Latest Updates
-
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
మిధున రాశి 2020 ఫలితాలు : ఈ ఏడాది మీకు ఎలా ఉందంటే...
జనవరి నెల చివరిలో సూర్యుడు మరియు శని గ్రహాలు వల్ల మీకు ప్రయోజనాలు చేకూరుతాయి అప్పటివరకు మీకు వేచి ఉండాలి. కుటుంబం మరియు కార్యాలయంలో కూడా సంబంధాల మధ్య సమన్వయం అవసరం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిధున రాశి వారు ఈ సంవత్సరం వారి కెరీర్ ను ముందుగానే ఓ అంచనా వేయగలరు. ఈ రాశి వారిలో కొందరు నౌకాయానం చేయనున్నారు. ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మంచి కాలమే. కెరీర్ లో ఉన్నత స్థాయిని అధిరోహించాలంటే మీరు అదనపు పని చేయాలి. అలాగే నిబద్ధతతో కూడా పని చేయాలి. ప్రేమలో ఉండే సమస్యలన్నీ ఈ సంవత్సరం పరిష్కరించబడతాయి.

ప్రేమ విషయంలో మీరు ఈ సంవత్సరం మరింత భావోద్వేగానికి లోనవుతారు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు మీరు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అద్భుతాలేమీ కనబడటం లేదు. మొత్తంగా సాధారణంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సానుకూలంగా ఉండండి. ఎందుకంటే జులై నెల తర్వాత పరిస్థితులు మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీ శక్తి స్థాయిలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇంకా నెలల వారీగా మీ జాతకం ఎలా ఉంది? మీరు ఏయే జాగ్రత్తలు పాటించాలి? మీకు ఏయే పరిస్థితులలో అవకాశాలు సానుకూలంగా కనిపించనున్నాయో తెలుసుకోండి...

మొదటి నెల..
జనవరి నెల చివరిలో సూర్యుడు మరియు శని గ్రహాలు వల్ల మీకు ప్రయోజనాలు చేకూరుతాయి అప్పటివరకు మీకు వేచి ఉండాలి. కుటుంబం మరియు కార్యాలయంలో కూడా సంబంధాల మధ్య సమన్వయం అవసరం. ఈ నెలలో మొత్తంగా శుభప్రదంగా ఉంటుంది. మేధోపరమైన ఆశీర్వాదం కూడా పొందుతారు. విద్యార్థులకు ఈ నెల చాలా గొప్పది.

రెండో నెల..
ఈ నెలలో మిధున రాశిలోని యువతకు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. సూర్యుడు, నెఫ్ట్యూన్ మరియు ఫ్లూటోలు ప్రయోజనకరమైన స్థానాల్లో ఉన్నారు. ఈ నెల మీకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ నెల మధ్యలో కొంత కఠినమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది మిమ్మల్ని అసహనానికి గురి చేస్తుంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

మూడో నెల..
ఈ నెలలో సూర్యుడు మరియు బుధుడు, ఫ్లూటోల వల్ల మీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీ భావోద్వేగాలను మరియు భావాలను నియంత్రణలో ఉంచుకోండి. ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు, లేదా ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.

నాలుగో నెల..
ఈ రాశి వారికి ఈ నెల ప్రశాంతంగా ఉంటుంది. ఈ నెల మధ్యలో శుక్రుడు మీ రాశి గ్రహంలోకి ప్రవేశించినప్పుడు మీపై కొంత ప్రభావం ఉంటుంది. ఈ నెల అంతా మీ ప్రేమ, భావోద్వేగాలు మరియు అనుభూతులపై నియంత్రణలో ఉండండి.

ఐదో నెల..
ఈ రాశి వారికి శుక్రుడు, బుధుడు, మార్స్ ల వల్ల మీకు ఆనందం మరియు కోరికలు ఉంటాయి. అయితే జాగ్రత్తగా ఉండండి. మీరు మీ భావోద్వేగాలను సానుకూల భావనకు తీసుకురావాలి. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఉంటాయి.

ఆరో నెల..
ఈ రాశి వారిలో ఎక్కువ మందికి పుట్టినరోజు వేడుకలు జరుపుకునే అవకాశాలు ఉంటాయి. సూర్యుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఈ నెలలో మీ శక్తి స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ విశ్వాస స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది.

ఏడో నెల..
ఈ రాశి వారికి ఈ నెల గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. దీని వల్ల పరిస్థితులు చాలా వ్యతిరేకంగా మారతాయి. ఆధ్యాత్మికంగా ఈ నెల మంచిగా ఉంటుంది. దీని వల్ల మీ విశ్వాసం పెరుగుతుంది. శుక్రుడు మరియు బుధుడు సూర్యుడికి ప్రయోజనకరంగా ఉండటం వల్ల మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి.

ఎనిమిదో నెల..
ఈ రాశి వారికి ఈ నెల యురేనస్ గ్రహం ప్రభావం వల్ల పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. దీని వల్ల మీకు పరిస్థితులు గందరగోళంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే సానుకూలంగా ఉండండి. మీ ప్రయత్నాలే మీకు విజయం చేకూరుస్తాయి. మీ వృత్తి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి.

తొమ్మిదో నెల..
ఈ నెలలో మీరు చాలా జాగ్త్రతగా ఉండాలి. మీరు ఎప్పటికీ మొండిగా ఉండకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల మీ ఆందోళన తగ్గుతుంది. ఆత్మ పరిశీలనకు ఈ నెల మంచి సమయం.

పదో నెల..
ఈ నెలలో మీ రాశి గ్రహానికి వ్యతిరేకంగా బృహస్పతి ఉంది. బృహస్పతి యురేనస్‌తో సానుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మీ చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీరు బాగా ప్రేరేపించబడతారు. ఈ నెలలో మీరు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పెళ్లి సంబంధాలకు మరియు నిశ్చితార్థానికి కూడా మంచి సమయం ఉంటుంది.

పదకొండో నెల..
ఈ నెలలో బృహస్పతి ప్లూటో యొక్క ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి ఈ నెలలో మీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అయితే మీ ప్రత్యర్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉంటే పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారతాయి. మీరు తిరిగి విశ్వాసం పొందడానికి కూడా పరిస్థితులు అనకూలిస్తాయి.

చివరి నెల..
చివరి నెలలో బుధుడు మరియు సూర్యుడు మీ రాశిపై ప్రభావం చూపనున్నాయి. దీని వల్ల మీకు ఈ నెలలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు అవసరమైన సమయంలో తప్పకుండా సెలవులు తీసుకోండి.



Click it and Unblock the Notifications
