Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
అరచేతిలో ఈ రేఖలు ఉంటే మీరు అత్యంత అదృష్టవంతులవుతారట...!
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అదృష్టవంతులు కావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే అలాంటి అవకాశం అందరికీ రాదు. కేవలం అతి కొద్ది మందికే అదృష్టం దక్కుతుంది. ఇలాంటి వారే తాము అనుకున్నది కచ్చితంగా సాధిస్తారు.

అయితే కొంత మంది పుట్టుకతోనే అదృష్టంతోనే పుడతారు. అయితే మరి కొంతమంది తమ చేతిలో ఉండే గీతలను బట్టి తమకు అదృష్టం లభిస్తుందని నమ్ముతారు. మీ చేతిలోని గీతలు సరైన స్థానంలో మీరు అదృష్టవంతులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే అలాంటి రేఖలు అరచేతిలో అతి కొద్ది మందికే ఉంటాయి. సో అరచేతిలో ఏయే గీతలుంటే మీకు లక్కీ కలసి వస్తుందో తెలుసుకోండి...

మణికట్టు గీత..
హస్త సాముద్రిక శాస్త్రం ద్వారా మీ అరచేతిలో మణికట్టు నుండి ప్రారంభమై ఎలాంటి జాడలు లేకుండా శని గ్రహం వరకు వెళితే మీకు చాలా లక్కీ కలిసి వస్తుంది. మీ అరచేతిలో ఈ గీతలు ఉంటే మీరు మీ జీవితంలో ఉన్నత దశలకు వెళతారు. అంతేకాదు అతి తక్కువ వ్యవధిలోనే మీరు మీ జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. అలాగే మీకు అకస్మిక సంపద పెరుగుదల, సంకల్ప శక్తి వంటివి లభిస్తాయి. అలాగే శత్రువులతో కూడా స్నేహం వంటి అనేక ప్రయోజనాలు వస్తాయి.

శని నుండి గురు వరకు..
శని గ్రహం లేదా చూపుడు వేలు నుండి గీత ప్రారంభమై గురు గ్రహం వద్దకు వెళితే.. ఇలాంటి వారికి వంశపారంపర్య ఆస్తులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి వారు వారి జీవిత భాగస్వామి నుండి కూడా గొప్ప అదృష్టాన్ని పొందుతారు. అంతేకాదు వీరు జీవితంలో ఉన్నట్టుండి అదృష్టం వంటి చోటకు చేరిపోతారు.

రెండు లైన్లు..
మీ అరచేతిలో పై ఫొటోలో చూపినట్లుగా సమాంతరంగా రెండు రేఖలు ఉంటే లేదా ఒకే పొడవు మరియు ఒకే రంగు యొక్క రెండు రూల్ లైన్లు ఒకే సమయంలో ఉంటే.. మీరు రెండు చేతుల ఆదాయాన్ని అర్జిస్తారు. అలాగే మీరు అన్ని పనులలో విజయం సాధిస్తారు. ఇది మీ అదృష్టానికి సంకేతం అని చెప్పొచ్చు. అంతేకాదు ఈ రేఖలు మీ విజయానికి కూడా సంకేతంగా ఉంటాయి.

ఉంగరపు వేలికి లంబంగా..
మీ అరచేతిలో ఉంగరపు వేలికి 90 డిగ్రీల కోణంలో అంటే లంబంగా ఉండే ఓ రేఖ ఉంటే.. మీరు శక్తివంతంగా మారతారు. అయితే మీకు ప్రముఖుల నుండి తక్కువ సహాయం లభిస్తుంది. అయితే మీకు ప్రజల నిరంతర సహాయంతో మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

త్రిభుజం ఏర్పడితే...
మీ అరచేతిలో ప్రధాన రేఖ నుండి ఒక రేఖ వెళ్లి సౌర రేఖతో కలిసి ఒక త్రిభుజం వంటిది ఏర్పరచుకుంటే, మీరు చాలా స్మార్ట్ అని అర్థం. ఇవి అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. వీరి తెలివితేటలతో వీరు అధిక సంపదను పొందగలుగుతారు.

ఎలాంటి అవరోధాలు లేకుండా...
ఇది మీ అరచేతిలోని పునాది నుండి మొదలై ఎలాంటి అవరోధాలు లేకుండా పైకి వెళ్తుంది. ఇలాంటి ప్రముఖులుగా మరియు ధనవంతులుగా జన్మించి ఉంటారు. వీరు కోసం ఎన్నో అవకాశాలు ఎదురుచూస్తుంటాయి. వీరి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు.



Click it and Unblock the Notifications
