Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
మీ రాశిని బట్టి మీ భాగస్వామిని ఎలా సర్ ప్రైజ్ చేస్తారంటే...
మీ రాశి చక్రాన్ని బట్టి మీ భాగస్వామిని ఎలా ఆశ్చర్యపరుస్తారో తెలుసుకోండి.
ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ లను బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా కలయిక సంబంధాలలో ఉన్నవారు, భార్యభర్తలైనా.. ప్రేమికులైనా సర్ ప్రైజ్ ల ద్వారా తమ భాగస్వాములతో బంధాన్ని బలంగా మార్చుకుంటూ ఉంటారు.

డిన్నర్ డేట్ ప్లాన్ చేయడం నుండి సాహసోపేతమైన సెలవుదినాల వరకు మీ పార్ట్ నర్ ను ఆశ్చర్యపరచడానికి మీరు అనేక ప్రయోగాలు చేయొచ్చు.

ఏది ఏమైనప్పటికీ, ప్రతి ఒక్కరూ రోటీన్ రొమాన్స్ ను ఇష్టపడరు. సర్ ప్రైజులు.. థ్రిల్లింగ్ వంటివాటిని బాగా ఇష్టపడతారు.

అయితే మీ భాగస్వామిని మీరు ఎలా ఆశ్చర్యపరుస్తారో జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. మీ రాశిచక్రాన్ని బట్టి మీ పార్ట్ నర్ ను ఎలా సర్ ప్రైజ్ చేయాలో ప్లాన్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీ రాశిని బట్టి మీ భాగస్వామిని ఎలా ఆశ్చర్యపరచాలో చూసెయ్యండి మరి...

మేష రాశి..
ఈ రాశి వ్యక్తులు సాహసోపేతంగా ఉంటారు. వీరు చాలా పనులను వేగంగా చేసేస్తారు. మీరు మీ భాగస్వామిని సర్ ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీకు వీలైనంత ఉత్తేజకరమైన మరియు సాహసోపేతమైనదిగా చేయండి. దీని వల్ల మీ మధ్య బంధం మరింత ప్రత్యేకంగా మారుతుంది.

వృషభరాశి..
ఈ రాశి వారు మీ భాగస్వామి మనసు గెలుచుకోవడానికి సర్ ప్రైజ్ అనేది సులువైన మార్గం. మీరు మంచి భోజనం లేదా పాక నైపుణ్యాల ప్రదర్శన వంటివి ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రాశి వారు మంచి భోజనప్రియులు. మీరు ఆశ్చర్యకరమైన డిన్నర్ డేట్ లేదా మీరే స్వయంగా చేసిన వంటను చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మిధున రాశి..
ఈ రాశి వారు చాలా సరదాగా ఉంటారు. వీరు భాగస్వామిని చాలా ప్రేమిస్తారు. థ్రిల్లింగ్ అనుభవాల కోసం ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు. వీరు తమ భాగస్వామిని మాత్రమే కాకుండా ఇతరులను కూడా అద్భుతమైన ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు మంచి ఆలోచనాపరులు. వీరు ఎవరినైనా ఆశ్చర్యపరచడానికి అర్థవంతమైన మరియు సైలెంట్ గా ఉండే ప్రదేశాలను ఎంచుకుంటారు. వీరు ఎక్కువగా మ్యూజియం లేదా ప్లానిటోరియం తీసుకెళ్లడం గురించి ఆలోచిస్తారు.

సింహ రాశి..
ఈ రాశి వారు యాక్టింగ్ బాగా చేస్తారు. వీరిలో నాటకీయ ప్రదర్శనలు పుష్కలంగా ఉన్నందున వీరు వారి భాగస్వామిని సినిమాలకు తీసుకెళ్లడం లేదా ఏదైనా నాటకాలను తీసుకెళ్లి ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలా వారి పార్ట్ నర్ ను ఆకర్షిస్తారు.

కన్య రాశి..
ఈ రాశి వారికి పుస్తకాలు మరియు సాహిత్యం అంటే బాగా ఇష్టం. వీరు తమ భాగస్వామిని ఆకట్టుకోవడానికి మంచి పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం ద్వారా తమ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారో అనే విషయాన్ని తెలియజేస్తారు.

తుల రాశి..
ఈ రాశి వారు తమ భాగస్వామి మనసును గెలవడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. వీరు అందరి మాదిరిగా కాకుండా, రొమాంటిక్ గా ఉంటూ... భాగస్వామిని ఆకట్టుకునేలా మాట్లాడుతూ తమ పార్ట్ నర్ ను ఆశ్చర్యపరుస్తారు. ఇలాంటి వాటి వల్ల కపుల్స్ మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు పోటీతత్వాన్ని బాగా ఇష్టపడతారు. వీరు తమ భాగస్వామిని ఆశ్చర్యపరచడానికి ఏదైనా గేమ్ ప్లాన్ చేయవచ్చు. దీని వల్ల వారి భాగస్వామి మనసును సులభంగా గెలుచుకునేందుకు ప్రయత్నిస్తారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు కొత్త ప్రదేశాలు.. డిఫరెంట్ కల్చర్ ను అన్వేషించడాన్ని బాగా ఇష్టపడతారు. వీరు తమ భాగస్వామిని ఆశ్చర్యపరించేందుకు కచ్చితంగా ఒక టూర్ ప్లాన్ చేయాలని ఆలోచిస్తారు.

మకర రాశి..
ఈ రాశి వారు పని చేయడాన్ని బాగా ఇష్టపడతారు. అందుకే వీరు ఎక్కువగా విశ్రాంతిని కోరుకుంటారు. వీరు తమ భాగస్వామిని మసాజ్ చేయడం లేదా మసాజ్ చేయించుకోవడం వంటివి చేస్తూ తమ భాగస్వామిని ఆశ్చర్యపరిచేందుకు ప్రయత్నిస్తారు.

కుంభ రాశి..
ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన కొంత ఎక్కువగా ఉంటుంది. వీరు తమ భాగస్వామిని మనసును సానుకూల శక్తి మరియు ఆలోచనతో ప్రేరేపించడానికి ఇష్టపడతారు. అందువల్ల వీరు తమ భాగస్వామికి యోగా లేదా ద్యానం వంటి పనులతో తమ పార్ట్ నర్ ను ఆశ్చర్యపరుస్తారు.

మీన రాశి..
ఈ రాశి వారు డేటింగ్ ప్లాన్ చేస్తుంటే, మీరు కళల వంటి పోటీల్లో పాల్గొని, మీ పార్ట్ నర్ ను ఆశ్చర్యపరచాని ఆలోచిస్తారు. వీరు కళాఖండాలను ఎక్కువగా ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications
