Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
Happy Varalakshmi Vratam :మీ సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు వరలక్ష్మీ వ్రతం విషెస్ చెప్పేయండిలా...
మీ సన్నిహితులు, శ్రేయోభిలాషులతో వరలక్ష్మీ వ్రతం విషెస్ షేర్ చేసుకోండి.
తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఐదో నెలలో వస్తుంది. ఆధ్యాత్మికంగా ఈ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో ప్రతిరోజూ ప్రత్యేకమే. అయితే శ్రావణ మాసానికి పరిపూర్ణత, పరిపక్వత కలిగేది వరలక్ష్మీ వ్రతంతోనే. శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు.

ఈ ఏడాది 2022లో ఆగస్టు 5వ తేదీన ఈ పండుగ వచ్చింది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా అత్తారింట్లో కొత్త కోడళ్లతో ఈ వ్రతాన్ని చేయిస్తూ ఉంటారు. మహాలక్ష్మీ అష్టలక్ష్ముల రూపంలో లోకంలోని మానవులందరి కోరికలు నెరవేరుస్తూ అందరినీ కాపాడుతుంది.

కానీ ఈ అష్టలక్ష్ములందరిలో వరలక్ష్మీకి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా లక్ష్మీల కంటే వరలక్ష్మీని పూజించడం వల్ల విశేష ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. ఈ సందర్భంగా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులతో వరలక్ష్మీ వ్రతం విషెస్, వాట్సాప్, ఫేస్ బుక్ స్టేటస్ ను షేర్ చేసుకోండి. అదెలా అని ఆలోచిస్తున్నారా? మీ కోసం వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షల జాబితా సిద్ధం చేశాం. వాటిలో మీకు నచ్చిన వాటిని షేర్ చేసుకోండి...

లక్ష్మీదేవి అనుగ్రహం..
మీ ఇంట వరలక్ష్మీ వ్రతం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని.. విజయవంతంగా అమ్మవారి అనుగ్రహం కలగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

లక్ష్మీదేవి ఆశీస్సులు..
పవిత్ర శ్రావణ మాసంలో..
వరలక్ష్మీ వ్రతం జరుపుకునే..
మహిళలు, వారి కుటుంబసభ్యులకు..
ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు లభించాలని కోరుతూ
మీకు, మీ కుటుంబసభ్యులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

ఐశ్యర్యాన్ని ఇచ్చే ఏకైక పండుగ..
తెలుగు మహిళలకు సౌభాగ్యాన్ని..
ఐశ్యర్యాన్ని ఇచ్చే ఏకైక పండుగ..
వరలక్ష్మీ వ్రతం.. ఈ సందర్భంగా అందరికీ
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

సకల సౌభాగ్యాలు కల్పించాలని..
ఆ వరలక్ష్మీ దేవి అనునిత్యం..
మిమ్మల్ని కాపాడాలని..
మీకు సకల సౌభాగ్యాలు కల్పించాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

లక్ష్మీదేవి దీవెనలు..
మీకు ఎల్లప్పుడూ అంతా మంచే జరగాలని,
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి దీవెనలు లభించాలని..
కోరుకుంటూ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

సిరిసంపదలు కలగాలని..
వరలక్ష్మీ దేవి మీకు సిరిసంపదలు
కలుగజేయాలని.. మీ కుటుంబం
ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వెలిగిపోవాలని..
కోరుకుంటూ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

కరోనా కాలంలో..
కరోనా వంటి కష్ట కాలంలోనూ మీ అందరికీ అంతా మంచే జరగాలని,
ఆ వరలక్ష్మీ దేవి ఆశీస్సులు మీకు తప్పక లభించాలని కోరుకుంటూ
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు...

వరలక్ష్మీ వ్రతం చేయడం వల్ల..
మీ ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలని
కోరుకుంటూ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..



Click it and Unblock the Notifications
