Latest Updates
-
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.!
Happy Teachers Day 2024: Teacher's Day Wishes in Telugu: టీచర్ల గొప్పతనాన్ని తెలిపే బెస్ట్ కొటేషన్లు...!
Happy Teachers Day 2024: ఈ విశ్వంలో ఎన్ని వృత్తులు ఉన్నప్పటికీ.. గౌరవనీయమైన వృత్తిలో ఉంటూ ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకే మనం ప్రతి సంవత్సరం ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాం.
ఒక గురువుగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది, భారత రాష్ట్రపతిగా అత్యున్నత స్థానానికి చేరుకున్న డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ పుట్టినరోజున అంటే ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరుపుకుంటున్నాం.

ఈరోజున తమకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులను సత్కరిస్తూ.. వారిపై తమకు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంటారు. అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలో అడుగుపెట్టే పరిస్థితి లేదు. అయితే టీచర్స్ డే రోజున గురువు యొక్క విలువ చెప్పేందుకు మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంది. అందుకే కింద ఉన్న జాబితాలో మీకు నచ్చిన బెస్ట్ కొటేషన్లను సెలెక్ట్ చేసుకోండి. మీ ఫేవరేట్ టీచర్లతో షేర్ చేసుకోండి...

కరోనా వచ్చినా... లాక్ డౌన్ ఉన్నా..
ఆన్ లైన్ లో అయినా.. ఆఫ్ లైన్ లో అయినా..
విద్యార్థులకు విజ్ణానాన్ని పంచేవాడే గురువు...
హ్యాపీ టీచర్స్ డే...

కరోనా వంటి సందర్భాలలో
తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ..
విద్యార్థులకు వెలుగు పంచేవాడే నిజమైన గురువు..
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు...

ఓ విద్యార్థిలాగా నిరంతరం నేర్చుకుంటూ..
నిరంతరం విద్యార్థులకు నేర్పించి.. మంచి విద్యావంతులను తయారు చేసే గొప్ప వ్యక్తి టీచర్...
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..

విద్యార్థి జీవితాన్నిసరైన దారిలో పెట్టేది గురువు...
కొట్టినా.. తిట్టినా.. తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం ఒక్క టీచర్ కే..
హ్యాపీ టీచర్స్ డే...

ఒక ఉపాధ్యాయుని జీవితంలో కేవలం రెండే రంగులు..
అవి కూడా బ్లాక్ అండ్ వైట్ మాత్రమే..
కానీ ఆ రెండు రంగులతో విద్యార్థుల జీవితాలను కలర్ ఫుల్ గా మార్చేవారే గురువు...
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..

మార్చలేని గతం గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తు కోసం శ్రమించు...
హ్యాపీ టీచర్స్ డే

చీమను చూసి డిసిప్లేన్ నేర్చుకో..
భూమిని చూసి ఓర్పును నేర్చుకో..
చెట్టును చూసి ఎదగడం నేర్చుకో..
ఉపాధ్యాయుడిని చూసి సుగాణాలు నేర్చుకో..
హ్యాపీ టీచర్స్ డే

శిష్యుల ఎదుగుదలే గురు దక్షిణగా భావించే ఒకే ఒక్క వ్యక్తి ఉపాధ్యాయుడు...
హ్యాపీ టీచర్స్ డే

ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే.. దానికి ఆధారమైన దారం గురువు..
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

అందరికీ మీరు కేవలం టీచర్లే కావచ్చు..
కానీ మాకు మాత్రం మీరే హీరోలు.. మీరే మాకు ప్రేరణ..
హ్యాపీ టీచర్స్ డే...
బోల్డ్ స్కై తెలుగు తరపున అందరికీ ఉపాధ్యాయ శుభాకాంక్షలు...



Click it and Unblock the Notifications
