Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
Garuda Purana: లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే ఉదయం లేవగానే ఈ పనులు చేయండి
ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. బతకడానికైనా డబ్బు కావాల్సిందే. అయితే డబ్బు సంపాదించాలన్నా, సంపద సృష్టించాలన్న లక్ష్మీ దేవి కటాక్షం ఉండాల్సిందే. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వ్యక్తుల ఇంట్లో ఐశ్వర్యం కొలువై ఉంటుంది.

గరుడ పురాణం ప్రకారం లక్ష్మీ దేవి కటాక్షం పొందాలన్నా, సంపద సృష్టించాలన్నా, ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలన్నా రోజూ ఉదయం నిద్ర లేవగానే కొన్ని కర్మలు చేయాలి. ఆయా పనులను రోజూ చేయడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి రావడంతో లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది. ఇంట్లోని సమస్యలు పరిష్కారమవుతాయి. రోగాలు తొలగిపోతాయి. దోషాలు నివారించబడతాయి. గరుడ పురాణం ప్రకారం రోజూ ఉదయం ఏమేం పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. దైవ, పితృదేవతల ఆరాధన
రోజూ ఉదయం పూజ చేసే ఇంట్లో ఎలాంటి సమస్య ఉండదు. గరుడ పురాణంలో ప్రతి వ్యక్తి పితృ దేవతలను పూజించాలి. క్రమం తప్పకుండా పితృదేవతలను పూజించడం వల్ల ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే దేవారాధన వల్ల కూడా మంచి జరుగుతుంది. దీని వల్ల ఇంట్లోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తెల్లవారుజామున నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత పితృ దేవతలు, దేవుళ్లను పూజించాలని గరుడ పురాణం చెబుతోంది.

2. స్నానం తర్వాతే వంట చేయాలి
గరుడ పురాణం ప్రకారం వంట గది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతోంది. అందుకే వంట గదిలోకి ఉదయం స్నానం చేసిన తర్వాతే ఆహారం సిద్ధం చేయాలి. దానితో వంట చేసే ముందు వంటగదిలో ఏది వండినా పూజ గదిలో దేవుళ్లకు సమర్పించాలి. దీంతో లక్ష్మీ దేవి ఆశీస్సులు మీ ఇంట్లో ఎప్పుడూ ఉంటాయని గరుడ పురాణం చెబుతోంది.

3. గ్రంథ పఠనం
ఇంట్లో దేవుళ్లను పూజించే సమయంలో మంత్ర పఠనం, గ్రంథ పఠనం చేయాలి. మత గ్రంథాలను చదవడం ద్వారా మంచి జరుగుతుంది. మనసు ఆధ్యాత్మికతో నిండిపోతుంది. ఇలా చేస్తే జీవితంలో సానుకూలతను తెస్తుంది. ఆదివారం మినహా ప్రతి రోజూ మత గ్రంథాలను పఠించాలి.

4. ఆవు, కుక్కకు మేత పెట్టాలి
ఇంట్లో ఆహారం వండితే మొదటి ముద్దను ఆవుకు, చివరి ముద్దను కుక్కకు పెట్టాలని గరుడ పురాణం చెబుతోంది. రోటీలు చేసుకుంటే మొదటి రోటీని ఆవుకు, చివరి రోటీని కుక్కకు తినిపించాలి. దీని వల్ల ఇంట్లో లక్ష్మీతో పాటు శనిదేవుని అనుగ్రహం కూడా ఉంటుంది.
గరుడ పురాణంలోని సూచన ప్రకారం మనం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పనులను తెల్లవారుజామున చేయడం వల్ల మన కష్టాలన్నీ నయమవుతాయని గరుడ పురాణం చెబుతోంది. లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలంటే ఈ పనులను ఉదయం చేయాలని గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది. ఈ పనులతో కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. పేదవారికి, ఆకలితో అలమటించే వారికి తినడానికి ఏదైనా అందివ్వాలి.



Click it and Unblock the Notifications