Latest Updates
-
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే!
2023లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఈ సులభమైన పనిని చేయండి!!
2023లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఈ సులభమైన పనిని చేయండి!!
ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని అంశాలు సంతోషాన్ని కలిగిస్తే, కొన్ని అంశాలు బాధలను కలిగిస్తాయి. అలా మీ జీవితంలో కొన్ని అంశాలను విశ్లేషంచేటప్పుడు అందులో ఆర్థిక వ్యవహారాలు ముందుంటుంది. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడం చాలా పెద్ద విషయం.

జీవితంలో ఆర్థికంగా బాగున్నప్పుడు మిగిలిన విషయాల్లో సంతోషంగా జీవించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు మీరు ఎంత సిద్దంగా ఉంటే మీరు మీ జీవితాన్ని అంత మెరుగ్గా నియంత్రించగలుగుతారు. కోవిడ్ వంటి అకస్మిక పరిణామాల నుండి ఈ నూనత సంవత్సరంలో చాలా మంది ప్రజలు తమ ఆర్థిక జీవితాలను విశ్లేషిస్తున్నారు.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆర్థికంగా స్థిరపడటానికి మొదటి మొట్టు, మీ వద్ద ఉన్నదానితో మీరు సంతోషంగా ఉండటమే. ఈ సంవత్సరంలో మీ ఆర్థిక జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలున్నాయి. అవేంటో మనం ఈ కథనంలో తెలుసుకుందాం..

ఉన్నదానితో సంతృప్తి చెందండి
మానవుకున్న ఒక స్వభావం. ప్రస్తుతం మన దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ సంపాదించాలనే ఆశ మరియు విజయం సాధించాలనే కోరిక ఎల్లప్పుడు ఉంటుంది. కానీ ఉన్నదానితో సంతోషపడకుండా లేనిదానికోసం పరుగెత్తడం మంచిది కాదు. అందుకోసం అడ్డదారులను కూడా తొక్కుతారు. కాబట్టి, ఉన్నదాట్లో సంతృప్తి చెందడం ప్రారంభించండి.

మీ అవసరాలపై దృష్టి పెట్టండి
మీ దగ్గరి బందువులు కావచ్చు, ఇరుగుపొరుగు వారు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు. వారి దగ్గర ధనం, సంపద ఎక్కువగా ఉందని ఈర్శ్యపడకండి. అలా చేసినప్పుడు మీకు డబ్బు మీద ఎక్కువ వ్యామోహం కలుగుతుంది. డబ్బు అవసరమనే భావన పెరుగుతుంది. మీదగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందనప్పుడు పోటీ చేయాల్సిన అవసరం కూడా తలెత్తుతుంది. ఇతరులతో పోలిస్తే మీకు ఏది ముఖ్యమైనదో విశ్లేషించండి.

సమయాన్ని ఆదా చేసుకోండి
మనిషి జీవితంలో సక్సెస్ సాధించాలంటే టైమ్ సెన్స్ ముఖ్యం. మీరు అనుకున్న దాంట్లో విజయం సాధించాలంటే విలువైన పనులను చేయడానికి సమయాన్ని ఉపయోగించకుండా సమయాన్ని వృథా చేయడం సాధారణ బాధ్యతారాహిత్యం అవుతుంది. మీ జీవితంలో మీరు ఆర్థికంగా స్థిరంగా మరియు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లైతే, మీ సమయాన్ని వెచ్చించండి మరియు అవిశ్రాంతంగా పని చేయండి. సమయాన్ని ఆదా చేయడం మీ విజయంలో సగం.

మీ ప్రియమైన వారితో గొడవలకు దిగకండి
జీవితంలో ప్రతి వ్యక్తికి డబ్బు అవసరం ఉంటుంది. అంతకు మించిన సంబంధాలు కూడా ముఖ్యం . ఆర్థికంగా బలంగా లేనప్పుడు ఆ ఒత్తిడి కుటుంబంలోని వారిపై , ముఖ్యంగా దంపతుల పేలవమైన స్థితిని వెల్లడిస్తాయి. ఇది చాలా చెడు పరిస్థితులకు దారి తీస్తుంది. కానీ మీరు దీన్ని ఇక్కడ నిరోధించాలి. మీ ప్రియమైనవారితో విభేదాలు పెట్టుకోకండి, ఇది మీ ఆర్థిక పరిస్థితిని నాశనం చేసే అవకాశాలను పెంచుతుంది.

మీ లక్ష్యాలను మరియు మీ విజయాలను గుర్తించుకోండి
మీరు నిరాశకు గురైనప్పుడు, మీ గత విజయాలను గుర్తు చేసుకోండి. ఇది మిమ్మల్ని మెరుగ్గా చేయడానికి, కష్టపడి పని చేయడానికి మరియు మరిన్ని విజయాల కోసం ప్రయత్నించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు ఎందుకోలనూ, ఏ విధంగానూ తక్కువ కాదని మీ విజయాలు ఎల్లప్పుడూ మీకు గుర్తు చేస్తాయి.



Click it and Unblock the Notifications