Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
తులసిని ఎప్పుడు తాకాలి, ఆకులు ఎప్పుడు తుంచాలి, నీళ్లు ఎప్పుడు పోయాలో తెలుసా?
తులసి అందరి ఇంట్లో ఉన్నప్పటికీ తులసి మొక్కను ఎప్పుడు తాకాలి, ఎప్పుడు వాటి ఆకులు తుంచాలి, నీళ్లు ఎప్పుడు పోయాలో చాలా మందికి తెలియక పొరపాట్లు చేస్తుంటారు. తులసి మొక్కను తాకేటప్పుడు, తుంచేటప్పుడు, నీళ్లు పట్టేటప్పుడు ఎలాంటి
హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తులసి మొక్కను లక్ష్మీదేవికి ప్రతిరూపంలా చూస్తారు. ఆధ్యాత్మికంగానూ తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని, దాని వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతారు. దాదాపు ప్రతి హిందూ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది.

తులసి అందరి ఇంట్లో ఉన్నప్పటికీ తులసి మొక్కను ఎప్పుడు తాకాలి, ఎప్పుడు వాటి ఆకులు తుంచాలి, నీళ్లు ఎప్పుడు పోయాలో చాలా మందికి తెలియక పొరపాట్లు చేస్తుంటారు. తులసి మొక్కను తాకేటప్పుడు, తుంచేటప్పుడు, నీళ్లు పట్టేటప్పుడు ఎలాంటి నియమాలో పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి మొక్కను తాకేటప్పుడు పాటించాల్సిన నియమాలు:
* తులసిని ఎప్పుడు పడితే తాకకూడదు.
* తులసిని మొక్కను సూర్యాస్తమయం తర్వాత తాకకూడదు.
* మురికి చేతులతో తులసిని తాకకూడదు.
* స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు.
* ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తులసి మొక్కను తీసుకురాకూడదు.
* గురువారం నాడు మాత్రమే తులసి మొక్కను తీసుకురావాలి.
* తులసి మొక్కను ప్లాస్టిక్ కుండీలో నాటడం మంచిది కాదు.

తులసి మొక్కకు ఎప్పుడు నీరు పోయాలి:
* తులసికి నీళ్లతో పాటు పచ్చి పాలను కూడా సమర్పించవచ్చు.
* తులసి మొక్కకు పాలు సమర్పించడం వల్ల దురదృష్టం తొలగిపోతుందని నమ్ముతారు.
* ఆదివారాలు తులసికి నీరు సమర్పించకూడదు.
* ఉదయం వేళ తులసికి నీరు సమర్పించాలి.
* మొదట సూర్యుడికి నీరు సమర్పించి ఆపై తులసికి నీటిని సమర్పించాలి.
* తెల్లవారుజామున స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీరు సమర్పించాలి.
* సాయంత్రం వేళ నీళ్లు సమర్పించాలనుకుంటే కాళ్లు, చేతులూ కడుక్కుని శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే నీరు సమర్పించాలి.

తులసి ఆకులు ఎప్పుడు తుంచాలి:
* తులసి ఆకులను ఎప్పుడూ గోరుతో తుంచకూడదు.
* స్నానం చేయకుండా తులసిని తాకవద్దు.
* సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో తులసి ఆకులను తుంచకూడదు.
* శివుడికి, గణేశుడికి తులసి ఆకులను సమర్పించకూడదు.
* విష్ణువుకు తులసి ఆకులు సమర్పిస్తే మంచి జరుగుతుంది.
* అమావాస్య, ద్వాదశి, చతుర్దశి నాడు తులసి ఆకులను తుంచకూడదు.
* ఆదివారం నాడు పొరపాటున కూడా తులసి ఆకులను తుంచకూడదు.
* సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తాకకూడదు.
* తులసి ఆకులను దేవునికి సమర్పిస్తే వాటిని 11 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచకూడదు.

తులసి మొక్కను ఎక్కడ నాటాలి:
- వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కలను ఎప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో మాత్రమే నాటాలి. ఈ దిక్కుల్లో దేవతలు కొలువై ఉంటారని చెబుతారు.
- ఇంటి బాల్కనీ లేదా కిటికీలో తులసి మొక్కలను నాటవచ్చు.
- తులసి మొక్కను పొరపాటున కూడా ఇంటికి దక్షిణ దిశలో నాటకూడదు.
- తులసి మొక్కలను ఇంటి ప్రవేశ ద్వారా వద్ద ఉంచకూడదు.
- చెత్తను ఉంచే ప్రదేశంలో తులసి మొక్కను ఉంచకూడదు.
- చెప్పులు ఉంచే ప్రదేశంలో ఉంచకూడదు.



Click it and Unblock the Notifications
