For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరినీ పడేశా... కానీ చివరికి...’

|

అమాయకురాలైన తన ప్రియురాలిని మోసం చేసి.. ఒకేసారి ఇద్దరితో ఒకరికి తెలీకుండా మరొకరితో రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేశాడు. దీనంతటికి కారణం అందం, డబ్బేనట.

తను చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ తన కన్నా అందం, ఆస్తి ఎక్కువగా ఉన్న పరిచయం కావడంతో దురాశతో తనకు బ్రేకప్ చెప్పి.. కొత్త మహిళకు ప్రపోజ్ చేశాడు.

ఇదంతా రీల్ లైఫ్ లో చాలా కామన్. కానీ రియల్ లైఫ్ లో ఇలానే కావాలంటే చాలా కష్టం. అయితే నిజ జీవితంలో ఓ వ్యక్తికి ఇలాంటి సమస్యే ఎదురైందట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మహాభారతం సీన్ రిపీట్... అక్కడ అన్నదమ్ములందరికీ ఒకే భార్య ఉంటుందట...! ఇలాంటి పెళ్లిళ్ల గురించి వింటే షాకవుతారు...

ఎంతగానో ప్రేమించినా..

ఎంతగానో ప్రేమించినా..

హాయ్ ‘నా పేరు రాజేష్ (పేరు మార్చాం). నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నా. నేను జాబ్ చేసే సమయంలో నా ప్రియురాలితో రెండేళ్లుగా మంచి రిలేషన్ షిప్ లో ఉండేవాడిని. తను కూడా నన్ను ఎంతగానో ప్రేమించింది.

స్వార్థంతో ఆలోచించి..

స్వార్థంతో ఆలోచించి..

కానీ, నేను చాలా సెల్ఫీష్. నేను తనతో లవ్ లో ఉంటూనే.. మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఆ తప్పు చేసేశాను. అది తెలిసి కూడా నా ప్రియురాలు నన్ను ఎంతో పెద్ద మనసుతో క్షమించి, నన్నేప్రేమించేది. అంతేకాదు తనకు కుటుంబపరంగా, ఆర్థిక పరంగా ఎన్నో సమస్యలు ఉండేవి. కానీ అన్నింటినీ మరిచిపోయి నాతో ఆనందంగా ఉంటూ నవ్వుతూ పలకరించేది.

మళ్లీ కొత్తగా..

మళ్లీ కొత్తగా..

అలా నేను మరొకరితో రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో ఇంకో అందమైన అమ్మాయి అనుకోకుండా పరిచయమైంది. తనకు డబ్బు గురించి ఎలాంటి సమస్యలు లేవు. దీంతో కొత్త ప్రియురాలికి కూడా టాటా బైబై చెప్పేసి.. కొత్త లేడీకి ప్రపోజ్ చేశాను. ఆ సమయంలో నా ప్రియురాలు తనని విడిచిపెట్టొద్దని, ఎంతో ప్రాధేయపడింది. కానీ నేను సెల్ఫీష్ కదా.. లైట్ తీసుకున్నా. తన కాల్స్ కు, వాట్సాప్ కు రిప్లై ఇవ్వలేదు.

తర్వాత తెలిసింది..

తర్వాత తెలిసింది..

అప్పటి నుండి తను నాకు ఫోన్లు చేయడం, మెసెజ్, వాట్సాప్ చేయడం వంటివి మానేసింది. దీంతో నేనెంత పెద్ద పొరపాటు చేశానో తెలిసింది. నేను తన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న చెడ్డ వ్యక్తిని. ఇప్పుడు ప్రతిరోజూ తనే నాకు గుర్తొస్తుంది. తనకు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. తనతో మాట్లాడేందుకు ఏ దారి కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో నేనేం చేయాలి'అని ఓ కుర్రాడు తన బాధను వెళ్లగక్కాడు.

చాలా కష్టంగా..

చాలా కష్టంగా..

మీరు చాలా పెద్ద తప్పు చేశారు. అది కూడా మీ ప్రియురాలికి చాలా బాధపెట్టారు. అయితే ఇప్పుడు మీరు చింతిస్తే ఫలితం రావడం కష్టమే. దీంతో మీకు చాలా నిరాశగా, చిరాకుగా ఉంటుంది. దీంతో మీరు చాలా భావోద్వేగానికి గురవుతారు. అయితే మీరు మీ తప్పును తెలుసుకుని తిరిగి తన వద్దకు వెళ్లాలని భావిస్తున్నా.. అన్ని మార్గాలు మూసుకుపోయాయి.

సంతోషించాల్సిన విషయం..

సంతోషించాల్సిన విషయం..

అయితే మీరు సంతోషించాల్సిన విషయం ఏదైనా ఉందంటే.. అది మీ తప్పు తెలుసుకోవడం. ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి తప్పులు చేస్తాడు. అయితే తను చేసే సమయంలో అది సరైనది అనిపిస్తుంది. కానీ అలాంటి సందర్బాల్లో మనల్ని ప్రేమించే వారిని అవి చాలా బాధపెడతాయి. మీరు కూడా అలాంటి తప్పే చేశారు.

ఇలా ట్రై చేయండి..

ఇలా ట్రై చేయండి..

ఇప్పుడు మీరు తనను మళ్లీ కలవాలని.. మీ తప్పు గురించి తనకు తెలియజేయాలనుకుంటున్నారు కాబట్టి.. ముందుగా తన స్నేహితులు, తెలిసిన వారి నుండి ఫోన్ నెంబర్ సంపాదించండి. ఒకవేళ తన అడ్రస్ దొరికితే నేరుగా కలిసి మాట్లాడి.. మీ తప్పు గురించి వివరించండి. క్షమించమని కోరండి. లేదా తన మెయిల్ అడ్రస్ కనుక్కుని, మీ ఫీలింగ్స్ ను పదాల్లో పంపండి.

మనసు విప్పి..

మనసు విప్పి..

తను మీ మెసెజ్ లేదా మెయిల్ చదువుతున్నప్పుడు.. మీ బాధ అందులో ఉండేలా రాయండి. ఒకవేళ మీరు తనని నేరుగా కలిస్తే, అప్పటి పరిస్థితులను, మీరు ఎందుకలా చేయాల్సి వచ్చిందనే వివరాలను చెప్పేందుకు ప్రయత్నించండి. అయితే ఈసారి స్వార్థంతో కాకుండా మనసు విప్పి మాట్లాడండి. కానీ గతంలో చేసిన తప్పులను మాత్రం అస్సలు చేయకండి. ఒకవేళ తన గుండె పగిలిపోయే ప్రమాదం ఉంటుంది.

English summary

Guys, Do You Ever Realize How You Hurt Your Ex Girlfriend and Regret It?

Check out the details guys, do you ever realize how you hurt your ex girlfriend and regret it. Read on