Latest Updates
-
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.!
Happy Navratri 2022: దేవీ నవరాత్రుల విషెస్ ను మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి...
నవరాత్రి విషెస్, ఫొటోలు, వాట్సాప్, ఫేస్బుక్ మెసెజ్ లను మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి.
హిందువులు పరమపవిత్రమైన రోజులుగా భావించే దేవీ శరన్నవరాత్రులు సెప్టెంబర్ 16 నుండి ప్రారంభం అవుతాయి. ఇవి తొమ్మిదిరోజుల పాటు అంటే అక్టోబర్ 5వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఈ సమయంలో అమ్మవారిని 9 రూపాల్లో కొలుస్తారు.

పురాణాల ప్రకారం ఈ తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గా మాత వెంటాడి సంహరించారని చాలా మంది భక్తులు నమ్ముతారు. అందుకే మనం ఈ వేడుకలను జరుపుకుంటున్నాం. పదో రోజున రాక్షసులపై విజయం సాధించినందుకు మనం విజయ దశమి పండుగ జరుపుకుంటామని పండితులు చెబుతున్నారు.

మరో కథనం ప్రకారం.. దశ రాత్రుల సమయాన్నే దసరా అని పిలుస్తారు. దశ సంఖ్య గల రావణుడిని శ్రీరాముడు అంతమొందించిన రోజు ఇదేనని, అందుకే ఈరోజును దసరా అని పిలుస్తారని మరికొందరు చెబుతున్నారు. విజయానికి కారణమైన రోజు దశమి. అందుకే విజయ దశమిగా జరుపుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ దసరా అనేది ప్రతి ఒక్కటి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. మరి ఈ పండుగ సమయంలో మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు, సన్నిహితులకు శుభాకాంక్షలు చెప్పకపోతే ఎలా? అందుకే కింద ఉన్న జాబితాలో మీకు నచ్చిన వాటిని షేర్ చేసి శుభాకాంక్షలను చెప్పేయండి.

కొత్త ఉత్సాహం..
ఈ నవరాత్రులు మీకు కొత్త విజయాన్ని, ఆనందాన్ని మరియు ప్రేమ, ఉత్సాహాన్ని తీసుకురావాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు..

కష్టాల నుండి..
కరోనా, లాక్ డౌన్ కష్టాల నుండి ఆ దేవీ మిమ్మల్ని గట్టెక్కించాలని,
మీ ఆశయాలు అత్యంత త్వరగా నెరవేరాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులు, మిత్రులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు..

చెడుపై మంచి విజయం..
చెడుపై మంచి విజయం సాధించినందుకు.. కరోనాపై కూడా విజయం సాధించేందుకు... దుర్గా దేవి ఆశీర్వాదం లభిస్తుందని.. అమ్మవారి ఆరాధనతో అంతా మంచే జరుగుతుందని కోరుతూ..
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు..

అన్ని పనుల్లో శుభం..
మన కోరికలన్నీ తీర్చి.. మన ప్రయత్నాలన్నింటిలో విజయం కలగాలని..
అన్ని పనుల్లో శుభం కలగాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు..

ఎప్పటికీ సంతోషం..
ఈ దేవీ నవరాత్రుల అమ్మవారిని ఆరాధించడం వల్ల..
మీ జీవితంలో ఆనందమైన వెలుగులు రావాలని..
మీ జీవితం ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు..

అమ్మవారు కడుపులో పెట్టుకుని కాపాడాలని..
అమ్మవారు తన బిడ్డల కడుపు నింపే అన్నపూర్ణ దేవి..
లాలించే లలితాత్రిపుర సుందరీ, భ్రమరాంబిక..
తప్పు చేసిన వారిని దండించే దుర్గమ్మ..
ఈ అమ్మల గన్న అమ్మ మీ అందరినీ తన ఒడిలో పెట్టుకుని కాపాడాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు..

అంతా మంచే జరగాలని..
మీ జీవితంలో కూడా చెడుపై మంచి విజయం సాధించాలని..
కరోనా మహమ్మారికి విరుగుడు వెంటనే రావాలని..
మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు..

మనకు శక్తి, సామర్థ్యాలు లభించాలని..
మనందరం ఎప్పుడూ సరైన దారిలో నడిచేందుకు..
మనకు శక్తి, సామర్థ్యాలు అందాలని కోరుకుంటూ...
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ నవరాత్రి

సుఖ శాంతులతో..
మనందరం దుర్గామాత ఆశీస్సులతో ఎల్లప్పుడూ..
సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు..

ప్రతికూలతలన్నీ తొలగిపోవాలని..
నవరాత్రుల సందర్భంగా మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలన్నీ..
తొలగిపోయి మీలో, మీతో ఉన్న మంచి మాత్రమే గెలవాలని కోరుకుంటూ...
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు..
ముందుగా మీకు, మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ బోల్డ్ స్కై తెలుగు తరపున దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications