For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సొంతంగా ప్రైవేట్ జెట్ విమానం ఉన్న ఇండియన్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..

|

మన దేశంతో పాటు ప్రపంచంలోని చాలా మంది సినీ ప్రముఖుల జీవితం చాలా విలాసవంతంగా ఉంటుంది. కోట్లకు కోట్ల రూపాయలు సంపాదించే నటులు లేదా నటీమణులు లగ్జరీ లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వారికి సంబంధించిన బ్రాండెడ్ కార్లు, ఇల్లు, తోటలు, ఫామ్ హౌస్ ల గురించి మనలో చాలా మందికి తెలుసు. కానీ కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు అందులోనూ టాప్ హీరోయిన్స్ నిత్యం వినూత్నమైన వాటిని కొనుగోలు చేస్తున్నారు. వారిలో చాలా మంది గగన విహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారట. అందుకే వారు ఎక్కడికైనా ప్రయాణించేందుకు విమానయాన సంస్థలపై ఆధారపడకుండా వారే సొంతంగా ప్రైవేట్ జెట్ విమానాలను కొనుగోలు చేశారు. వారు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే క్షణాల్లో గాల్లోకి ఎగిరిపోతారు. ఇంతకీ ఆ ప్రముఖ బాలీవుడ్ అందాల భామలెవరో తెలియాలంటే కిందకు స్క్రోల్ చేయాల్సిందే.

Indian Cinema Actresses Who Own Private Jet
 

బాలీవుడ్ తారల జీవితం ఆదర్శవంతమైన జీవితం చాలా మంది అంటుంటారు.ప్రైవేట్ బాడీగార్డులు, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ, ఖరీదైన ఇళ్లతో పాటు లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ సొంతంగా ఉన్న ప్రైవేట్ జెట్లలో ప్రయాణిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు వారు గాల్లో పక్షుల్లాగా ఎగిరిపోతున్నట్లు కొన్ని వీడియోలను, ఫొటోలను గర్వంగా సోషల్ మీడియాలో చూపిస్తారు. కాని కొందరు వారు దుబారా ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. ఇంతకీ సొంత ప్రైవేట్ జెట్ విమానాల్లో ప్రయాణించే బాలీవుడ్ హీరోయిన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1) సన్నీ లియోన్..

1) సన్నీ లియోన్..

38 ఏళ్ల వయసు వచ్చే వరకే ఈ వయ్యారి భామ కోట్ల రూపాయలను సంపాదించింది. హాలీవుడ్ నుండి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ శృంగార భామ అతి తక్కువ కాలంలోనే మిలియన్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు పోర్న్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ తో పాటు దక్షిణాదిన ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ శృంగార తార సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ ను కలిగి ఉంది.

2) ప్రియాంక చోప్రా..

2) ప్రియాంక చోప్రా..

మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ ను కలిగి ఉంది. తను ఒక విదేశీయుడిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె తను ఒంటరిగానే ప్రయాణించడం విశేషం.

3) ఐశ్వర్యరాయ్..
 

3) ఐశ్వర్యరాయ్..

అమితాబ్ బచ్చన్ కోడలు, అభిషేక్ బచ్చన్ భార్యగా మారిపోయిన ఐశ్వర్యారాయ్ కూడా సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ ను కలిగి ఉంది. వీరి ఇంట్లో ఈ ముగ్గురికి మూడు ప్రత్యేక జెట్ లు ఉండటం విశేషం. అమితాబ్ , ఐశ్వర్య బచ్చన్ జెట్ ట్రిప్స్ అంటే తెగ ఇష్టపడతారట. అందుకే వారు ఎప్పుడూ గగన విహారానికి ఆసక్తి చూపుతారంట.

4) మల్లికా షెరావత్..

4) మల్లికా షెరావత్..

బాలీవుడ్ లో శృంగారానికి సంబంధించి ఎటువంటి హాట్ సీన్లు అయినా, ఎంతటి రొమాన్స్ అయినా అందులో లీనమై పోయే మల్లికా షెరావత్ సైతం సొంతంగా ఒకటి కంటే ఎక్కువ జెట్లను కలిగి ఉంది.

5) శిల్పాశెట్టి..

5) శిల్పాశెట్టి..

పొడుగు కాళ్ల సుందరిగా పేరు తెచ్చుకున్న శిల్పాశెట్టి ప్రత్యేక జెట్ తో పాటు ఖరీదైన ఇళ్లను కలిగి ఉంది. అంతేకాదు మన దేశంలో అతిపెద్ద వ్యాపారవేత్తలలో ఒకరైన ప్రముఖ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అంతేకాదు ఆమె ఐపిఎల్ లో ఓ జట్టుకు ఓనర్ గాను వ్యవహరిస్తున్నారు. మన దేశమే కాకుండా ఇతర దేశాల్లోనూ ఆమె ఎన్నో వ్యాపారాలు, ఆస్తులు కలిగి ఉన్నారు.

6) డ్యాన్సింగ్ క్వీన్ మాధురి దీక్షిత్..

6) డ్యాన్సింగ్ క్వీన్ మాధురి దీక్షిత్..

బాలీవుడ్ డ్యాన్స్ క్వీన్ మాధురి దీక్షిత్ అందరికంటే ప్రత్యేకంగా జీవిస్తోంది. ఈమె 90లో అత్యంత విజయవంతమైన నటి. ఈమె కూడా సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ కలిగి ఉంది. ఇక ఆమె భర్త అయితే ఒకటి కంటే జెట్ లను కలిగి ఉన్నాడు.

English summary

Indian Cinema Actresses Who Own Private Jet

The life of Bollywood stars seems an ideal life - private bodyguards, round-the-clock security, expensive homes, holidays etc. It seems they got it all on a platter or some just married ultra-rich people. So much so, that some of these Bollywood actresses even own private jets and proudly show them off on social media! In fact, they regularly update their fans with sneak-peeks into their opulence.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more