Latest Updates
-
డయాబెటిస్ ఉందా? అయితే మీరు రోజూ ఎంతసేపు నడవాలో తెలుసా? -
ఘుమఘుమలాడే మంగళూరు చికెన్ సుక్కా.. ఒక్కసారి వండితే ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ కావాలంటారు! -
బంపర్ ఆఫర్: ఫ్రీగా ఫిన్ లాండ్ వెళ్లే ఛాన్స్..ఒక్క రూపాయి లేకుండా 7 రోజుల ట్రిప్..పూర్తి వివరాలు చూడండి.. -
Weekly rasi phalalu (22 నుండి 28 మార్చి): ఈ రాశుల వారికి అదృష్టం వరించబోతోంది, మీ రాశి ఉందేమో చూడండి! -
ఆరోగ్యానికి అమృతం లాంటి నల్ల నువ్వుల లడ్డూ..ఇలా చేసి రోజుకొకటి తింటే జుట్టు రాలడం, PCOD పరార్! -
Today rasi phalalu (22.03.26): ఆదివారం నాడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
పనీర్ లేకుండానే పాలక్ పనీర్!..ఈ 2.0 రెసిపీ చూస్తే వెంటనే వండేస్తారు! -
అబ్బాయిలు vs అమ్మాయిలు..ప్రేమ విషయంలో ఎవరు ఎక్కువ సీరియస్ గా ఉంటారు? -
పర్ఫెక్ట్ అల్లం టీ తయారీకి సీక్రెట్ ఇదే.. ఒక్కసారి ఇలా ట్రై చేయండి! -
నోరూరించే చెట్టినాడ్ చికెన్.. తింటుంటే వావ్ అనాల్సిందే!
ధనలక్ష్మిని ఆకర్షించాలంటే ఇంట్లో నిమ్మకాయ-ఉప్పుతో ఇలా చేయండి
డబ్బు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి? డబ్బే ప్రపంచంగా భ్రతికేవారుంటారు. కొంత మంది డబ్బు సంపదించడానికి ఎలాంటి పని చేయడానికైనా సిద్దపడుతుంటారు. డబ్బే ప్రధానం అనుకునేవారు ఆ డబ్బు సంపాదించడానికి మంచి, చెడు, వెనుక, ముందు ఆలోచించరు. కొన్ని సందర్బాల్లో అక్రమంగా సంపాదించే డబ్బు వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఇంకా ప్రాణాల మీదకు కూడా రావచ్చు. డబ్బు సంపాదించడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటుంటారు. అయితే కొంత మంది మాత్రం సరైన మార్గంలో డబ్బు సంపాధించాలానుకునే వారు ఉన్నారు.
ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు ముఖ్యం. అది లేకపోతే ఏదో ఒక విధంగా మననందరం బాధపడతాము. దాని కోసమే కష్టపడి పనిచేస్తాము. డబ్బు సంపాధించాడానికి మనలో చాలా మంది ఎన్నో కష్టాలపడుతుంటారు.

డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలున్నాయి. కొంత మంది నిజాయితీగా సంపాదిస్తే, మరికొందరు చెడు మార్గాలను ఎంచుకుంటారు. ఈ కాలంలో నిజాయితీగా సంపాదించిన సొమ్మే నిలబడుట లేదు, మరి అక్రమంగా ఎందుకు సంపాదించాలి? నిజాయితీగా సంపాదించిన డబ్బును ఏవిధంగా వాడుకోవాలి, ఏవిధంగా పొదుపు చేసుకోవాలి అనే విషయాల పట్ల అవగాహన ఉంటే ఆ డబ్బు మిమ్మల్ని ఏదోవిధంగా రక్షిస్తుంది. అయితే కొంత మంది ఎంత సంపాదించిన నిలవట్లేదు అంటుంటారు. కొందరైతే అసలు ఎంత కష్టపడ్డా ధనం చేకూరడం లేదు అన్నింట్లో నష్టాలే అని వాపోతుంటారు. సమస్యలు మీ ఇంట్లో ధనలక్ష్మి వరించాలన్నా, నిల్వ ఉండాలన్నా ఈ సులభమైన మార్గాలను ప్రయత్నించండి.

