Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Womens Day 2023 Wishes : ‘ఆమె‘ హృదయాన్ని హత్తుకునే మెసెజ్ లను, కోట్స్ ను షేర్ చేసుకోండి...
స్త్రీ అనేది ప్రకృతి ధర్మం వంటిది. మనం ప్రేమించినప్పుడు తను తిరస్కరిస్తుంది. మనం వ్యతిరేకించినప్పుడు తను ప్రేమిస్తుంది.
'ఆమె' అమ్మగా అందరి ఆలన పాలన చేస్తుంది. సోదరిగా తోడు ఉంటుంది. అర్థాంగిగా బాగోగులు చూస్తుంది. దాసిలా నిత్యం పని చేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప స్త్రీ మూర్తికి మనసారా అభినందనలు చెప్పుకునే సమయం సందర్భం ఏదైనా ఉందంటే అది. మార్చి 8వ తేదీ. ఎందుకంటే ఆరోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

ఈ సందర్భంగా వారి శక్తి, సామర్థ్యాలు గురించి ప్రముఖులు ఏమన్నారో మీరు చూడండి.. అంతేకాదు 'ఆమె' హృదయాన్ని హత్తుకునేలా శుభాకాంక్షలు చెప్పండి. వీలైతే ఆమెకు ఓ అందమైన బహుమతి ఇచ్చి ఆమెను ఆశ్చర్యపరచండి. ఆమె సంతోషం కోసం 'ఆమె' మనసు పులకించేలా కొన్ని సందేశాలు.. వాట్సాప్ స్టేటస్, సోషల్ మీడియా సైట్లలో షేర్ చేసుకోండి...

పురుషుడి విజయం వెనుక..
ప్రతి పురుషుడి విజయం వెనుక కచ్చితంగా ఓ మహిళ ఉంటుంది
- గ్రాంట్ గ్లిక్ మాన్

స్త్రీ ప్రకృతి ధర్మమే..
స్త్రీ అనేది ప్రకృతి ధర్మం వంటిది. మనం ప్రేమించినప్పుడు తను తిరస్కరిస్తుంది. మనం వ్యతిరేకించినప్పుడు తను ప్రేమిస్తుంది.
- సెర్వాంటస్

వివేకంగా ప్రవర్తిస్తారు..
అవివేక స్త్రీలు కూడా పురుషుల పట్ల వివేకంగా ప్రవర్తిస్తారు
- తేదోర్ రీక్

స్త్రీలు తెలివైన వారు..
పురుషుల కంటే స్త్రీలు చాలా తెలివైన వారు. ఎందుకంటే తెలిసింది తక్కువైనా అర్థం చేసుకునేది ఎక్కువ.
- జేమ్స్ స్టెఫెన్స్

అందానికి, రమ్యతకు తేడా..
అందానికి, రమ్యతకు చాలా తేడా ఉంది. నేను గుర్తిస్తే అందమైనది. కానీ ఆమె గుర్తిస్తే అది రమ్యమైనది.
- జాన్ రస్కేన్

స్త్రీ లేకపోతే జననం లేదు...
‘‘స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే ఈ సృష్టిలో ఏ జీవం ఉండదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు‘‘..
కంటి పాపలా పిల్లలను కాపాడుకునే మాతృమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...

అమ్మను పూజించు..
‘‘అమ్మను పూజించు.. భార్యను ప్రేమించు.. సోదరిని దీవించు.. అన్నింటికంటే ముందుగా మహిళలను గౌరవించు‘‘- హ్యాపీ ఉమెన్స్ డే

సమస్తం నీవే...
‘‘కార్యేసు దాసి.. కరణేశు మంత్రి.. భోజేసు మాత.. ఇలా ఈ విశ్వం మొత్తం నీ తర్వాతే ఎవరైనా. ఓ ప్రియమైన మాతృమూర్తి.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు వేల వేల వందనాలు...

స్త్రీ ఎక్కడ ఉంటే...
‘‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా‘‘ - స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

స్త్రీ మూర్తికి పాదాభివందనం..
కళ్లు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం.. బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందరినీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి పాదాభివందనం..
ముందుగా బోల్డ్ స్కై తెలుగు తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు...



Click it and Unblock the Notifications