Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Happy Holi 2023: మీ ప్రియమైన వారు మెచ్చుకునేలా కలర్ ఫుల్ సందేశాలను షేర్ చేసుకోండి...
హోలీ సందర్భంగా మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలను, కోట్స్ ను పంపండి.

తెలుగు మాసాలలో చివరిదైనా ఫాల్గుణ మాసంలో వచ్చే చివరి పండుగనే హోలీ. రంగు రంగుల ఈ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అన్ని పండుగలు దాదాపు ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటాం. అయితే కలర్ ఫుల్ హోలీని మాత్రం రెండురోజు పాటు జరుపుకుంటాం.

ఈ పండుగ మార్చి నెలలో 8వ తేదీన బుదవారం జరుపుకుంటారు. మార్చి 7, 8 రెండురోజుల పాటు జరుపుకునే ఈ పండుగ సందర్భంగా హిందూ, ముస్లిం, క్రిస్టయన్ల అన్న మత భేదాలు లేకుండా చిన్న పిల్లాడి నుండి పెద్ద వారికి వరకు వీధుల్లోకి వచ్చి రంగుల మయంగా మార్చేస్తారు. దీని వల్ల జీవితం మొత్తం రంగుల మయంగా ఉంటుందని చాలా మంది ఆశిస్తారు.

ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజున 'కామ దహనం'... పౌర్ణమి రోజు హోలీకా పూర్ణిమ (కాముని పున్నమి) పేరుతో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, బెజవాడ వంటి నగరాల్లో మన తెలుగు వారు ఈ హోలీ సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకుంటారు.

ఈ సందర్భంగా మీరు మీ ప్రియమైన వారిని, బంధు మిత్రులను కలవలేకపోతే చింతించాల్సిన పని లేదు. ప్రస్తుత్తం సోషల్ మీడియా వల్ల అలాంటి వాటికి తాత్కాలికంగా అడ్డుకట్ట వేయొచ్చు. కాబట్టి హోలీ సందర్భంగా మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలను, కోట్స్ ను పంపండి. అలాంటి సందేశాలు, విషేస్, కోట్స్ జాబితాను మీ కోసం తీసుకొచ్చాం. వాటిలో మీకు నచ్చిన వాటిని షేర్ చేసుకోండి....

వసంతాల కేళి..
వసంత గమనంలో వస్తుంది రంగుల హోలీ..
నింపుతుంది మీ జీవితాలలో ఆనందాల కేళీ...
అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు..

సలక్షణమైన పండుగ..
సప్త వర్ణాల శోభితమైన పండుగ.. సలక్షణమైన పండుగ..
వసంత శోభతో పరిడవిల్లే నూతన వేడుక.. రంగుల కేళీ.. హళీ పండుగ సందర్భంగా
మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.

చెడుపై మంచి విజయం..
చెడుపై మంచి విజయం సాధించన సందర్భంగా జరుపుకునే పండుగ హోలీ..
సుఖం.. దు:ఖం.. సంతోషం, విచారం అన్ని కలిసిన రంగులే ఈ హోలీ..
రాగద్వేషాలకు అతీీతంగా అందరినీ ఒక్కచోటకు చేర్చే పండుగే ఈ హోలీ..
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు హోలీ శుభాకాంక్షలు.

రెయిన్ బో రంగులు..
హరివిల్లులోని రంగులన్నీ.. మురళీ నాదములోని మధువు కలిసి వచ్చి ఒక చోట చేరి హోలీ నాడు రంజింపచేయాలని కోరుతూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

రంగులు కావు..
హోలీ పండుగ రోజున ఒకరినొకరు ఆప్యాయంగా చల్లుకునేది రంగులు కాదు..
అనురాగం, ఆప్యాయతలతో కలిసిన పన్నీటి రంగుల జల్లులు..
మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ హోలీ..

అన్ని రంగులు కలిస్తేనే..
అన్ని రంగులు కలిస్తేనే ఈ నేచర్ కు అందం.. అన్ని మతాలు కలిసి ఉంటేనే ఈ దేశానికి ఆనందం..
మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు..

రంగుల పండుగ
రంగుల పండుగ వచ్చింది.. అందరిలో ఆనందాన్ని తెచ్చి పెట్టింది.
మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

సుఖసంతోషాలకు ప్రతీకే హోలీ
సుఖం, దుఃఖం, సంతోషాలకు ప్రతీకే హోలీ పండుగ.
మీకు మీ కుటుంబసభ్యులకు హోలీ శుభాక్షాంకలు



Click it and Unblock the Notifications