Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం!
జనవరి మాసం రాశి ఫలితాలు 2020, ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయం...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈనెల ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
2020 నూతన సంవత్సరంలోని తొలి నెల అయిన జనవరిలో ద్వాదశ రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఇలా ఉన్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం మీ రాశి చక్రాలపై నక్షత్రాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

ఏవైనా సవాళ్లు ఎదురయ్యే అవకాశాలుంటే వాటికి పరిష్కార మార్గాలను కనుగొనండి. అలాగే మీరు ఈ నెల మొత్తం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి...

మేషరాశి
ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలోని మొదటి నెలలో ఆరోగ్య పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. అయితే నిర్లక్ష్యంగా మాత్రం ఉండకండి. జాగ్రత్తగా ఉండండి. పని విషయంలో పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది. మీరు సొంత వ్యాపారం కలిగి ఉంటే ఈ నెలలో మీరు మంచి ఫలితాలను పొందొచ్చు. మీరు పెట్టుబడి కూడా పెట్టొచ్చు. ఇది మీకు గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ నెలలో మీ నివాస స్థలంలో కూడా మార్పులు జరగొచ్చు. ఈ నెలలో ఇంట్లో పెద్ద వివాదం ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులతో విభేదాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మీరు మానసికంగా బాధపడతారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
అనుకూలమైన పంచభూతం : అగ్ని
అనుకూలమైన గ్రహం : మార్స్
లక్కీ నంబర్లు : 10, 18, 27, 34, 44
లక్కీ డేస్: సోమవారం, ఆదివారం, శనివారం, బుధవారం
లక్కీ కలర్స్ : గ్రీన్, ఎల్లో, బ్రౌన్, డార్క్ రెడ్

వృషభ రాశి...
ఈ రాశి వారు కొత్త సంవత్సరంలోని తొలి నెలలోనే శృంగార జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే దంపతుల మధ్య మంచి అవగాహన వల్ల ప్రేమ పెరుగుతుంది. పని విషయంలో మరింత అవగాహన పెంచుకోవడానికి కొత్త ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి. మీరు వ్యాపారం చేస్తుంటే పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ నెలలో లాభం వచ్చే అవకాశం ఉంది. మీ పనిలో ఏదైనా అంతరాయం కలిగి ఉంటే అది కూడా ఈ కాలంలో ముగిసే అవకాశం ఉంది. ఈ నెల విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. ఈనెలలో ఆర్థికంగా ఎలాంటి పెద్ద సమస్యలు ఉండవు.
అనుకూలమైన పంచభూతం : భూమి
అనుకూలమైన గ్రహం: శుక్రుడు
లక్కీ నంబర్లు : 9, 11, 25, 39, 46, 50
లక్కీ డేస్ : మంగళవారం, సోమవారం, ఆదివారం, శుక్రవారం
లక్కీ కలర్స్ : ముదురు పసుపు, తెలుపు, గులాబీ, ఆకుపచ్చ

మిధున రాశి...
ఈ రాశి వారికి ఈ నెలలో పూర్తి పురోగతి ఉంటుంది. మీరు ఈ నెలలో ప్రతి విషయంలోనూ మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఉద్యోగస్తులైతే మీకు ట్రాన్స్ ఫర్ లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో మీ పని పట్ల మీ కార్యాలయంలో మీకు మంచి గౌరవం కూడా లభించవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే కొంచెం ఓపికగా వేచి ఉండాలి. కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు నిరంతరం ప్రయత్నిస్తుంటే త్వరలో మీ కోరిక నెరవేరుతుంది. గత సంవత్సరంలో పెండింగులో ఉండిపోయిన పనులు ఈనెలలో పూర్తి కావచ్చు. కానీ దీని కోసం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
ఆర్థిక పరంగా ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే మీకు ఆర్థిక సహాయం అవసరమైతే, మీకు మీ ప్రియమైనవారి నుండి సకాలంలో సహాయం లభిస్తుంది.
అనుకూలమైన పంచభూతం: గాలి
అనుకూలమైన గ్రహం: మెర్క్యురీ
లక్కీ నంబర్లు : 4, 15, 28, 34, 41, 59
లక్కీ డేస్ : శుక్రవారం, ఆదివారం, గురువారం, శనివారం
లక్కీ కలర్స్ : ఎల్లో, మెరూన్, ఆకాశం, డార్క్ గ్రీన్, వైట్

కర్కాటక రాశి...
ఈ రాశి వారికి ఈ నెల ఆశ్చర్యకరమైన విజయం లభిస్తుంది. ఆర్థికంగా కూడా కూడా మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఈ కాలంలో పెట్టుబడి పెడితే మీరు ఊహించిన దాని కంటే ఎక్కువ రాబడిని పొందవచ్చు. ఇది మాత్రమే కాదు. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వాటిలో కూడా మీకు అనుకూలమైన నిర్ణయం వెలువడవచ్చు. మీరు కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ పనిని పూర్తి చేయడంలో సమస్య ఉంటే మీ సీనియర్లు మద్దతు ఇస్తారు. ఈ నెల వ్యాపారులకు కూడా మంచిది. మీ కుటుంబ జీవితంలో కూడా అనుకూలత ఉంటుంది.
అనుకూలమైన పంచభూతం : నీరు
అనుకూలమైన గ్రహం: చంద్రుడు
లక్కీ నంబర్లు : 6, 9, 20, 33, 49, 56
లక్కీ డేస్: ఆదివారం, బుధవారం, మంగళవారం, సోమవారం
లక్కీ కలర్స్ : బ్లూ, క్రీమ్, పర్పుల్, లైట్ ఎల్లో

సింహ రాశి..
ఈ రాశి వారికి ఈ నెల మొత్తం మంచిగా ఉంటుంది. మీరు కొన్ని పనులలో మంచి విజయాన్ని పొందుతారు. మరోవైపు మీరు విసుగు చెందుతారు. ఈ సమయంలో మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మీరు ఈ నెల మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అందుకే ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోండి. ఈనెలలో మీ పనిలో అకస్మాత్తుగా కొన్ని తప్పులు జరగొచ్చు. దీని వల్ల మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. మీ కోరికలు చాలా వరకు నెరవేరవు. ఆర్థికంగా కూడా ఒడిదుడుకులు ఎదురవుతాయి.
అనుకూలమైన పంచభూతం: అగ్ని
అనుకూలమైన గ్రహం: సూర్యుడు
లక్కీ నంబర్లు : 5, 9, 17, 28, 36, 49
లక్కీ డేస్: సోమవారం, గురువారం, మంగళవారం, శనివారం
లక్కీ కలర్స్: పింక్, డార్క్ రెడ్, స్కై బ్లూ, నారింజ

కన్య రాశి..
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. విద్యార్థుల పరీక్షలకు సిద్ధమవుతుంటే చిత్తశుద్ధితో అధ్యయనం చేయాలి. అప్పుడు తప్పకుండా విజయం సాధిస్తారు. అయితే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు మాత్రం విజయం సాధించలేరు. కానీ నిరుత్సాహపడాల్సిన పనిలేదు. ప్రయత్నం చేస్తూ ఉంటే త్వరలోనే మీకు శుభవార్త వినిపిస్తుంది. ఆర్థిక పరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మీరు డబ్బు సంపాదించేందుకు చాలా కష్టపడాలి. మీ కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు రావచ్చు. అది మీ సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
అనుకూలమైన పంచభూతం: భూమి
అనుకూలమైన గ్రహం: మెర్క్యురీ
లక్కీ నంబర్లు : 2, 11, 18, 20, 35, 44
లక్కీ డేస్ : గురువారం, సోమవారం, ఆదివారం, శుక్రవారం
లక్కీ కలర్స్: క్రీమ్, వైట్, గ్రీన్, బ్లూ

తుల రాశి..
ఈ రాశి వారికి ఈనెల చాలా అనుకూలంగా ఉంటుంి. పని విషయంలో మీరు మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. మీరు ఈనెలలో పూర్తి అంకితభావంతో పనిని పూర్తి చేస్తారు. మీ పనితీరు కూడా ఎంతో ప్రశంసించబడుతుంది. మీ సీనియర్లు కూడా మీ పని పట్ల చాలా సంతృప్తి చెందుతారు. ఈ సమయంలో మీరు కూడా ప్రయోజనం పొందవచ్చు. ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయంలో కొంత ప్రతికూలత ఉంటుంది. ఈనెలలో కొన్ని మార్పులు వేగంగా జరుగుతాయి. మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. మీరు వివాహం చేసుకుంటే ఈ నెల మీకు చాలా మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు
అనుకూలమైన పంచభూతం: గాలి
అనుకూలమైన గ్రహం: శుక్రుడు
లక్కీ నంబర్లు : : 8, 19, 23, 38, 45
లక్కీ డేస్: శుక్రవారం, బుధవారం, సోమవారం, ఆదివారం
లక్కీ కలర్స్: పసుపు, మెరూన్, బ్రౌన్, రెడ్

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు అదనపు డబ్బును సంపాదించగలరు. మీరు చిన్న పని ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. చాలా కాలంలో మీ మనసులో ఉన్న కోరికలను ఈనెలలో నెరవేర్చుకోవచ్చు. ఈ కాలంలో ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. పరస్పర సమన్వయం బలంగా ఉంటుంది. మీరు ఇంటి పెద్దల అభిమానం మరియు ఆశీర్వాదం పొందుతారు. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. మీ పనిని వేగంగా పూర్తి చేయగలుగుతారు.
అనుకూలమైన పంచభూతం: నీరు
అనుకూలమైన గ్రహాలు: మార్స్ మరియు ప్లూటో
లక్కీ నంబర్లు : 3, 16, 23, 37, 47, 52
లక్కీ డేస్ : బుధవారం, ఆదివారం, శనివారం, మంగళవారం
లక్కీ కలర్స్ : వైట్ గ్రీన్, ఎల్లో, బ్లూ