నిమ్మ మరియు ఉప్పు :
పండగలు, పూజలు, ఆచారాలలో ఎక్కువగా నిమ్మకాయలను ఉపయోగిస్తుంటారు. ఇంటికి మరియు వాహనాలకు ద్రిష్టిని నివారించే శక్తి నిమ్మకాయల్లో ఎక్కువగా ఉంది. ఈ విషయం మన పూర్వకాలం నుండే పాటిస్తున్నారు. అలాగే దేవాలయాల్లో కూడా నిమ్మకాయలను ఎక్కువగా వాడుతుంటారు. మరియు ఇంట్లో వంటల తయారీకి కూడా ఉపయోగిస్తుంటారు.

ఉప్పు:
ఉప్పు వాడని ఇల్లంటూ ఉండదు. ప్రతి వంటగదిలో ఉప్పు ఉండాల్సిందే. ఇంతటి అత్యవసరమైన నిత్యవసరమైన ఉప్పులో ఇంట్లో ప్రతికూల శక్తులను అధిగమిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతటి గొప్పది ఉప్పు. సాధారణంగా చాలా మంది ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తొలగించడంలో ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుందని చెబుతారు. అంతే కాదు ఇది క్రిమి కీటకాలను నివారించే మందు కూడా. ఇల్లు తుడిచేటప్పుడు నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి తుడం వల్ల ఫ్లోర్ పై కంటికి కనిబడని క్రిములు నాశనం అవుతాయి.

ఎలా ఉపయోగించాలి:
ఇంట్లో నెగటివిటి తొలగించాలన్నా , ధనాన్ని ఆకర్షించాలన్నా ఇలా చేయాలి. ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును తీసుకోవాలి. ఈ ఉప్పును తిరిగి వంటకు వాడకూడదు, ద్రిష్టి తొలగించడానికి సపరేట్ గా తీసి ఉంచుకోవడం మంచిది. అలాగే వంటగదిలో ఉపయోగించే ఉప్పును ఇటువంటి కార్యక్రమాలకు వాడకూడదు.

మంచి తాజా నిమ్మకాయ:
తాజాగా ఉన్న నిమ్మకాయను తీసుకోండి. దీన్ని నాలుగు ముక్కలు చేయాలి. కాని పూర్తిగా కట్ చేయకుండా అడుగు భాగం అలాగే ఉండేట్లు చూసుకోవాలి. దిగువభాగం అలాగే ఉండేట్లు చూసుకోండి.

ఈ నిమ్మకాయను ఉప్పు ఉన్న గిన్నెలో మద్యలో ఉంచాలి
నాలుగు భాగాలుగా కట్ చేసిన నిమ్మకాయను ఉప్పు ఉన్న గిన్నెలో మధ్యలో ఉంచండి. ఈ గిన్నెను పడకగదిలో మంచం క్రింద ఉంచాలి. ఇలా ఉంచడం ఎవ్వరూ చూడకూదు. అలాగే ఇతరులు చూసే విధంగా కూడా పెట్టకూడదు.

వారం రోజులు ఇలా చేస్తూ ఉండండి
రోజూ వారం రోజుల పాటు పైన సూచించిన విధంగా చేస్తుండాలి. అయితే ప్రతి రోజూ తాజా నిమ్మకాయ, తాజా ఉప్పును మార్చుతుండాలి. ఇలా మార్చినప్పుడు ముందు రోజు పెట్టిన వాటిని తాకకుండా ఒక కవర్లోకి వేసి మరుసటి రోజు వేకువ జామునే ఎవ్వరూ చూడకుండా తీసి బయట పడేయాలి. ఇలా వారం రోజుల పాటు క్రమం తప్పకుండా రిపీట్ చేయండి.

నెగటివి వెళ్లిపోయి, మిమ్మల్ని ధనలక్ష్మి వరిస్తుంది
ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వెళ్ళిపోయి, సానుకూల శక్తి నిండి ఉంటుంది.దీని వల్ల మరొక ప్రయోజనం ఇల్లు సుసంపన్నంగా ఉంటుంది. అదృష్టవంతులుగా మారే మార్గం చూపుతుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైంది.



Click it and Unblock the Notifications








![వారపు రాశి ఫలాలు [19 నుండి 26 మార్చి]: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? మీ రాశి ఫలాలు ఇక్కడ చూడండి!](https://images.boldsky.com/fit-in/400x225/te/img/2026/03/today-rasi-phalalu-for-all-12-zodiac-signs-19-mar-2026.jpg)


