Latest Updates
-
పిత్తులు వేసే వాళ్లని చూసి నవ్వుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి.. -
స్పైసీ మసాలా కార్న్ కర్రీ..చపాతీ, నాన్ లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్! -
ఆగస్టు 11 నుంచి 5 రాశులకు రాజయోగం.. కుబేరులు కాబోతున్న ఆ అదృష్టవంతులు మీరేనా? -
చికెన్ 65, చిల్లీ చికెన్ మర్చిపోతారు.. ఈ కేరళ చికెన్ ఫ్రై రుచి చూస్తే! -
తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా.. -
ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి.. -
అరేయ్ మామా.. మీ బెస్ట్ ఫ్రెండ్ కి పంపించడానికి అదిరిపోయే ఫ్రెండ్ షిప్ డే విషెస్, కోట్స్,స్టేటస్ లు.. -
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు!
Zodiac signs: 12 రాశుల వారు ఒత్తిడిని ఎలా అధిగమిస్తారో తెలుసా...
ఈ రాశుల వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మందికి ఎప్పుడో ఒకప్పుడు.. ఏదో ఒక సందర్భంలో ఒత్తిడి లేదా టెన్షన్ అనేవి వస్తుంటాయి. అయితే ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికీ నిత్య జీవితంలో అనివార్య సంఘటనగా మారిపోయింది.

అయితే ఆ ఒత్తిడిని అధిగమించేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. ఎవరికి ఏ పద్ధతిలో నచ్చితే.. ఆ పద్ధతుల్లో వారు ఒత్తిడి నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొందరు ఎంత ప్రయత్నించినా ఒత్తిడి నుండి బయటపడలేరు. అయితే కొందరికి మాత్రం చాలా సులభంగా ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. మీరు ఒత్తిడిని తగ్గించుకునేందుకు మీకు జ్యోతిష్యశాస్త్రం సహాయపడుతుందట. వినడానికి వింతగా విన్నా ఇది నిజమేనంటున్నారు పండితులు.

గ్రహాల ఆధారంగా మీ రాశిని బట్టి.. వ్యక్తిత్వాన్ని బట్టి జీవితాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనే పద్ధతులు కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ లైఫ్ లో వచ్చే సమస్యలను ఎదుర్కొనే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. ఈ సందర్భంగా ఏ రాశి వారు ఒత్తిడి ఎలా అధిగమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం...

మేషరాశి..
ఈ రాశి వారికి పార్టీలు, లేట్ నైట్ స్నేహితులతో సరదాగా గడపడం వంటివి చాలా ఇష్టం. అంతేకాదు వీరు రిస్క్ తీసుకోవడానికి బాగా ఇష్టపడతారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి కూడా వీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. వీరు ఏదైనా విషయంలో చిరాగ్గా ఉన్నప్పుడు ఈ రాశారు ఒంటిరిగా గడిపేందుకు సిద్ధమవుతారు.

మిధున రాశి..
ఈ రాశి వారికి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా విషయం గురించి ఆందోళన చెందుతున్నప్పుడు వీరు చాలా తీవ్రంగా ఆలోచిస్తారు లేదా స్నేహితులతో కలిసి సరాదాగా గడిపేస్తారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు ఒత్తిడి తగ్గించుకునేందుకు బాగా నమ్మిన వారి దగ్గర కూర్చుని మంచి, చెడును షేర్ చేసుకుంటారు. అలా మాట్లాడుకోవడం ద్వారా ఒత్తిడిని సులభంగా తగ్గించుకుంటారు.

సింహ రాశి..
ఈ రాశి వారికి డామినేషన్ చేయడం అంటే బాగా ఇష్టం. అందరూ వీరికి గౌరవం ఇవ్వాలని కోరుకుంటారు. అయితే వీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మాత్రం కొంత కఠినంగా ఉంటారు. అప్పుడు అక్కడున్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారు ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఒంటరిగా గడుపుతారు. పార్టీలు, ఫంక్షన్లు, స్నేహితులతో గడపడం వంటి వాటిపై ఎక్కువగా నమ్మకం ఉండదు. అంతేకాదు వీరు ఒంటరిగా ఉంటేనే ప్రశాంతంగా ఉండి ఎంజాయ్ చేయగలమని భావిస్తారు.

తుల రాశి..
ఈ రాశి వారు చాలా బ్యాలెన్స్ గా వ్యవహరిస్తారు. అందుకే వీరు ఎలాంటి ఒత్తిడిని అయినా సులభంగా ఎదుర్కొంటారు. ఒత్తిడి ఉన్న సమయంలో వీరు పుస్తకం చదవడమో.. మంచి గేమ్స్ ఆడుకోవడమో.. మంచి రొమాంటిక్ కామెడీ సినిమాలను చూడటం వంటివి చేస్తారు.

వృశ్చికరాశి..
ఈ రాశి వారికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరికి ఎప్పుడైనా ఒత్తిడి కలిగితే, వీరు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఉదాహరణకు వీరికి ఒత్తిడి కలిగితే, హార్రర్ మూవీస్ చూడటం, సస్పెన్స్ థ్రిల్లర్ నవలలు చదవడం వంటివి చేస్తారు. దీని వల్ల వీరి మనసు తేలికపడుతుంది

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి రిస్క్ తీసుకోవడమంటే చాలా ఇష్టం. అందుకే వీరు ఎక్కువగా కొత్త వ్యక్తులను కలవడం, కొత్త ప్రదేశాలు చూడటం వంటివి చేస్తుంటారు. అందులోనే వీరు మంచి ఆనందాన్ని అనుభవిస్తారు. అయితే ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు కూడా థ్రిల్ గా ఫీలవుతారు. వీరి అత్యుత్సాహమే వీరిని ఒత్తిడి నుండి బయటపడేయగలదు.

మకర రాశి..
ఈ రాశి వారు ఒత్తిని, ఆందోళనలను తగ్గించుకునేందుకు, స్నేహితులతో ఎక్కువగా గడుపుతారు. అయితే పార్టీలు, ఫంక్షన్లు వంటి వాటిలో పాల్గొనకుండా సరదాగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి కొన్ని పనుల్లో సహాయం చేస్తారు.

కుంభ రాశి..
ఈ రాశి వారు ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం, వారికి ఇష్టమొచ్చినట్టు గడుపుతారు. ఇలాంటి వాటి వల్లే వీరు ఎన్ని సమస్యలున్నా.. ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వాటన్నింటినీ మరచిపోయేలా చేస్తుంది. అంతేకాదు వీరు చాలా చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది.

మీన రాశి..
ఈ రాశి వారికి అన్ని రాశుల వారి కంటే అర్థం చేసుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఊహా సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొంటారు. ఈ శక్తి వల్లే వీరు ఎక్కువగా ప్రశాంతంగా ఉంటారు.



Click it and Unblock the Notifications