Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
Five Planets Transit in September 2021:5 గ్రహాల రవాణాతో ఈ రాశుల వారు జర భద్రం!
2021 సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో ఐదు గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2021 సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో ఐదు గ్రహాలు తమ స్థానం నుండి మరో స్థానంలోకి మారనున్నాయి. ఈ సమయంలో అస్థిర పరిస్థితులు ఏర్పడనున్నాయి.

ఆగస్టు మాసంలో కూడా ఇలాగే కొన్ని గ్రహాలు రవాణా చేశాయి. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కొంత ప్రభావం పడింది. సెప్టెంబర్ మాసంలోనూ గ్రహాల ప్రయాణం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు.. మరికొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి.

సెప్టెంబర్ మాసంలో ముందుగా ఐదో తేదీన శుక్రుడు తన సొంత రాశి అయిన తుల రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ మరుసటి రోజే అంటే సెప్టెంబర్ 6వ తేదీన అంగారకుడు కన్యరాశిలోకి సంచారం చేయనున్నాడు. అనంతరం గురుడు మకర రాశిలోకి రవాణా చేయనున్నాడు.

సెప్టెంబర్ 16న సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశించనుండగా.. చివరగా సెప్టెంబర్ 22వ తేదీన బుధుడు తులా రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. సెప్టెంబర్ 27 నుండి వ్యతిరేక దిశలో రవాణా చేయనున్నాడు. అంటే తిరోగమన ప్రయాణం అన్నమాట. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఈ ఐదు గ్రహాల రవాణా వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కలగనున్నాయట. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి మరి...
సెప్టెంబర్ నెలలో 5 గ్రహాల రవాణా వల్ల, ఈ రాశుల వారికి ప్రయోజనాలు

మిధున రాశి..
సెప్టెంబర్ మాసంలో ఐదు గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ నెలలో ఈ రాశిలో నాలుగో స్థానంలో అంగారకుడు, సూర్యుడు రెండు గ్రహాలు సంచారం చేయనున్నారు. ఈ రెండు గ్రహాలు జ్వాలతత్వం కలిగి ఉంటాయి. ఈ కారణంగా ఈ రాశి వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ కుటుంబసభ్యులలో ఒకరికి ఆరోగ్యం క్షీణించొచ్చు. దీని వల్ల మీ పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇలాంటి సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి.

సింహ రాశి..
సెప్టెంబర్ మాసంలో రెండో స్థానం నుండి సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇలాంటి సమయంలో ఉద్యోగులకు సానుకూల ఫలితాలొస్తాయి. అయితే మీరు మాటలను జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ నెల ప్రారంభంలో మూడో స్థానంలో శుక్రుడు సంచారం కారణంగా మీరు అనేక రంగాల్లో విజయం పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు పెద్ద సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. వ్యాపారులకు ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీకు ఈ సమయంలో ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు చేపట్టిన పనులు, పెండింగులో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసేస్తారు.

కన్య రాశి..
సెప్టెంబర్ నెలలో సూర్యుడు, అంగారకుడు రవాణా కారణంగా ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. మీకు ఈ మాసంలో అనేక సమస్యలు ఉంటాయి. ఈ కాలంలో మీరు విద్య, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. సూర్యుడు, అంగారకుడి మార్పు వల్ల మీకు కోపం పెరగొచ్చు. ఈ సమయంలో మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మరోవైపు ఈ నెలలో మీకు మొత్తం మంచి ఫలితాలొస్తాయి.

మకర రాశి..
ఈ నెలలో ఈ రాశి నుండి గురుడు తిరోగమనంలో ప్రయాణించనున్నాడు. దీని వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ రాశి నుండి తొమ్మిదో స్థానంలో సూర్యుడు, గురుడు స్థానం కారణంగా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈ కాలంలో మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వైవాహిక జీవితంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది.

మీన రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు, అంగారకుడు ఏడో పాదంలో ఉండటం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని వల్ల మీకు కొంత మంచిగా ఉంటుంది. దీంతో పాటు 11 స్థానంలో గురుడు తిరోగమన కదలిక లాభం కంటే ఎక్కువ ప్రమాదం కలిగిస్తుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2021 సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో ఐదు గ్రహాలు తమ స్థానం నుండి మరో స్థానంలోకి మారనున్నాయి. ఆగస్టు మాసంలో కూడా ఇలాగే కొన్ని గ్రహాలు రవాణా చేశాయి. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కొంత ప్రభావం పడింది. సెప్టెంబర్ మాసంలోనూ గ్రహాల ప్రయాణం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు.. మరికొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. అయితే సెప్టెంబర్ నెలలో గ్రహాల రవాణా వల్ల ఈ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి మరి...



Click it and Unblock the Notifications
