Latest Updates
-
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం!
Happy Global Parents Day 2021: మీ పేరేంట్స్ కు స్పెషల్ విషెస్ చెప్పండిలా...
తల్లిదండ్రుల దినోత్సవం 2021 సందర్భంగా మీ పేరేంట్స్ పై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. మీ స్టేటస్ లను షేర్ చేయండి.
ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి తల్లిదండ్రుల నుండే వచ్చారు. అందుకే ప్రతి ఒక్కరికీ తల్లిదండ్రులకన్నా ముఖ్యమైన వారు ఎవ్వరూ ఉండరు. మనందరికీ జీవితాన్ని ఇచ్చి.. వారి జీవితాలను త్యాగం చేసి, మనల్ని ప్రేమించడమే వారి పని. అనునిత్యం మన గురించి ఆలోచిస్తూ.. మన భవిష్యత్తు గురించి ఆరాటపడే వారే తల్లిదండ్రులు.

అలాంటి తల్లిదండ్రుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన జరుపుకుంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులకు ప్రత్యేకమైన రోజు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చేసే ప్రతి పనికి మరియు వారి నిస్వార్థ నిబద్ధతకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. పిల్లలను పెంచడానికి మరియు రక్షించడానికి ఒక కుటుంబం యొక్క ప్రాధమిక బాధ్యతను గుర్తించడానికి ఈరోజును 2012 లో UN జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.

కుటుంబ వాతావరణంలో తమ పిల్లలపై ప్రేమ, ఆనందం మరియు అవగాహన పెంపొందించుకోవడం మరియు వారి వ్యక్తిత్వం యొక్క అన్ని రూపాల అభివృద్ధి కోసం తల్లిదండ్రుల కర్తవ్యం. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించడానికి, వారి త్యాగాలు, ప్రయత్నాలను కూడా గౌరవించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన గ్లోబల్ పేరేంట్స్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా గ్లోబల్ పేరేంట్స్ డే కోట్స్, విషెస్, ఇమెజెస్, వాట్సాప్ స్టేటస్ ల జాబితాను మీ కోసం తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చిన వాటికి సెలెక్ట్ చేసుకుని.. మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి. వారిని ఆనందంగా ఉంచండి.. వారితో కలిసి మీరు సంతోషంగా జీవించండి..

తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ..
‘ప్రపంచంలోనే అత్యంత పూజ్యమైన తల్లిదండ్రులకు నేను జన్మించడం నా పూర్వ జన్మ అదృష్టంగా భావిస్తున్నాను. నా ప్రపంచాన్ని మరింత అందంగా మార్చిన తల్లిదండ్రులకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను'
హ్యాపీ గ్లోబల్ పేరేంట్స్ డే

మీ ఇద్దరి వల్లే..
‘ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే.. అందుకు కారణం. మీ ఇద్దరి వల్లే. కాబట్టి నా జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటాను'
హ్యాపీ గ్లోబల్ పేరేంట్స్ డే

బాల్యాన్ని అద్భుతంగా..
‘మీ ఇద్దరి పట్ల నాకు ప్రేమ, గౌరవం ఉంది. నా బాల్యాన్ని అద్భుతంగా మరియు నా జీవితాన్ని మరింత అద్భుతంగా చేసిన మీ ఇద్దరికి ధన్యవాదాలు'
హ్యాపీ గ్లోబల్ పేరేంట్స్ డే

గురువు మాదిరిగానే..
‘నా ప్రియమైన తల్లిదండ్రులు అచ్చం గురువు మాదిరిగానే నాకు మార్గనిర్దేశం చేసినందుకు మరియు నిజమైన స్నేహితుల్లా ప్రతి విషయంలోనూ మద్దతు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు'
హ్యాపీ గ్లోబల్ పేరేంట్స్ డే

పేరేంట్స్ గా మారే వరకు..
‘మనం తల్లిదండ్రులు అయ్యే వరకు తల్లిదండ్రుల ప్రేమ అనేదే మనకు తెలియదు'
హ్యాపీ గ్లోబల్ పేరేంట్స్ డే

తల్లిదండ్రులు మాత్రమే..
‘ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వారు ఉన్నారంటే అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులను ప్రేమించే ప్రతి ఒక్కరికీ హ్యాపీ గ్లోబల్ పేరేంట్స్ డే.

రుణం తీర్చుకోలేం..
పిల్లల భవిష్యత్తు కోసం తమ సుఖ సంతోషాలను వదులుకుని, వారి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దే వారే తల్లిదండ్రులు. అలాంటి వారికి మనం ఏమి ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేం.
హ్యాపీ గ్లోబల్ పేరేంట్స్ డే

ప్రేమ పెరుగుతూనే..
ఎన్ని తరాలు మారినా.. ఎన్ని కాలాలు మారినా.. మారని మాధుర్యం ఒకే ఒక్కటి. అదే తల్లిదండ్రుల ప్రేమ. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా.. వారి మమకారం కూడా అంతే పెరుగుతుంది.
హ్యాపీ గ్లోబల్ పేరేంట్స్ డే.

మన గురించే..
దేవుడు అన్ని చోట్ల ఉండలేక.. తల్లిదండ్రులను బహుమతిగా మనకు ఇచ్చాడు. అనుక్షణం మన గురించి, మన శ్రేయస్సు గురించి ఆలోచించే తల్లిదండ్రులకు హ్యాపీ గ్లోబల్ పేరేంట్స్ డే.

ఆందోళన లేకుండా..
మనకు ఎన్నడూ ఆందోళన దరి చేరనీయకుండా కంటికి రెప్పలా కాపాడే తల్లిదండ్రులకు హ్యాపీ గ్లోబల్ పేరేంట్స్ డే.



Click it and Unblock the Notifications