శుక్రవారం మీ రాశిఫలాలు (13-09-2019)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

జ్యోతిష్యం, సెప్టెంబర్ 13వ తేదీ

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, భాద్రపదమాసం, ద్వాదశి బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేషరాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేషరాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మీ మొండి వైఖరి మరియు మీ భాష కారణంగా మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారని భావిస్తారు. వివాదంలో భాగం కావడం మానుకోండి. మీ మొరటుతనాన్ని మీ కుటుంబం అంగీకరించదు. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. పనిలో పరిస్థితులు కఠినంగా ఉంటాయి. కార్పొరేట్ లో ఉన్న వారికి ఇది సమస్యగా ఉండే రోజు అవుతుంది. తల్లిండ్రడుల ఆరోగ్యం పెద్ద ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రియమైన వారు చిన్న సమస్యలకే కోపం తెచ్చుకోవచ్చు. ఫైనాన్షియల్ గా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఓవర్ పెండింగ్ అలవాటు మీ బడ్జెట్ కు భంగం కలిగిస్తుంది. నిద్రలేమి లేదా ఆందోళన నుండి బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

మీ కుటుంబంలో మీకు చాలా అనుకూలమైన వాతావరణం మిమ్మల్ని బలంగా మరియు పాజిటివ్ గా ఉంచుతుంది. మీరు ఆర్థిక పరంగా మీ దగ్గరి బంధువుకు సహాయం చేయాలని భావిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడటంతో మీకు హాయిగా అనిపిస్తుంది. ఒక ప్రశాంతమైన ప్రదేశానికి చిన్న యాత్ర మీకు మీ పిల్లలందరికీ అవసరం. అలాగే ఆశీర్వాదం కూడా. పిల్లలు విద్యలో ఒత్తిడితో ఉండి పోటీపడే రోజుగా ఉంటుంది. వ్యాపారవేత్తలు వారికి ఆసక్తి కలిగించే కొత్త వెంచర్ ను చూస్తారు. ఫైనాన్షియల్ గా అనుకూలమైన రోజు. మీ పాత బకాయిల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. కుటుంబంలో పరస్పరం సహకరించుకోవడం ప్రయోజకరంగా ఉంటుంది. ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మీ రోజును యోగాతో ప్రారంభించాలని నిర్ధారించుకోవాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నెంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10:45 వరకు

మిధున రాశి మే 21 - జూన్ 20

మిధున రాశి మే 21 - జూన్ 20

మీరు ఆర్థిక సంక్షోభం నుండి చివర్లో బయటపడతారు. ఇది పెట్టుబడికి ఉత్తమ సమయం. ఒక ముఖ్యమైన పని ప్రారంభానికి ముందు మీ తల్లిదండ్రుల సలహా తీసుకోండి. చట్టబద్ధమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వారు సుదీర్ఘ కాలం తర్వాత ఉపశమనం పొందుతారు. ఆరోగ్యంగా ఉండటానికి మీరు రోటీన్ పాటించే పద్ధతుల నుండి మరింత కష్టపడాలి. ప్రయాణించే ముందు జాగ్రత్త అవసరం. ప్రశాంతంగా మరియు ఓపికగా ఉండండి. కుటుంబంలో ఉన్న పని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ జీవిత భాగస్వామి కలత చెందుతారు. మీరు అవసరానికి అనుగుణంగా వ్యవహరించాలి. మీరు చాలా అలసటతో ఉంటారు.

లక్కీ కలర్ : లేత ఆకుపచ్చ (లైట్ గ్రీన్)

లక్కీ నెంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

కర్కాటకరాశి జూన్ 21 - జూలై 22

కర్కాటకరాశి జూన్ 21 - జూలై 22

విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే విద్యలో బాగా రాణిస్తారు. మీ తల్లిదండ్రులు గర్వంగా భావిస్తారు. మీలో కొందరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని అనుకోవచ్చు. కుటుంబంతో విలువైన సమయాన్ని గడపడం వారికి చాలా అవసరం. మీ భాగస్వామి పూర్తి సహకారం కారణంగా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. కొత్త జంటకు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తాయి. మీ పనిలో వివాదాస్పదం ఏర్పడవచ్చు. ఎందుకంటే మీ తెలివైన వైఖరి ప్రజలను ఆకట్టుకుంటుంది. మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితాన్ని సమానం చేసుకోవడం నేర్చుకోవాలి. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. తోబుట్టువుతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడం వల్ల కుటుంబంలో అదృష్టాన్ని తెస్తుంది. పెద్దవారికి రిలాక్స్ గా అనిపిస్తుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ కలర్ : 36

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 8 గంటల వరకు

సింహరాశి : జులై 23-ఆగస్టు 22

సింహరాశి : జులై 23-ఆగస్టు 22

మీరు చేసే పనిలో కొత్త సవాళ్లు ఎదురవడంతో వాటిలో చిక్కుకుంటారు. ఇది మీకు జీవితకాల గుణపాఠం అవుతుంది. మీరు ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఆర్థికంగా లాభదాయకమైన రోజు అవుతుంది. మీరు పబ్లిక్ ఫోరమ్ లో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. సమస్యల నుండి తప్పించుకోవడానికి మీరు మీ యజమానితో దూరంగా ఉండాలి. కుటుంబంలో మీరు సంబంధాల విలువను గ్రహించగలుగుతారు. మీ బెస్ట్ ఫ్రెండ్ తో సమయం గడపడం మీకు ఉత్తమ చికిత్స అవుతుంది. మీ భాగస్వామికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించేందుకు ప్లాన్ చేస్తారు. మీరు షాపింగ్ కు వెళ్లొచ్చు. రిలేషన్ షిప్ లో ఉన్న వారి జీవితం ట్రాక్ లో ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి చాలా నీరు తాగండి.

లక్కీ కలర్ : లేత నీలం

లక్కీ నెంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 4:10 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈరోజు మీకు వ్యక్తిగతంగా గగుర్పాటు కలిగించే రోజు అవుతుంది. మీ భాగస్వామి యొక్క ప్రవర్తన మిమ్మల్ని చికాకు పెడుతుంది. నూతన వధూవరులు ఒకరితో ఒకరు విలువైన సమయాన్ని గడపడం ద్వారా వారి సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. ఒక చిన్న యాత్ర ఉత్తమ ప్రతిపాదన. పెద్దల కోసం మత యాత్రను ప్లాన్ చేయడం వారికి దైవిక అనుభూతిని కలిగిస్తుంది. పనిలో అలసిపోయే రోజు అవుతుంది. కార్పొరేట్ రంగంలో ఉండే వారు ఓవర్ టైమ్ పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. మీ తోబుట్టువుతో పాత సమస్యను పరిష్కరించడం మీకు రిలాక్స్ గా అనిపిస్తుంది. మీ భాగస్వామి ఇంటికి సంబంధించిన ఓ ఖరీదైన వస్తువును డిమాండ్ చేస్తారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నెంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

సంబంధం విషయంలో మీరు అసౌకర్యానికి గురవుతారు. మీ భాగస్వామి మద్దతుతో పాటు మీరు పరిస్థితిని తెలివిగా నిర్వహించాలి.

బయటి వ్యక్తి మీ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అది ఎవరైనా అంగీకరించరు. ఆర్థికంగా కఠినంగా ఉంటుంది. పనిలో పరిస్థితులు సవాలుగా మారతాయి. మీ యజమాని చిన్న విషయాలపై కోపం తెచ్చుకుంటారు. మీ మనసులో ఉద్యోగ మార్పు ఉంది. యాత్రలో స్నేహితులతో వెళ్లాలని విద్యార్థులు పట్టుబట్టొచ్చు. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీకు రిలాక్స్ గా అనిపిస్తుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నెంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:00 వరకు

