోజును ప్రారంభించారు. దీని తర్వాత పాలక వంశానికి చెందిన ప్రజలు ప్రసంగాలు ఇచ్చారు. పవిత్ర ఖురాన్ నుండి శ్లోకాలు పఠించారు.

నమాజ్ తర్వాత..

నమాజ్ తర్వాత..

ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా విశ్వం మొత్తం శాంతి, సహనంతో తలతూగాలని ప్రతి ఒక్క ముస్లిం ప్రార్థిస్తారు. మిలాద్-ఉన్-నబీ వేడుకల సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల్లోని రాత్రి వేళల్లో విద్యుత్ అలంకరణలతో ప్రార్థనా మందిరాలను అలంకరించి.. ఆధ్యాత్మిక సభలు, నాతియాకలామ్(ప్రవక్త కీర్తనలు) నిర్వహిస్తారు.

అన్నదాన కార్యక్రమాలు..

అన్నదాన కార్యక్రమాలు..

ఈ పండుగ సమయంలో వేకువ జామున నమజా తర్వాత అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కడప వంటి జిల్లాలతో పాటు చాలా చోట్ల ఈ పండుగ సమయంలో ముస్లింలతో పాటు హిందువులు కూడా ఎంతో పవిత్రంగా బార్మి అన్నదానాలు నిర్వహించడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. ఇది మత సామరస్యానికి ప్రతీకగా చెప్పొచ్చు.

FAQ's
  • మిలాద్ ఉన్ నబి రోజున ఎవరి జయంతి వేడుకలను జరుపుకుంటారు?

    మిలాద్ ఉన్ నబి పండుగను ముస్లిములందరూ మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు. ఈ ఏడాది 2021లో అక్టోబర్ 18 మరియు 19వ తేదీల్లో ఈ వేడుకలను జరుపుకోనున్నారు.

English summary

Eid Milad-Un-Nabi 2020: Date, significance of Mawlid or Prophet Mohammed’s birthday

Here we talkin about eid milad-un-nabi 2020 : date, significance of malwid or prophet mohammed's birthday. Read on
Desktop Bottom Promotion