Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
పనిమనిషి ‘గీత‘ రాత మార్చిన బిజినెస్ కార్డు గురించి మీకు తెలుసా..
మహారాష్ట్రలోని పూణెలో పని కోల్పోయానని దిగాలుగు కూర్చున్న ఓ పనిమనిషికి సంబంధించి ధనశ్రీ షిండే అనే యజమానురాలు చేసిన ఓ చిన్న పని వల్ల ఆ వంట మనిషికి దేశవ్యాప్తంగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి పని కల్పిస్తోంది. అది ఎంతలా అంటే ఒకేసారి పదులు, వందల సంఖ్యలో అవకాశాలను కల్పిస్తోంది. కాకపోతే ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. మీలో ఉన్న టాలెంట్ ను సక్రమంగా వినియోగించుకోవడమే. ఇలా ఇప్పటికే సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. తాజాగా పని కోల్పోయానని బాధలో ఉన్న పనిమనిషికి ఓ అమ్మాయి ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు వల్ల ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.
ఇటీవలే మన తెలుగు రాష్ట్రాల్లో సింగర్ బేబీ రాణి బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత రైల్వేస్టేషన్ లో అనుకోకుండా ఓ పాట పాడి ఏకంగా బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసింది రాణు. అంతేకాదు తన రాగం అచ్చం లతా మంగేష్కర్ లాగా ఉండటంతో అందరూ ఆమెను మెచ్చుకున్నారు. అలాగే తాజాగా పనిమనిషికి సంబంధించిన ఓ బిజినెస్ కార్డు సోషల్ మీడియాల తెగ వైరల్ అయ్యింది. అది అన్ని ప్లాట్ ఫామ్స్ లోనూ చక్కర్లు కొడుతోంది. అందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

1) దేశవ్యాప్తంగా ఆఫర్లు..
మహారాష్ట్రలోని పూణెలో పని కోల్పోయానని దిగాలుగు కూర్చున్న ఓ పనిమనిషికి సంబంధించి ధనశ్రీ షిండే అనే యజమానురాలు చేసిన ఓ చిన్న పని వల్ల ఆ వంట మనిషికి దేశవ్యాప్తంగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ పోస్టుకు ఎడతెరిపి లేకుండా స్పందన వస్తోంది.

2) ఆ పోస్టులో ఏముందంటే..
పని పోయిందన్న బాధలో ఉన్న గీతా కాలే అనే మహిళను చూసి బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ రంగంలో పని చేస్తున్న తన యజమానురాలికి ఓ మంచి ఆలోచన వచ్చింది. అంతే వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేసింది. ఆమెకు సంబంధించి ఓ విజిటింగ్ కార్డును తయారు చేసింది. అందులో ఆమె ఫోన్ నెంబర్ రోటి మేకింగుకు, ఇంటిని శుభ్రం చేయుటకు, ఇతర వంటలకు సంబంధించి ధరలను కూడా అందులో పొందుపరిచింది.

3) ఇంటర్నెట్లో సంచలనం..
ఆ తర్వాత ఆ విజిటింగ్ కార్డును ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అంతే పూణేలోని బావ్దన్ ప్రాంతంలో నివసిస్తున్న ఆమెకు ఆ క్షణం నుండి వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అవి ఎంతలా అంటే ఏకంగా రాష్ట్ర సరిహద్దు దాటి ఇతర రాష్ట్రాలలో కూడా ఆమెకు ఆఫర్లు వచ్చాయి. అంతవరకు ఆమెకు కూడా తెలియదు. అది ఇంటర్నెట్లో ఇంత సంచలనం అవుతుందని.

4) కేవలం 100 కార్డులు.
ఆమె ఇళ్లల్లో పని చేసేందుకు గాను ‘‘బావ్దాన్ లోని ఘర్ కామ్ మౌషి‘‘ అని తన ఫోన్ నెంబర్ ను జత చేసి కేవలం వంద కార్డులను ముద్రించింది. వాటిని తన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల వారికి పంచింది. అదే ఆమెకు మార్గనిర్దేశం చేసింది. దీంతో ఆమె పేరు కాలే నుండి కాస్త ‘‘మౌషి‘‘గా మారిపోయింది.

5) షిండే సహాయనికి ఊహించని స్పందన..
ఏది ఏమైనా ధనశ్రీ షిండే అనే యజమానురాలు ఆ పనిమనిషికి సహాయం కోసం చేసిన చిన్న ప్రయత్నం ఆమెకు ఎవ్వరూ ఊహించనంత అవకాశాలను తీసుకొచ్చింది. అన్నిటికంటే ఆమె విజిటింగ్ కార్డు డిజైన్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. అది సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే గీత ఆమె ఫోన్ నిరంతరంగా మోగుతూనే ఉంది. ఈమె చేసిన పోస్టును క్రియేటివ్ నర్చర్ వ్యవస్థాపకుడు అస్మితా జవ్‌దేకర్ మెచ్చుకుంటూ తను కూడా షేర్ చేసుకున్నారు. వీరితో పాటు ఇంకా చాలా మంది ఈ పోస్టును షేర్ చేసుకుంటున్నారు.

6) విభిన్న కామెంట్లు..
ధనశ్రీ ఆ పనిమనిషి గీతా కాలేకు సంబంధించి చేసిన పోస్టుకు విభిన్నమైన మరియు వినూత్నమైన కామెంట్లు వస్తున్నాయి. ‘ సూపర్ ఐడియా‘ అని, ‘ఇది చాలా అర్థవంతంగా ఉంది‘ ‘ అద్భుతమైన ఆలోచన‘, ‘మహిళలు ఇతర మహిళలను అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఇది ఒక మంచి ఆలోచన‘ అంటూ రక రకాల కామెంట్లు వస్తూనే ఉన్నాయి.



Click it and Unblock the Notifications