వృశ్చికరాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చికరాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నందున వ్యాపారవేత్తలకు ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి. మిమ్మల్ని అప్పుల నుండి విముక్తి పొందేలా చేస్తాయి. ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ తల్లిదండ్రుల శ్రేయస్సు గురించి ఆలోచించడం అత్యవసరం. మీరు మీ సన్నిహితులతో సమయం గడపడాన్ని ఆనందిస్తారు. పనిలో పరిస్థితులు సాధారణమైనవి. కానీ అనవసరమైన కారణాల వల్ల సంఘర్షణకు గురికాకుండా ఉండండి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నెంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:15 నుండి 7:20 వరకు

ధనస్సు రాశి నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈరోజు ఎక్కువ దూరం డ్రైవింగ్ చేయడం మరియు ప్రయాణించకూడదు. ఆర్థిక పరిస్థితులు చాలా కష్టంగా ఉంటుంది. అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవాలి. ఇది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. మీ వ్యక్తిగత సమస్యలతో మీ వృత్తి జీవితాన్ని నాశనం కానివ్వొద్దు. ఆర్థరైటిస్ తో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇది పనిలో ఒక సాధారణ రోజు అవుతుంది. మీ సాధించాల్సిన ప్రధాన లక్ష్యాలు చాాలా ఉన్నాయి. ఆభరణాల వ్యాపారంలో ఉన్నవారు భారీ లాభం పొందుతారు. మంచి ఫలితం కోసం అవసరమైన వారికి ఆహారం ఇవ్వండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నెంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 4:50 గంటల వరకు

మకర రాశి డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి డిసెంబర్ 22 - జనవరి 19

మీరు ప్రస్తుతం కాలంలో ఉండి గతాన్ని ఆలోచించడం మానుకోండి. ఇది మీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. మీ పనిని చేయడానికి కష్టంగా అనిపించవచ్చు. మీరు తెలివిగా మరియు ఓపికగా వ్యవహరించాలి. మీ భాగస్వామితో విషయాలను చర్చించడంతో మీరు చాలా సంతృప్తి చెందుతారు. వ్యాపారవేత్తలకు భారీ లాభం ఉంటుంది. మీ తోబట్టువుల మానసిక స్థితి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు బదిలీని ఆశించవచ్చు. తల్లిదండ్రులు నిరీక్షణకు అనుగుణంగా విద్యార్థులు కోచింగ్ లో నిమగ్నమై ఉంటారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నెంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

తల్లిదండ్రులకు కొన్ని ముఖ్యమైన పనుల్లో సహాయకారిగా మరియు మార్గదర్శక శక్తిగా ఉంటారు. మీ పనిలో కొన్ని సానుకూల పరిస్థితులు ఉన్నాయి. మీ బాస్ మిమ్మల్ని అభినందిస్తారు. కార్పొరేట్ రంగంలో ఉన్నవారు ప్రయాణంలో బిజీగా ఉంటారు. విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తారు. చాలా కాలం తర్వాత మీరు కొంత శాంతిని పొందుతారు. ఇది మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే కారణాలపై జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్: వైట్

అదృష్ట సంఖ్య: 16

అదృష్ట సమయం: ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

సుదీర్ఘ కాలం తర్వాత ఈరోజు చాలా ఆహ్లాకరంగా ఉంటుంది. ప్రియమైన వారితో విలువైన సమయాన్ని గడపడానికి ఇది సంతోషకరమైన రోజు అవుతుంది. మీ తోబుట్టువుతో మీరు అపార్థానికి దూరంగా ఉంటారు. ఆర్థిక రంగంలో పరిస్థితులు మామూలుగా ఉంటాయి. మీరు పాత అప్పుల నుండి ఉపశమనం పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదల చూడటం మీకు ప్రత్యేకంగా అనిపిస్తుంది. వ్యాపారవేత్తలకు సాయంత్రానికి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే పఠన కళను అభివృద్ధి చేసుకోండి. ఈరోజు ధ్యానం మరియు యోగా చేసి విశ్రాంతి తీసుకోండి.

లక్కీ కలర్ : ఎరుపు (రెడ్)

లక్కీ నెంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి 8:45 గంటల వరకు

Desktop Bottom Promotion