Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
Happy Eid Mubarak 2021 Wishes :ఈద్ ఉల్ ఫితుర్ విషెస్, కోట్స్ మీ సన్నిహితులకు పంపండిలా...
ఈద్ ఉల్ పితుర్ పండుగ సందర్భంగా మీకిష్టమైన వారందరికీ ఈద్ ముబారక్ చెప్పండిలా..
ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ సంపూర్ణంగా అవతరించిన మాసమే రంజాన్ మాసం. ఈ మాసాన్ని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసాన్ని దైవమాసంగా నమ్ముతారు.

అందుకే నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఈ నెలలో పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. నెలవంక కనిపించడంతో ప్రారంభమైన ఈ పండుగ.. మళ్లీ నెల తర్వాత కనిపించే బాలచంద్రుడితో ముగుస్తుంది.

ఈ నేపథ్యంలో మరికొద్ది గంటల్లో ముస్లిం సోదరీసోదరుల ఉపవాస దీక్షలు (జూన్ 13 లేదా జూన్ 14) ముగియనున్నాయి. ఈ పవిత్ర రంజాన్ మాసం చివరి రోజున ఈద్ ఉల్ ఫితుర్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ సందర్భంగా అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.

ఈ ఏడాది కూడా ఇళ్ల వద్ద ఉంటూనే వేడుకలు జరుపుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు, సన్నిహితులకు ఈద్ ఉల్ ఫితుర్ శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని పవిత్రమైన సందేశాలు, వాట్సాప్, ఫేస్ బుక్ మెసెజెస్, పవిత్రమైన వాక్యాలను మీకు తెలియజేస్తున్నాం. వీటిలో మీకు నచ్చిన వాటికి ఎంపిక చేసుకోండి.. మీకు నచ్చినవారితో వీటిని షేర్ చేసుకోండి...

ఖురాన్ ప్రకారం..
ఖురాన్ ప్రకారం, ఎవరైతే పని వారితో ఏదైనా పని చేయించుకున్నప్పుడు, వారి చెమట చుక్కలు ఆరకముందే వారి కష్టార్జితం చెల్లించాలి
హ్యాపీ ఈద్-ఉల్-ఫితుర్

అల్లాహ్ అనుగ్రహం..
అల్లాహ్ అనుగ్రహం.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అల్లాహ్ అనుగ్రహం అనునిత్యం ఉండాలని, మీ జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ..
ఈద్-ఉల్-ఫితుర్ శుభాకాంక్షలు

భక్తి విశ్వాసాలుంటే..
‘సరైన మార్గంలో నడుస్తూ, అల్లాహ్ పై భక్తి, విశ్వాసాలు కలవారికి వారి కర్మానుసారం మంచి, పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది'
అందరికీ ఈద్-ఉల్-పితుర్ శుభాకాంక్షలు

సోదర భావాన్ని చాటేందుకు..
ఐదుసార్లు నమాజ్ ఎందుకంటే.. ఇస్లాం ప్రకారం, రాజు, రైతు, ఉన్నవారు, లేనివారు, జాతి, వర్గ భేదాలు లేకుండా, అందరూ ఒకరికొకరు చేయి చేయి కలిపి, పాదం కూడా కలిపి ప్రతిరోజూ ఐదుసార్లు విశ్వమానవ సోదర భావాన్ని చాటేందుకు నమాజ్ చేస్తారు.
హ్యాపీ ఈద్-ఉల్-ఫితుర్

ఆకలి బాధలు తెలుసుకునేందుకు..
ప్రతి ఒక్కరూ పేదలు పడే ఆకలి బాధలు తెలుసుకోవడమే రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల ఉద్దేశ్యం. అంతేగానీ ఆకలి బాధలతో మనిషి జీవించాలనేది ఇస్లాం ఉద్దేశ్యం కాదు.
అందరికీ ఈద్ ముబారక్

రంజాన్ మాసంలో..
చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలన్నీ కలిసి వచ్చి ఇలా చెప్పారు. ‘రంజాన్ మాసంలో ఉపవాసముండి ప్రార్థనలు చేస్తే, మీ కోరికలు నెరవేరుతాయి'
హ్యాపీ ఈద్-ఉల్-ఫితుర్

జీవితం ఆనందంగా..
దేవుడు మీకు సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాడు. మీ జీవితం ఆనందంగా ఉండిపోనివ్వండి. దుఃఖంపై మీ నీడ దరిచేరనీయకండి. అల్లా ఆశీర్వాదంతో మీరు చిరునవ్వుతో జీవితాన్ని కొనసాగించాలి.
ఈద్-ఉల్-ఫితుర్ శుభాకాంక్షలు

పొరపాట్లను మన్నించాలి..
‘ఓ అల్లాహ్..! రంజాన్ మాసంలోని ఈ శుక్రవారం మేము ఉపవాసాలుండి చేసే ఆరాధనలను ఆలకించి, మేము చేసిన తప్పులను క్షమించాలని' కోరుకుంటూ...
అందరికీ ఈద్-ఉల్-ఫితుర్ శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications
