Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
భారత దేశంలో టాప్ 5 వ్యాపార దిగ్గజ నారీమనులు, ఎంతో మంది మహిళలకు వీరు ఆదర్శం.. వారి విజయాలకు ప్రపంచం సలాం
భారత దేశంలో టాప్ 5 వ్యాపార దిగ్గజ నారీమనులు, ఎంతో మంది మహిళలకు వీరు ఆదర్శం.. వారి విజయాలకు ప్రపంచం సలాం
ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అనేక రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఈ రంగంలో మహిళలు ఉన్నారు. ఈ రంగంలో మహిళలు లేరు అనే మాట ఇప్పుడు వినపడటం లేదు. ప్రతి రంగంలో కూడా మహిళలు వారి సత్తా చాటుకుని పురుషులకు సవాలుగా నిలుసున్న ఈ నారీలోకానికి నిజంగా చేతులు ఎత్తి నమస్కరించాలి. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంలో భారతదేశంలో వివిద రంగాల్లో తమ సత్తా చాటుకున్న కొంత మంది మహిళల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. భారతదేశంలోని ఎంతో మంది మహిళలకు వీరు ఆదర్శంగా నిలిచారు.

పెప్సీకో సీఇవో ఇంద్ర కృష్ణమూర్తి నూయి
ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ప్రశంసలు తెచ్చిన ప్రముఖ మహిళల్లో ఇంద్ర కృష్ణమూర్తి నూయి గురించి మనం మాట్లాడుకోవాలని. ప్రస్తుతం ఇంద్ర కృష్ణమూర్తి నూయి పెప్సికో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెన్నైలో పుట్టి పెరిగి అక్కడే చదివి భారతదేశంలో మొదటిసారి జాన్సన్ అండ్ జాన్స్ లో ఉద్యోగంలో చేరారు. తరువాత ఇంద్ర కృష్ణమూర్తి నూయి పెప్సీకో సీఇవో స్థాయికి ఎదిగారు. ఇంద్ర కృష్ణమూర్తి నూయి సేవలు గుర్తించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ఇంద్ర కృష్ణమూర్తి నూయికి 2007లో భారత ప్రభుత్వం పధ్మభూషణ్ అవార్డును అందించింది.

కిరణ్ మంజుదార్ షా
కిరణ్ మజుందార్ షా ఒక భారతీయ బిలియనీర్. బెంగళూరుకు చెందిన బయోకాన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా కిరణ్ మంజుదార్ షా పని చేస్తున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అధ్యక్షురాలిగా కూడా ఆమె పని చేశారు. 2019 లో ఫోర్బ్స్ జాబితాలో కిరణ్ మంజుదార్ షా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చేరింది. ఇప్పటి వరకు కిరణ్ మంజుదార్ షా పద్మశ్రీ,, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, అమెరికన్ ఇండియా ఫౌండేషన్ మరియు కార్పొరేట్ లీడర్‌షిప్ అవార్డు, భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్, ప్రాంతీయ అభివృద్ధి కోసం నిక్కీ ఆసియా అవార్డును అందుకున్నారు. సైన్స్ అండ్ కెమిస్ట్రీకి చేసిన కృషికి ఒత్మార్ గోల్డ్ మెడల్ అందుకున్నారు.

వందనా లూత్రా
ఆడవాళ్లు అందానికి ఎంత ప్రధాన్యత ఇస్తారో కొత్తగా చెప్పనవసరం లేదు. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆడవాళ్లు ఎక్కువగా అందం మీద శ్రద్ద చూపిస్తారు. ఆ ట్రిక్ పట్టుకున్న వందనా లూత్రా ఎల్ సీసీ హెల్త్ కేర్ లిమిటెడ్ స్థాపించి ప్రసిద్ధ భారతీయ మహిళా వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు. వందనా లూత్రా బ్యూటీ అండ్ వెల్‌నెస్ సెక్టార్ స్కిల్ అండ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ గా పని చేశారు. ఇక 2016 ఫోర్బ్స్ ఆసియా జాబితాలోని 50 మంది పవర్ బిజినెస్ ఉమెన్ జాబితాలో వందనా లూత్రా 26వ స్థానంలో ఉన్నారంటే ఆమె ఎంత కష్టపడి పని చేశారో అర్థం చేసుకోవచ్చు. వీఎల్ సీసీ హెల్త్ కేర్ దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆఫ్రికాలోని 13 దేశాల్లోని 153 నగరాల్లో 326 బ్రాంచ్ ల్లో ఉన్నాయి. సుమారు 4000 మంది ఉద్యోగులు వందనా లూత్రా దగ్గర పని చేస్తున్నారు.

వాణి కోలా
ప్రపంచంలోని అత్యంత గుర్తింపు పొందిన పెట్టుబడిదారులలో ఒకరిగా వాణి కోలా గుర్తింపు తెచ్చుకున్నారు. వాణికోలా భారతీయ వెంచర్ క్యాపిటలిస్ట్, అలాగే కలారి క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్. 2018, 2019 సంవత్సరాల్లో ఇండియన్ బిజినెస్ ఫార్చ్యూన్ ఇండియాలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో వాణి కోలా పేరు చేర్చబడింది. ఇది మాత్రమే కాదు, వాణికోలా భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా ఫోర్బ్స్ ఎంపిక చేసింది. వాణి కోలా కూడా భారతదేశం ఎంతో గర్వించ దగ్గ మహిళా వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు.

క్వీన్ ఆఫ్ హెర్బల్ గా సక్సస్
క్వీన్ ఆఫ్ హెర్బల్ కేర్‌గా ప్రసిద్ధి చెందిన షహనాజ్ హుస్సేన్ చాలా కాలం క్రితం షహనాజ్ హెర్బల్స్ ఇంక్ అనే సంస్థను స్థాపించి ఆమె సత్తా చాటుకున్నారు. మొదటి హెర్బల్ సెలూన్‌ను 1971లో తన ఇంటి నుండి ప్రారంభించిన షహనాజ్ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేడు షహనాజ్ సంస్థ హెర్బల్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 ఫ్రాంఛైజీలు ఉన్నాయి. షహనాజ్ సాధించిన విజయాలకు భారత్ నిర్మాణ్ అవార్డు, పద్మశ్రీ, రాజీవ్ గాంధీ సద్భావన అవార్డులతో పాటు ఇంకా ఎన్నోఎన్నో అవార్డులు ఆమె అందుకున్నారు. ఇలాంటి వారు భారతదేశంలో ప్రతి స్త్రీకి ఆదర్శంగా నిలుస్తున్నారు. మగాళ్లకంటే మేమే ఎందులోనే తక్కువ కాదు అని వీళ్లు నిరూపించుకోవడమే కాకుండా సాటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.



Click it and Unblock the Notifications