Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల సందేశాలు, మహానుభావుల మాటలను మీ బంధువులు, మిత్రులతో పంచుకోండి.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఒక వాక్యాన్ని తప్పక స్మరిస్తారు. ఆ వాక్యం ఏమిటంటే నేటి బాలలే రేపటి పౌరులు. భావితరాల భవిష్యత్తుకు యువత కీలకం అనే పదాలను ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంట
భారతదేశంలో ఆగస్టు 15వ తేదీ భారతీయులందరూ జాతీయ సెలవు దినంగా పాటిస్తారు. అంతేకాదు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఒక్క పాఠశాలలో, కళాశాలలో, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహిస్తారు. భారతీయులందరూ త్రివర్ణ పతాకానికి వందనం చేస్తారు. విధిగా జాతీయ గీతం 'జన గణ మన' పాడతారు.
ఈ ప్రత్యేకమైన రోజుని, స్వాతంత్య్రం కోసం పోరాడిన మహామహులు, అమరవీరులు, గొప్పనేతల పోరాటాలు, త్యాగాల గురించి, దేశస్వేచ్ఛ కోసం వారెంత దోహదపడ్డారో తెలియజేస్తూ మీ మిత్రులకు, బంధువులకు తెలియజేయడానికి.. వారిని గౌరవించడానికి సందేశాలు, వారి సూక్తులను పంచుకోండి.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఒక వాక్యాన్ని తప్పక స్మరిస్తారు. ఆ వాక్యం ఏమిటంటే నేటి బాలలే రేపటి పౌరులు. భావితరాల భవిష్యత్తుకు యువత కీలకం అనే పదాలను ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ వారు అందుకు ఏ మాత్రం దోహదం చేశారో.. చేస్తున్నారో వారికే తెలియాలి. కానీ ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు. ఎందుకంటే వారికి ఆ రోజు స్వీట్లు ఇస్తారు కాబట్టి. అంతేకాదు వారితో పలు రకాల నాటకాలు, జాతీయ గీతాలను ఆలపిస్తారు కాబట్టి వారు బాగా ఇష్టపడతారు.

లక్ష్యం సాధించడానికి మార్గం..
ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి.. దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి.. దాన్నే ధ్యానించండి.. దాన్నే కలగనండి.. దాన్నే శ్వాసించండి.. ఇదే విజయానికి మార్గం..
- స్వామి వివేకానంద

నిజమైన దేశాభివృద్ధి అంటే..
మేమంతా భారతీయులం. ఆది నుంచి అంతం వరకు..
దేశం అబివృద్ధి చెందడమంటే, అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.
- డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్

ప్రపంచంతో స్నేహం..
నా దగ్గర ప్రేమ తప్ప.. మరొక ఆయుధం లేదు.. ప్రపంచంతో స్నేహం చేసుకోవడమే నా గమ్యం..
- మహాత్మ గాంధీజీ

కొత్త దారే నా ధ్యేయం..
ఒప్పుకోను పరాజయం. కొత్త దారి నా ధ్యేయం.. కాలం తలరాతను చెరిపేస్తా.. సరికొత్త గీతాన్ని పాడేస్తా..
- అటల్ బిహరీ వాజ్ పేయి

నీ విజయం వెనుక..
నీ మొదట విజయం సాధించిన తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు..
గుర్తుంచుకో.. రెండవ ప్రయత్నంలో ఓడిపోతే, నీ గెలుపు గాలివాటంగా వచ్చిందని చెప్పడానికి చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు..
- ఎపిజె అబ్దుల్ కలాం..

జీవితాంతం ఆశావాదిగా..
ప్రతి మనిషి ఆత్మ శోధన, స్వయం సమీక్ష చేసుకుంటూ నిబద్ధతతో ఆశావాదిగా జీవితాంతం కొనసాగించడం గొప్ప విషయం..
- భగత్ సింగ్

యువతకు ఆదర్శం ఆజాద్..
యువత రక్తం మరగడం లేదంటే వారిలో ప్రవహించేది నీరు అని అర్థం. భారత మాతకు సేవ చేయని యువత వల్ల ప్రయోజనం శూన్యం..
- చంద్రశేఖర్ ఆజాద్

మాటలతో కాదు తూటాలతో సమాధానం..
బలగాలను బలంతోనే కొట్టాలి.. భారతదేశంలోకి వచ్చి కుట్రలు, కుతంత్రాలు చేసే వారికి మాటలతో కాదు తూటాలతో సమాధానం చెప్పాలి.
- సుభాష్ చంద్ర బోస్

సమయానికి కొలమానం..
సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు..ఆ కాలంలో మనం ఏం సాధించామనేది ముఖ్యం..
- పండిట్ జవహార్ లాల్ నెహ్రు



Click it and Unblock the Notifications