ధనస్సు రాశి..
ఈ రాశి వారు ఈనెల చాలా కష్టపడాలి. మీరు ఎంతగా ప్రయత్నిస్తే అంత పురోగతి ఉంటుంది. గ్రహాల మార్పుల ప్రభావం మీరు ఫలాలను పొందడం లేదని భావిస్తారు. అయితే అవకాశాలను అస్సలు వదులుకోవద్దు. మిమ్మల్నీ మీరు బలంగా నమ్మండి. ముందుకు సాగండి. ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దు. ఈనెల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే, ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు మీరు అదనపు జాగ్రత్త వహించాలి. లేదంటే మీరు నష్టపోవచ్చు. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితం సజావుగా సాగుతుంది. శృంగార జీవితంలో ఈ సమయంలో, మీరు స్థిరత్వాన్ని అనుభవిస్తారు.
అనుకూలమైన పంచభూతం: అగ్ని
అనుకూలమైన గ్రహం: బృహస్పతి
లక్కీ నంబర్లు : 2, 8, 13, 18, 29, 33, 45
లక్కీ డేస్ : శనివారం, మంగళవారం, సోమవారం, బుధవారం
లక్కీ కలర్స్ : ఎల్లో, డార్క్ గ్రీన్, రోజ్, స్కై బ్లూ, పర్పుల్

మకర రాశి..
ఈ రాశి వారు ఈనెలలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. దాని వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు స్థిరంగా ఉంటే, మీ పని పురోగమిస్తుంది. ఈ నెలలో మీకు పనిభారం చాలా ఎక్కువగా పెరుగుతుంది. మీరు మీ వంతుగా కృషి చేస్తారు. అయితే మీకు అనుకూలమైన ఫలితాలు రాకపోవచ్చు. ఈ నెల వ్యాపారులకు చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా మరియు అవగాహనతో ముందుకు సాగడం మంచిది. పెట్టుబడి పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. నెల ప్రారంభంలో మీరు చాలా ప్రశాంతంగా గడుపుతారు. తర్వాత కొద్దిగా సమస్యలు ఎదురవుతాయి. అయితే ఎక్కువగా చింతించటం మానేయండి.
అనుకూలమైన పంచభూతం : భూమి
అనుకూలమైన గ్రహం: శని
లక్కీ నంబర్లు : 9, 14, 27, 30, 46, 51
లక్కీ డేస్ : ఆదివారం, మంగళవారం, గురువారం, సోమవారం
లక్కీ కలర్స్ : వైట్, మెరూన్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్

కుంభ రాశి..
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈనెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ చదువు పూర్తయిన వెంటనే మీకు మంచి కంపెనీలో మంచి స్థానం లభించే అవకాశం ఉంది. అయితే మీరు పరీక్షకు సిద్ధమవుతుంటే తప్పకుండా కష్టపడాలి. మీరు మీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తేనే మీకు త్వరలో ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సమయం వ్యాపారులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల గురించి ప్రస్తావిస్తే మీరు లాభం పొందవచ్చు. అయితే మీ ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఈ నెలలో మీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగే అవకాశం ఉంది. అలాగే మీ వైవాహిక జీవితంలో ఆనందం కూడా ఉంటుంది.
అనుకూలమైన పంచభూతం: గాలి
అనుకూలమైన గ్రహం: యురేనస్, సాటర్న్
లక్కీ నంబర్లు : 1, 5, 18, 24, 37, 48, 59
లక్కీ డేస్: మంగళవారం, ఆదివారం, సోమవారం, శనివారం
లక్కీ కలర్స్ :డార్క్ గ్రీన్, రోజ్, వైట్, ఎల్లో, రెడ్

మీన రాశి..
ఈ రాశి వారు ఈ నెలలో చాలా బిజీగా ఉంటారు. దీని వల్ల కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపలేరు. ఇది మీ సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీకు మీరే గందరగోళానికి గురవుతారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు నిరుద్యోగులైతే మీరు ఈ నెలలో శాశ్వత ఉద్యోగం పొందవచ్చు. అయితే కొత్త పని విషయంలో అనుకూలంగా లేదు. మీరు నెల మధ్యలో మానసికంగా బలహీనపడే అవకాశముంది. ఆర్థిక పరంగా ఈనెల మీకు సాధారణంగా ఉంటుంది.
అనుకూలమైన పంచభూతం : నీరు
అనుకూలమైన గ్రహం: నెప్ట్యూన్, బృహస్పతి
లక్కీ నంబర్లు : 3, 19, 23, 39, 47, 55
లక్కీ డేస్ :గురువారం, సోమవారం, శుక్రవారం, ఆదివారం
లక్కీ కలర్స్ : ఎల్లో, రెడ్, స్కై బ్లూ, ఆరెంజ్, మెరూన్



Click it and Unblock the Notifications











