Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Happy Buddha Purnima 2023:మనకు ప్రేరణనిచ్చే బుద్ధుని సందేశాలను మీ సన్నిహితులతో షేర్ చేసుకోండి...
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున బుద్ధుని పుట్టినరోజును జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున బౌద్ధమతాన్ని అనుసరించే వారు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేడుకలను జరుపుకుంటారు.

ఇదే రోజున బుద్ధ పూర్ణిమను కూడా జరుపుకుంటారు. లార్డ్ బుద్ధ బౌద్ధ మతాన్ని స్థాపించాడు. రాజ కుటుంబంలో జన్మించిన బుద్ధుని చిన్ననాటి పేరు సిద్ధార్థ గౌతమ్. తను యువరాజు కావాల్సిన సమయంలో, తన రాజ్యాన్ని వదిలిపెట్టి జ్ణానం కోసం అన్వేషించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ప్రేమ, ధర్మం, అహింసకు సంబంధించిన సందేశాలను ప్రజలకు తెలియజేశాడు.

ఆయన తన తొలి ఉపన్యాసం సారనాథ్ లో ఇచ్చారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అప్పటి నుండి ఇప్పటివరకూ బౌద్ధమతాన్ని అనుసరించే వారు గౌతమ బుద్ధుని బోధనలను, ఆలోచనలను అనుసరిస్తున్నారు. అలాంటి బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ 2022 సంవత్సరంలో మే 16వ తేదీ అంటే బుధవారం ఈరోజున వచ్చింది. ఈ సందర్భంగా మనందరిలో ప్రేరణ నింపే ఉత్తేజకరమైన సందేశాలను మీ మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులతో షేర్ చేసుకోండి.

మన లోపల శత్రువు..
‘మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు'

కేవలం ప్రేమ ఒక్కటే..
‘ద్వేషాన్ని దూరం చేసేది కేవలం ప్రేమ ఒక్కటే. కాబట్టి అందరితో ప్రేమగా ఉండేందుకు ప్రయత్నించండి'

నీవు హాని చేయకు..
‘నీ బాధకు కారణం ఏదైనా కావొచ్చు. కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం నీవు హాని చేయకు'

ఒక్క మంచి మాట..
‘వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా.. శాంతిని.. కాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట విన్న చాలు'

మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు..
‘తనను తాను వశపరచుకోగల మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. వారి విజయాలను కూడా ఓటములుగా ఎవ్వరు మార్చలేరు.

మనసుకు మాత్రం తప్పు చేసిన ప్రతిసారీ మరణం
‘మన శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే వస్తుంది. కానీ మన మనసుకు మాత్రం తప్పు చేసిన ప్రతిసారీ మరణం సంభవిస్తుంది.'

ఈ రెండూ జీవితంలో పెద్ద ప్రమాదాలే..
‘ఎవ్వరూ చూడటం లేదని తప్పు చేయకు. అందరూ చేస్తున్నారని అప్పు చేయకు.. ఈ రెండూ జీవితంలో పెద్ద ప్రమాదాలే అని గుర్తుంచుకో'

వర్తమాన కాలంపై మనసును కేంద్రీకరించాలి
‘గతాన్ని తలచుకోవడం మానేయాలి. భవిష్యత్తు గురించి కలల కనడం పక్కనపెట్టి.. ప్రస్తుత వర్తమాన కాలంపై మనసును కేంద్రీకరించాలి'



Click it and Unblock the Notifications
