Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
Raksha Bandhan Wishes : ఈ రాఖీ పండక్కి మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పండిలా...
ఈ రాఖీ పండుగ సమయంలో మీ బంధు మిత్రుల మనసును హత్తుకునే విషెస్ ను ఇలా తెలియజేయండి.
రాఖీ పండుగ వస్తోందంటే చాలు అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ప్రపంచంలో ఎక్కడున్నా.. ఏమి చేస్తున్నా.. ఎలా ఉన్నా సరే వారి మధ్య ప్రేమ పొంగి పొర్లుతుంది. అంతకు ముందు మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా.. ఎన్ని అలకలున్నా సరే ఒక్కరోజు కూడా తమ తోడబుట్టిన వారిని చూడకుండా ఉండలేరు చాలా మంది.

కొందరేమో పెళ్లిళ్లు జరిగి.. మరికొందరు ఉద్యోగాల పేరుతో ఇప్పటికే దూరమై ఉంటారు.

ప్రస్తుతం కరోనా కారణంగా కొన్ని నెలల పాటు ఒకరినొకరు చూసుకోకపోయినా తిరిగి కలుసుకున్నప్పుడు మాత్రం అదే ఆప్యాయత.. అనురాగం వారి మధ్య కనిపిస్తుంది.

అలాంటి వారందరూ తమ బంధాల గురించి వేడుకగా జరుపుకోవడానికి మన పూర్వీకుల నుండి వస్తున్న ప్రత్యేకమైన రోజు రక్షా బంధన్. ఈరోజున మీరు మనస్ఫూర్తిగా మీ సోదరులకు ప్రేమను చాటడానికి ఇదో మంచి అవకాశం.

ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ యుగంలో జీవిస్తున్నారు. చాలా మంది చేతిలో స్మార్ట్ ఫోన్లు.. స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటున్నాయి. కాబట్టి మీ ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయత, అనురాగాన్ని పంచే అన్నదమ్ముల ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి రాఖీ పౌర్ణమి పండుగ నిజంగా ఎంతో ప్రత్యేకమైన పర్వదినమే.

ఈ సందర్భంగా మీరు రాఖీ కట్టడంతో పాటు ఈ అద్భుతమైన సందేశాలను, సూక్తులను, వాట్సాప్ స్టేటస్ వారికి పంపి.. మీ అన్నదమ్ములతో మీకు ఉన్న బంధాన్ని సెలబ్రేట్ చేసుకోండి....

చెక్కు చెదరని బంధమే..
‘‘అన్నాచెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల మధ్య ఆప్యాయత ఎన్నేళ్లయినా చెక్కు చెదరకుండా ఉండే బంధమే రక్షా బంధన్''
మీకు మీ కుటుంబసభ్యులు, మీ బంధుమిత్రులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

అన్నంటే..
‘‘అమ్మలోని ‘అ' పదం.. నాన్నలోని ‘నా' పదం కలిపితేనే ‘అన్న'
అన్నైనా.. తమ్ముడైనా నీకు అందివ్వగలిగేది ఆనందమే''
మీకు మీ కుటుంబసభ్యులు, మీ బంధుమిత్రులందరికీ హ్యాపీ రక్షా బంధన్

సోదరీమణులందరికీ రక్షగా..
‘‘గులాబీకి ముళ్లు రక్ష.. చేపకి నీరు రక్ష.. పుట్టిన బిడ్డకు తల్లి రక్ష.. నా అక్క చెల్లెళ్లందరికీ నేను రక్ష''గా ఉంటానని హామీ ఇస్తూ సోదరీమణులందరికీ హ్యాపీ రక్షాబంధన్..

ఆప్యాయతకు నిలువెత్తు రూపమే..
‘‘చిరునవ్వుకు చిరునామా.. మంచి మమతకు మారురూపం... ఆప్యాయతకు నిలువెత్తు రూపమే రక్షాబంధన్''
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..

ఎప్పటికీ నాతోనే..
‘‘నేను ఏమి చేస్తే మంచిగా ఉంటానో.. నా సోదరులకు బాగా తెలుసు.. అందుకే వారు నాతో ఎప్పటికీ ఉంటారు''
మీకు మీ కుటుంబసభ్యులు, మీ బంధుమిత్రులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

నిత్యం కోరుకుంటున్నా..
‘‘ఆ దేవుడి దయ, ఆశీర్వాదం నీకు ఈరోజే కాదు.. ప్రతిరోజూ.. ప్రతి క్షణం నీకు అందాలని నేను నిత్యం కోరుకుంటున్నా.''
మీకు మీ కుటుంబసభ్యులు, మీ బంధుమిత్రులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

నువ్వు మాత్రమే నా కోసం..
‘మనం ఇద్దరం చిన్ననాటి నుండి పంచుకున్న ఆనందం, అనురాగం, నమ్మకం.. సంతోషం.. బాధలతో పాటు నువ్వు మాత్రమే నా కోసం ప్రత్యేకంగా తెచ్చే కానుకలు ఎంతో గొప్పవి'

సోదరీ సోదరుల మధ్య ప్రేమ..
‘చిన్నప్పుడు మనం చీటికి మాటికి పోట్లాడుకుంటూ ఉండే రోజులను తలచుకుంటే నాకు చాలా నవ్వొస్తుంది. కానీ మన మధ్య ఉన్న ప్రేమను మాత్రం ఎప్పుడూ మరచిపోలేం. ఎందుకంటే అది రోజురోజుకీ పెరుగుతూనే ఉంటుంది'

ఒకరు లేకపోతే మరొకరు..
‘‘అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముడి బంధం కొన్నిసార్లు పాము, ముంగిసలను తలపిస్తుంది. ఒకరంటే ఒకరు ఎంతో శత్రుత్వం ఉన్నట్లు భావిస్తారు. చాలా కోపంగా ఉంటారు. కానీ ఒకరు లేకపోతే మరొకరు ఉండరు''

స్నేహితుడి లాంటివాడు..
‘నాకు ఉన్న సోదరుడు స్నేహితుడి లాంటి వాడు. అలాంటి సోదరుడు ఎవ్వరికీ ఉండరు. అందుకే నేను చాలా లక్కీ అని నమ్ముతాను''
మీకు మీ కుటుంబసభ్యులు, మీ బంధుమిత్రులందరికీ హ్యాపీ రక్షా బంధన్



Click it and Unblock the Notifications
