Latest Updates
-
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఏయే రాశి వారు తమ ప్రేమను ఎలా వ్యక్తం చేస్తారంటే...
ఈ రాశి అమ్మాయిలు తమకు వీలైనప్పుడల్లా తమ ప్రియుడిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తమ భాగస్వామిపై అతిగా ప్రేమను చూపుతారు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశి చక్రాలను బట్టి, నక్షత్రాల ప్రభావాలను బట్టి మీ ప్రేమలో ఎలాంటి మలుపులు ఉంటాయి? పన్నెండు రాశుల వారు ప్రేమ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారు? తమ ప్రేమను విజయవంతం చేసుకునేందుకు ఎలాంటి కష్టాలు పడుతున్నారు?

తమ ప్రేమ బ్రేకప్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఏయే రాశివారు ఎలాంటి వారిపై ప్రేమ మరియు ఆప్యాయత చూపుతారు.. ఆ సమయంలో వారు ఎలా స్పందిస్తారో తెలుసుకోండి...

మేష రాశి..
ఈ రాశి అమ్మాయిలు ప్రేమలో ఉన్నప్పుడు, తమ భాగస్వామిని రొమాంటిక్ హావాభావాల ద్వారా ఆకట్టుకోవాలని చూస్తారు. అప్పుడు వారి భావాలన్నీ స్పష్టంగా బయటపడతాయి. అయితే వీరికి ఓపిక అనేది తక్కువగా ఉంటుంది. అదే అబ్బాయిలైతే ప్రేమలో పడిన వెంటనే తను ఎవరినైతే ఇష్టపడ్డాడో వారికి వెంటనే తమ ప్రేమ గురించి తెలియజేస్తారు. వీరు సమయాన్ని అస్సలు వేస్ట్ చేయరు. ఇలాంటి వారిని ప్రేమ విషయంలో నమ్మవచ్చు. అయితే వీరు విహారయాత్రల వంటి వాటిని అస్సలు ఇష్టపడరు. వీరితో ప్రేమలో ఉంటే మిమ్మల్ని ఎప్పుడూ బాగా చూసుకుంటారు.

వృషభ రాశి..
ఈ రాశి అమ్మాయిలు తమకు వీలైనప్పుడల్లా తమ ప్రియుడిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తమ భాగస్వామిపై అతిగా ప్రేమను చూపుతారు. వీరు కౌగిలించుకోవటం వంటి వాటిని వీరు బాగా ఇష్టపడతారు. అబ్బాయిల విషయానికొస్తే వీరు తమ ప్రేమలో విజయం కోసం ఎంతటి కష్టమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే వీరు తమ ప్రియురాలు వేరే వ్యక్తితో మాట్లాడితే అసహ్యించుకుంటారు.

మిధున రాశి..
ఈ రాశి అమ్మాయిలు అత్యుత్తమ భాగస్వాములు అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు పరిస్థితులకు తగ్గట్టు నడుచుకుంటారు. అబ్బాయిలు అయితే తమ ప్రేమ యొక్క అనుభూతి గురించి తెలిపేందుకు ఎలప్పుడూ సిద్ధంగా ఉంటారు. తాము తమ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారో నిరూపించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు.

కర్కాటక రాశి..
ఈ రాశి మహిళలు ప్రేమ విషయంలో తల్లి స్వభావం కలిగి ఉంటారు. వీరు చాలా సున్నితంగాఉంటారు. ప్రతి విషయాన్ని ప్రేమ పూర్వకంగా వ్యక్తం చేస్తారు. ఈ రాశి పురుషులు తమ కళ్లతోనే ప్రేమను వ్యక్తం చేస్తారు. అలాగే పార్కులకు తీసుకెళ్లడం, బీచ్ కు వెళ్లడం వంటివి చేస్తారు. వీరు తమ భాగస్వామి పుట్టినరోజు లేదా వార్షికోత్సవం వంటి విషయాలను ఎప్పటికీ మరచిపోలేరు.

సింహ రాశి..
ఈ రాశి అమ్మాయిలు ప్రేమ విషయంలో స్వేచ్ఛగా ఉంటారు. వీరు అందంగా ఉండే వారిని ఇష్టపడతారు. వీరు తమ బాయ్ ఫ్రెండ్ తో కలిసి సినిమాలకు వెళ్లటం, లాంగ్ డ్రైవ్ వంటి వాటిని ఇష్టపడతారు. అదే అబ్బాయిల విషయానికొస్తే వీరు ఎవరికైనా సహాయం చేయడానికి ముందు ఉంటారు. వీరు ప్రేమతో పాటు ప్రతి విషయంలో టాప్ లో ఉండాలని కోరుకుంటారు.

కన్య రాశి..
ఈ రాశి అమ్మాయిలు తమ భాగస్వాములను సంతోషపెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. వీరు తమ భాగస్వామిని ఎప్పుడూ తమ అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటివే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే వీరు ప్రేమలో ఉంటే, వీరు అత్యంత నమ్మకదారులుగా ఉంటారు. ఈ రాశి అబ్బాయిలు కూడా ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. తమ భాగస్వామిపై నిజంగానే శ్రద్ధ చూపుతారు.

తుల రాశి..
ఈ రాశి అమ్మాయిలు చాలా సహజంగా, ఆలోచనాత్మకంగా ఉంటారు. వీరు తమ జీవితంలో ఉన్న వ్యక్తులను ఆకట్టుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఈ రాశి అబ్బాయిలు కూడా ప్రేమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వీరు కౌగిలింతలను బాగా ఇష్టపడతారు. వీరు చాక్లెట్లు, పూలు, ప్రేమ కవితలు, గిఫ్టులను స్వీకరించడాన్ని బాగా ఇష్టపడతారు. ఇలాంటి వాటితో బాగా ఆనందిస్తారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి అమ్మాయిలు తమ ప్రేమను తెలియజేయడానికి అద్దాలు, గాజు తలుపులు మరియు కిటికీల వంటి వాటిని వాడుతుంటారు. వీరు తమ భాగస్వామి అంతిమ రక్షకుడిగా ఉండాలని కోరుకుంటారు. ఆమె కూడా తను ప్రేమిస్తున్న వ్యక్తులకు రక్షణగా ఉంటుంది. ఈ రాశి పురుషులు చాలా ఉద్వేగభరితంగా ఉంటారు. కేవలం తమ భాగస్వామితో మాత్రమే రహస్యాలను పంచుకుంటారు. అలా తాను ఆమెకు ఎంత ముఖ్యమో నిరూపించే ప్రయత్నం చేస్తారు.

ధనస్సు రాశి..
ఈ రాశి అమ్మాయిలు ఎప్పుడూ ఆశావాదిగా ఉంటారు. వీరు ఎవరినైనా నమ్మితే వారి కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వీరు రిలేషన్ షిప్ లో బంధాన్ని పెంచేందుకు తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తారు. ఈ రాశి అబ్బాయిలు తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఎన్ని మార్గాలుంటే అన్నింటిని అన్వేషిస్తాడు.అనుసరిస్తాడు.

మకర రాశి..
ఈ రాశి స్త్రీలు సుదీర్ఘకాల సంబంధాన్ని కోరుకుంటారు. అయితే వారి వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమాపణ మాత్రం చెప్పరు. అయితే బయటకు వెళ్లిపోతారు. అయితే వీరు పరధ్యాసలు వంటి వాటికి వెళ్లరు. ఈ రాశి అబ్బాయిలు వంద శాతం నమ్మకంగా ఉంటారు. వీరు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రేమ లేఖలు రాయడం, పూలు బహుమతులుగా ఇవ్వడం వంటివి చేస్తుంటారు.

కుంభ రాశి..
ఈ రాశి అమ్మాయిలు ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు, వారికి సంబంధించిన అన్ని అంశఆల గురించి తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ రాశి అబ్బాయిలు అయితే తమ మాటలతో తమ భాగస్వామిని ఉత్తేజ పరిచేందుకు ప్రయత్నిస్తారు. లోతైన సంబంధాలను ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తారు.

మీన రాశి..
ఈ రాశి అమ్మాయిలు ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వీరు తను ప్రేమించే వారితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ప్రేమలో ఉన్నప్పుడు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ రాశి అబ్బాయిలు ఏవేవో వాగ్దానాలు ఇస్తారు. సాధారణంగా తన భాగస్వామిని ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వరు. వీరు తమ ప్రేమను మిఠాయి లేదా పూలు వంటి బహుమతులతో వ్యక్తం చేస్తారు.



Click it and Unblock the Notifications
